పండ్ల రకాల్లో అరటిపండుది ప్రత్యేక స్థానం. అరటిపండంటే నచ్చని వారు చాలా అరుదు. సాదరంగా చాలా మంది భోజనం చేసిన తరువాత, బ్రేక్ఫాస్ట్ అయ్యాక తింటూ ఉంటారు. నిమిషాల్లో ఎనర్జీ ని ఇచ్చేయడం, ఎక్కువ పోషకాలను కలిగి ఉండడం అరటిపండు ప్రత్యేకత. అయితే రోజుకు ఓ అరటిపండు తప్పనిసరి గా తింటూ ఉండాలి. అరటిపండు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందట.

banana

ప్రతి అమ్మాయి రోజుకు కనీసం ఒక్క అరటిపండును అయినా తినాలట. దేశం లో దాదాపు ఎనభై శాతం మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని అంచనా. శరీరం లో ఐరన్ కొరత కారణం గా రక్తహీనత ఏర్పడుతుంది. అటువంటి వారు రోజుకో అరటిపండు తినడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడచ్చట. అలాగే అరటిపండు శరీరం లోని చెడు కొలెస్టరాల్ ను నియంత్రిస్తుంది. కొవ్వు పెరగకుండా చేసి గుండెను రక్షిస్తుంది. అలాగే ఎముకలను కూడా బలపరుస్తుంది. కాల్షియం లోపం వల్ల వచ్చే ఇబ్బందులను రోజుకో అరటిపండు తినడం ద్వారా ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి కి గురి అవుతున్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. డిప్రెషన్ ను నివారిస్తుంది. అరటిపండు లో ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది. ఇది జీర్ణాశయ వ్యవస్థ సక్రమం గా పని చేసేలా చేస్తుంది.