Ads
ప్రస్తుతం మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మన బరువు మనకు చాలా సార్లు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. మనలో చాలా మంది బరువు తగ్గాలనుకున్నప్పటికీ తగ్గ లేకపోతారు. అయితే.. బరువు తగ్గించుకోవాలి అనుకోగానే చాల మంది చేసే మొట్ట మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం.
Video Advertisement
దానికి కారణం ఏంటంటే వైట్ రైస్ వలన చాలా కాలరీస్ అందుతాయి కాబట్టి బరువు పెరిగిపోతూ ఉంటామని భావిస్తూ ఉంటారు. బరువు మాత్రమే కాదు.. ఇతర చిన్న చిన్న సమస్యలకి కూడా అన్నం తినడం మానేస్తూ ఉంటారు.
అయితే.. అన్నాన్ని పూర్తిగా మానేయడం సరికాదు. రోజులో తప్పనిసరిగా కొంతైనా అన్నం తినాలి. అన్నం వలన కలిగే ఈ లాభాలేంటో తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా రోజూ అన్నం తింటారు. ఇంతకీ ఆ లాభాలేంటో తెలుసుకోండి.
1. మనం అన్నం ఆహరం గా తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే మంచి సూక్ష్మ జీవులకు ఆహరం లభిస్తుంది. ఇవి మన శరీర మెటబాలిజం ని క్రమబద్ద్దీకరిస్తాయి.
2. సింగిల్ పోలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నం తినడం వలన ప్రోటీన్లు లభిస్తాయి. ఈ రైస్ తో పాటు మొలకలు, పెరుగు, పల్సెస్ ను తీసుకోవడం వలన ఎంతో బలం లభిస్తుంది.
3. అలాగే చక్కర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవడం కోసం అన్నం తక్కువగా పెట్టుకుని కూరలు, పప్పు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.
4. శరీరంలో ఉండే ఎక్కువ ప్రొలాక్టిన్ స్థాయి వలన చర్మంపై ఏర్పడే రంధ్రాలను అన్నం తొలగిస్తుంది.
5. అలాగే థైరాయిడ్ వలన పాడైన జుట్టు కూడా తిరిగి బలం పుంజుకుంటుంది.
6. అన్నం త్వరగా జీర్ణం అయిపోతుంది. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. యంగ్ ఏజ్ లో ఉన్నవారు.. వయసు పైబడ్డా షుగర్ లేని వారు నిరభ్యంతరంగా కావాల్సినంత రైస్ ను తీసుకోవచ్చు.
End of Article