Ads
మనిషికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. కొన్ని విషయాలు కొన్ని పద్ధతుల్లో చేస్తేనే కరెక్ట్ అని నమ్ముతారు. అలాగే కొన్ని విషయాలని పాటిస్తారు. వారు పాటించడం మాత్రమే కాకుండా, తరతరాలుగా వారి కుటుంబీకులు కూడా పాటించేలాగా చూస్తారు. దాన్ని తరతరాల నుంచి వస్తున్న ఆచారాలు అని అంటారు. అందుకు వెనుక కొన్ని కారణాలు కూడా ఉంటాయి. కానీ ఆ కుటుంబంలో ఉన్న వారికి మాత్రమే ఆ కారణాలు తెలిసి ఉంటాయి. సెలబ్రిటీలకు కూడా ఇలాంటి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. వారు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా కొన్ని విషయాలను మాత్రం పాటిస్తారు.
Video Advertisement
కొన్ని సంప్రదాయాలని తప్పకుండా ఆచరిస్తారు. అంబానీ కుటుంబం కూడా వారిలో ఒకరు. అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలుసు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి ముందు జరిగిన వేడుకల గురించి ఈ ప్రపంచం అంతా కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడ మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో వీళ్లు ధరించిన దుస్తుల ధర కోట్లల్లో ఉంటుంది. వేసుకున్న నగల ధర కూడా అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ల కోసం ప్రత్యేకంగా డిజైనర్ తో తయారు చేయించుకున్నారు. భారతదేశ డిజైనర్లు, అంతర్జాతీయ డిజైనర్ల బ్రాండ్స్ కి చెందిన దుస్తులని వీరు వేసుకున్నారు.
అయితే, అంబానీ కుటుంబంలో ఉన్న మహిళలని చూస్తే వాళ్ళందరిలో ఒక విషయం కామన్ గా ఉంది. వాళ్లందరి చేతికి ఒక నల్లని తాడు కట్టి ఉంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అదేంటి అంటే, సాధారణంగా దిష్టి తగలకుండా నల్ల తాడు కట్టుకుంటూ ఉంటారు. దుష్టశక్తుల నుండి ఇది కాపాడుతుంది అని నమ్ముతారు. కొంత మంది కాలికి ఇలాంటివి కట్టుకుంటే, మరి కొంత మంది మాత్రం చేతికి కట్టుకుంటారు. అంబానీ కుటుంబం కూడా ఇదే పద్ధతిని పాటిస్తూ దిష్టి తగలకుండా ఉండడానికి ఇలాంటి నల్ల తాడుని కట్టుకుంటారు.
అంబానీ కుటుంబం మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇదే పద్ధతిని ఆచరిస్తారు. ప్రియాంక చోప్రా వంటి వాళ్లు కూడా ఇలాంటి పద్ధతులు పాటిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక కూడా భారతీయ సంస్కృతులని మర్చిపోకుండా, ప్రియాంక చోప్రా తన కూతురికి నల్లని తాడుని కట్టారు. ఎంత గొప్ప స్థాయికి ఎరిగినా సరే సంస్కృతి సంప్రదాయాలని మాత్రం చాలా మంది సెలబ్రిటీలు పాటిస్తారు అనడానికి ఇదే ఒక నిదర్శనం ఏమో.
End of Article