Ads
నడక.. అందరికి అందుబాటులో ఉండి.. అందరూ చేయదగిన వ్యాయామం.. ఈ విషయం అందరికి తెలుసు. కానీ కేవలం పొద్దున్న లేచేందుకు బద్దకించి నడకను పక్కన పెట్టేస్తారు అందరూ. అంతే కాకుండా బిజీ లైఫ్ కారణంగా మనిషి ఒత్తిడి లోనే కూరుకుపోతున్నాడు. వేళకు తినడం లేదు. సమయానికి నిద్ర పోవడం లేదు. కొత్త కొత్త రోగాలు కొనితెచ్చుకుంటున్నాడు. బరువు పెరుగుతున్నాడు. శరీరానికి చిన్న గాయం అయినా నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి.
Video Advertisement
అయితే ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే. కనీసం వ్యాయామాలూ చేసినా బయటపడొచ్చు. కానీ, వ్యాయామాలకు సమయం ఇవ్వడం లేదు ఇప్పటి జనం. అయితే కనీసం నడవడం అయినా చేయాలంటున్నారు నిపుణులు.
అయితే చెప్పులు వేసుకోకుండా నడవటం కారణంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట. చెప్పులు లేకుండా నడవడం వలన రక్త సరఫరా బాగా జరిగి మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వారం లో ఒక్క రోజైనా చెప్పులు లేకుండా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. చెప్పులు లేకుండా నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
#1 రోజుకు రెండుసార్లు, పదిహేను నిమిషాలపాటు వట్టి భూమి పై చెప్పులు లేకుండా నడవాలంట. ఒకవేళ వట్టి భూమి దగ్గర లేకపోతే, ఫుట్ పాత్ పై నడిస్తే మేలు. ఇలా చేస్తే పాదాలు మసాజ్ ను ఆస్వాదించడం ప్రారంభిస్తాయి. మీ శారీరక నొప్పులు చాలా వరకు వారంలోనే తగ్గుతాయి.
#2 చెప్పులు లేకుండా నడవడం కారణంగా మన కంటి కి ఎలాంటి సమస్యలు తలెత్తవు. మనకు కంటి చూపు ఇంకా మెరుగు అవుతుంది. మనం చెప్పులు లేకుండా నడవడం కారణంగా మంచి నిద్రను ఆస్వాదించవచ్చు ను. నిద్ర పోవటం కారణంగా మనకు రిలాక్స్ అనేది దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
#3 గ్రౌండింగ్ వలన శారీరకంగా మానసికంగా అలెర్ట్‌గా తయారవుతాం. చుట్టుపక్కల పరిసరాల గురించి ఒక అవగాహన వస్తుంది. ఇవన్నీ కలిసి బ్లడ్ ప్రెజర్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. బ్లడ్ ప్రెజర్ ని నార్మలైజ్ చేయడానికి నాచురోపతీ లో పది నుండి పదిహేను నిమిషాలు చెప్పులు లేకుండా నడవమని చెప్తారు.
#4 గ్రౌండింగ్ వలన ఇమ్యూనిటీ నాచురల్ గా పెరుగుతుంది. భూమిలో ఉండే మైక్రోబ్స్ స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళి మంచి బ్యాక్టీరియాని పెంచి ఇమ్యూన్ సిస్టమ్ ని బలంగా చేస్తాయి.
#5 చెప్పులు లేకుండా నడవటం వలన పాదాల్లో ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి, ఇది శరీరం మొత్తానికీ హెల్ప్ చేస్తుంది. జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. అంతే కాకుండా పాదాల్లోని 72 వేల నరాలు యాక్టీవ్ గా ఉంటాయి.
చెప్పులు లేకుండా నడిస్తే రక్త ప్రసరణ సాఫీగా జరగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చెప్పులు లేకుండా నవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి నిత్యం వట్టి కాళ్లతో నడవడం అలవాటు చేసుకోవడం మంచింది.
End of Article