Ads
అరటి పండు తినడానికి ఈజీగా ఉంటుంది. వెంటనే బలాన్నిస్తుంది. శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకలు ధృడంగా ఉండడానికి సాయపడుతుంది. అంతే కాకుండా మార్కెట్ లో చవక ధరలకే లభిస్తాయి. పేద, ధనిక అందరికి ఈ అరటిపండ్లు అందుబాటులో ఉంటాయి.
Video Advertisement
నిమిషాల్లో ఎనర్జీ ని ఇచ్చేయడం, ఎక్కువ పోషకాలను కలిగి ఉండడం అరటిపండు ప్రత్యేకత. అరటిపండు తినడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడచ్చట. అలాగే అరటిపండు శరీరం లోని చెడు కొలెస్టరాల్ ను నియంత్రిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న అరటిపండ్లు అన్నీ పూర్తిగా పండనివే ఉంటున్నాయి. పూర్తి పసుపు రంగులో నిండుగా కనిపించే పండ్లు చూడడానికి బాగుంటాయి. కానీ, ఇవి పూర్తిగా పండినవి కాదు. పూర్తిగా పండిన అరటిపండ్లపై నల్లని మచ్చలు ఉంటాయి. న్యూట్రీషన్లు చెబుతున్న దాని ప్రకారం పూర్తిగా పండిన అరటిపండ్లను తింటేనే మంచిది. ఇలా ఎందుకు చెబుతున్నారో.. ఇప్పుడు కారణాలు తెలుసుకుందాం.
బాగా పండిపోయిన అరటిపండ్లు సులభంగా జీర్ణం అయిపోతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. బాగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. బాగా పండిన అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతని నివారించి బిపిని అదుపులో ఉంచుతుంది. నీరసం నిస్సత్తువ తగ్గిపోయి ఉత్సాహంగా ఉంటారు. డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు బాగా పండిన అరటిపండుని తినడం కంటే.. ఓ మోస్తరుగా ఉన్న అరటిపండునే తినాలి.
End of Article