Ads
మన చిన్నపుడు స్కూల్స్ బయట.. ఇంటి దగ్గర తిరుగుతూ కొందరు రంగు రంగుల కోడి పిల్లలను అమ్మేవారు గుర్తుందా..? అప్పట్లో మన డెడికేషన్ అలా ఉండేది. వీటిని రూపాయి పెట్టి కొనేవాళ్ళం. వీటికి మంచిగా ఫుడ్ పెట్టి.. ఇవి మళ్ళీ పిల్లలను పెడితే, వాటిని కూడా పెంచాలని రకరకాలుగా ఫామిలీ ప్లానింగ్ లు వేసేవాళ్ళం. కానీ, ఇవి మాత్రం మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ బతికేవి కాదు. మనం ఎంత జాగ్రత్తగా చూసినా అవి చనిపోయేవి.
Video Advertisement
చిన్నతనం లో కొందరు వీటిని వెడల్పాటి బుట్టలో పెట్టుకొచ్చి అమ్మేవారు. కిడ్డీ బ్యాంకు లో డబ్బులు తీసి మరీ వీటిని కొనేవాళ్ళం. అవి పెరిగి పెద్దవ్వాలని కోరుకునేవాళ్ళం. వాటికి గింజలో, అన్నమో ఏదో ఒకటి రోజు పెడుతూ మురిసిపోయే వాళ్ళం. కానీ, ఈ మురిపెం మూన్నాళ్ళ ముచ్చటే అన్నట్లు ఉండేది. ఇవి చాలా చిన్నగా ఉండడం వలన కాకులెత్తుకుపోవడమో, కుక్కలు పట్టుకుపోవడమో జరిగేది. లేకపోతె, ఓ నెల తిరిగేసరికి అవే చనిపోయేవి.
ఇవి గుడ్లు పెట్టలేవు. ఎందుకంటే ఇవన్నీ మగ కోడి పిల్లలే. మాములుగా గుడ్ల కోసం లేయర్ కోళ్లను పెంచుతారు. వీటిలో గుడ్లు పెట్టని మగ కోడి పిల్లలను వదిలించుకోవడం కోసం తక్కువ ధర కి అమ్మేస్తారు. కొందరు వ్యాపారులు వాటిని కొని, రకరకాల రంగులేసి అమ్ముతుంటారు. వాస్తవానికి ఇది ఇండియా లో నేరం. కోడిపిల్లలు రంగులేయడం, అమ్మడం, కొనడం కూడా నేరమే. రంగులు వేయడం మూగ జీవుల్ని హింసించినట్లు అవుతుంది. అందుకే ఇది ఇండియా లో నేరం గా పరిగణించబడుతోంది.
End of Article