జైల్ లో ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధుడు “భగత్ సింగ్”… తన సోదరుడికి రాసిన ఉత్తరం చూసారా..?

జైల్ లో ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధుడు “భగత్ సింగ్”… తన సోదరుడికి రాసిన ఉత్తరం చూసారా..?

by Mounika Singaluri

90 సంవత్సరాల క్రితం భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, శివరామ్ రాజ్ గురులను 1931 మార్చి 31న పంజాబ్ లోని హుస్సేన్ వాలా (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లో ఉరితీశారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ వారు జాన్ సాండర్స్ హత్యలో ప్రమేయం ఉన్నందుకు ఉరితీశారు, ఆయనను బ్రిటిష్ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ గా వారు తప్పుగా భావించారు. జాతీయవాద నాయకుడు లాలా లజపతిరాయ్ మరణంలో స్కాట్ కీలక పాత్ర పోషించాడని వారు విశ్వసించారు.

Video Advertisement

భగత్ సింగ్ 27 సెప్టెంబర్ 1907 వ సంవత్సరంలో ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగా పట్టణంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి అనే దంపతులకు జన్మించారు. భగత్ సింగ్ మంచి గాయకుడు, కవిత్వం కూడా బాగా చెప్పేవారు. భగత్ సింగ్ 13వ ఏట ఉన్నప్పుడు జలియన్ వాలా భాగ్ ఉదంతం జరిగింది. భగత్ సింగ్ పై ఈ దుర్ఘటన చాలా ప్రభావం చూపింది. జలియన్ వాలా భాగ్ ఉదంతంలో కింద ఉన్న రక్తపు మట్టిని ఇంటికి తీసుకొని వచ్చి తిలకంలా దిద్దుకున్నాడు. అప్పడే బ్రిటీషర్లను తరుముతానని నిర్ణయించుకున్నాడు.

bhagath singh letter to his brother from jail..

కాన్సిట్యుయెంట్ అసెంబ్లీలో భగత్ బాంబ్ విసిరాడు, తరువాత లార్డ్ కర్జన్ ను తుపాకీతో కాల్చాడు. ఈ కేసులో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు శిక్ష పడింది. అలాగే పోలీస్ సాండర్స్ యొక్క హత్యలో భగత్ సింగ్ మరియు తన అనుచరులపై కేసు నమోదు చేసారు. జైల్లో ఉన్న సమయంలో తనను పొలిటికల్ ప్రిజనర్ గా గుర్తించాలని బుక్స్ మరియు న్యూస్ పేపర్లను చదవటానికి అనుమతించాలని కోరారు. జైలు లో ఉన్న సమయంలో సింగ్ మరియు ఇతర విప్లవ కారులు నిరాహార దీక్ష చేసారు.

bhagath singh letter to his brother from jail..

తర్వాత పంజాబ్ గవర్నర్‌కు భగత్‌సింగ్ మమ్మల్ని ఉరి తీయవద్దు, కాల్చి చంపండి అని కోరుతూ భగత్ సింగ్ బ్రిటీష్ అధికారికి లేఖ రాసారు. తర్వాత మార్చి 23న ఉరితీసినట్లు జైలు అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అయితే తన మరణానికి ముందు భగత్ సింగ్ జైలు నుంచి తన సోదరుడికి ఉర్దూ లో ఒక లేఖ రాసారు. ఆ లేఖను 1931 మార్చి 3న భగత్ సింగ్ తన తమ్ముడు కుల్తార్ సింగ్ కు రాశారు. ఆ లేఖలో భగత్ సింగ్, “అజీజ్ కుల్తార్, ఈ రోజు నీ కళ్లలో నీళ్లు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ రోజు నువ్వు చాలా బాధగా ఉన్నావు. మీ కన్నీళ్లు నేను తట్టుకోలేక పోతున్నాను. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకి వెళ్తూ ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.” అని సూచించారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.


You may also like