ఈ మధ్యకాలంలో గ్యాడ్జెట్లు వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. చేతిలో డబ్బులు లేకపోయినా గడపగలుగుతారు గాని మొబైల్ లేకపోతే ఒక్క నిమిషం కూడా జీవించలేక పోతున్నారు.

Video Advertisement

ఈ సమస్య పిల్లల్లో మరీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు అధిక ప్రేమ పిల్లలకు శాపంగా మారుతోంది. వాళ్లు ఎక్కువగా మారాం చేస్తున్నారని మొబైల్ ను ఇచ్చి వాళ్లని సముదాయిస్తుంటారు. తల్లిదండ్రులు చేసిన ఆ అలవాటు వలన పిల్లలు మొబైల్ కి  ఎక్కువగా ఎడిట్ అయిపోతున్నారు.

ఈ మొబైల్ అనే భూతం నుంచి మన పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలి అనేది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారుతుంది. వాళ్లను ఫోన్ అలవాటు తప్పించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. టీవీలు గాని, ఫోన్ లో గాని పిల్లలకు ఎక్కువగా అలవాటు చేయడం వలన  వాళ్ల మానసిక రుగ్మతకు మరియు  కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

representative picture

ఈ అద్భుతమైన టెక్నిక్ ద్వారా ఇంకెప్పుడూ మీ పిల్లలు ఫోన్ ముట్టుకోకుండా విసిరివేస్తారు. మరి ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం రండి.. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ, ఫోను మరియు టీవీలను అలవాటు చేయకూడదు. మూడు సంవత్సరాల పైన వారికి  ఒకవేళ ఇచ్చినా కూడా విషయ పరిజ్ఞానం కోసమే మొబైల్  అనేది అందించాలి. అంటే ఎడ్యుకేషన్ పరంగా అవగాహన కల్పించే విధంగా ఉండాలి.

తల్లిదండ్రులు కూడా మొబైల్ వాడకం అనే దానికి ఒక పరిమితి నిర్ణయించుకోవాలి.  ఎందుకంటే ఎక్కువ శాతం పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ ఉంటారు. నువ్వు ఉపయోగిస్తున్నావు కదా నేను ఎందుకు ఉపయోగించకూడదు అనే ప్రశ్న మనకు పిల్లల నుంచి  ఎదురవుతుంది. అలాంటి ప్రశ్న పిల్లల నుంచి మనకు ఎదురు కాకూడదని అనుకుంటే మొబైల్ వాడకానికి పరిమితి నిర్ణయించుకోవాలి. భోజనం చేసే ముందు, నిద్రించే గదిలోనూ మొబైల్ వాడడం తల్లిదండ్రులు మానుకోవాలి.kids 5

పిల్లలు అనే వాళ్లు మనకు అద్దం లాంటి వారు మనము ఏం చేస్తే వాళ్లు కూడా అదే చేస్తారు. టెక్నాలజీ మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయంపై వాళ్లకు అవగాహన కల్పించాలి. పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్, గ్రూప్ గేమ్ నేర్పించడం ద్వారా మొబైల్ జోలికి వెళ్లకుండా డైవర్ట్ అవుతారు. ఇలాంటి చిన్న చిన్న పరిమితుల ద్వారా పిల్లలను మొబైల్ నుంచి మనం దూరం చేయవచ్చు.