మార్షల్‌ ఆర్ట్స్‌ లెజండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బ్రూస్‌ లీ.. పరిచయం అక్కర్లేని పేరు. మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావన వస్తే.. మొదట గుర్తొచ్చే పేరు బ్రూస్‌ లీ. చాలా తక్కువ కాలంలో వరల్డ్ వైడ్ గా ఖ్యాతి సాధించిన ఇతను అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. ఆయన 32 ఏళ్లకే చనిపోయాడు.

Video Advertisement

1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఇంచ్ దూరం పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి.

brucelee

నవంబర్ 27, 1940 జన్మించి జులై 20, 1973 వరకు ఉన్న బ్రూస్ లీ గురించి ప్రంపంచం మొత్తం తెలుసు. ఈయన అమెరికాలో జన్మించి హాంకాంగ్ లో పెరిగారు. శాన్‌ ఫ్రాన్సిస్కో అమెరికాలో లీయోచూన్, గ్రేసీలకు బ్రూస్‌ లీ జన్మించారు. బ్రూస్ లీ అసలు పేరు ‘లీ జున్ ఫాన్’. బ్రూస్‌ లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి థామ్‌ చీ చువాన్‌ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు.

brucelee excercise list in 1965..

కుంఫులో భాగమైన వింగ్‌ చున్‌ లో శిక్షణ కోసం ఇప్‌మెన్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. 18 ఏళ్ల వయస్సులోనే వీటన్నింటిని నేర్చుకున్నాడు బ్రూస్ లీ. 18 సంవత్సరాల నాటికే 12 సినిమాల్లో నటించాడు.

అయితే ఆ సమయం లో బాడీ ఫిట్నెస్ కోసం బ్రూస్ లీ కఠిన వ్యాయామాలు చేసేవాడు. ఆ వ్యాయామాల వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 1965 లో యాక్యున్గ్ జిమ్ లో బ్రూస్ లీ వ్యాయామాల లిస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అందులో స్క్వాట్స్, ఫ్రెంచ్ ప్రెస్, పుషప్స్, ట్రైసెప్ స్ట్రెచ్, డంబెల్ సర్కిల్, రివర్స్ కర్ల్, రిస్ట్ కర్ల్, సిటప్స్ వంటి వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఎన్ని సెట్స్ చెయ్యాలి.. ఎలా చెయ్యాలి అని ఇందులో రాసి ఉంది.

bruce lee training plan
వీటిని చూసిన నెటిజన్లు.. ఇంత కఠిన శ్రమ చేసారు కాబట్టే ఆయన అంత గొప్పవాడయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్ లీ. ఈ మార్షల్ ఆర్ట్స్ రారాజు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు.