విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవచ్చా.? చట్టం ఎలా ఉంది.?

విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవచ్చా.? చట్టం ఎలా ఉంది.?

by Anudeep

Ads

పెళ్లి అందరికి మధుర ఘట్టమే అయినా.. కొందరి జీవితాలలో మాత్రం అదో తీరని శోకం లా మిగులుతూ ఉంటుంది. పెళ్లి అయిన తరువాత దంపతుల మధ్య సఖ్యత కుదరకపోయినా.. గొడవలు ఎక్కువయినా కొందరు విడిపోవాలనుకుంటు ఉంటారు. వీరు కోర్టులలో సైతం విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. కేసు కోర్టులో విచారణ పూర్తీ చేసుకుని విడాకులు రావడం అంటే.. అది చాలా సమయం పట్టే విషయమే. ఏ పరిస్థితుల్లో విడాకులు రాకున్నా రెండవ వివాహం చేసుకోవచ్చో అడ్వొకేట్ ఆకుల రమ్య గారు ఈ విధం గా వివరించారు.

Video Advertisement

indian evidence act 1

భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తి (స్త్రీ లేదా పురుష) ఒకసారి వివాహం చేసుకున్న తరువాత ఆ బంధాన్ని గౌరవించాలి. దంపతులిద్దరికీ పొసగనప్పుడు.. ఆ బంధాన్ని గౌరవిస్తూ విడాకులు వచ్చే వరకు మరొక వివాహం చేసుకోకూడదు. అంటే విడాకులు రాకుండా మరో పెళ్లి చట్ట రీత్యా నేరం అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం ఈ కండిషన్ కి మినహాయింపు ఉంది.

indian evidence act 2

చాల మంది ఈ మినహాయింపుని పట్టుకుని.. యు ట్యూబ్ లలో వీడియో లు చూసో.. లేక మరోరకం గానో భావించి విడాకులు రాకుండానే పెళ్లి చేసుకుని ఇబ్బందుల్లో పడుతుంటారు. నిజానికి విడాకులు రాకుండా పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే.. వివాహం అయినా తరువాత భార్య గాని, భర్త గాని కనీసం ఏడేళ్ల పాటు కనిపించకుండా పోతే అప్పుడు సదరు వ్యక్తి విడాకులు రాకున్నా వివాహం చేసుకోవచ్చు.

indian evidence act 3

ఈ విషయం హిందూ, ముస్లిం పురాణాలలో కూడా ఉంది. హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం ఓ వ్యక్తి కనీసం పన్నెండేళ్ల పాటు కనిపించకుండా పోతే.. ఆ వ్యక్తి మరణించినట్లు అంగీకరిస్తారు. అలాగే.. ముస్లిం శాస్త్రాల ప్రకారం ఎవరైన ఒక వ్యక్తి 99 సంవత్సరాల పాటు కనిపించకపోతే వందవ సంవత్సరం లో ఆ వ్యక్తి మరణించినట్లు అంగీకరిస్తారు. అయితే.. ఇందుకు సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ చట్టం కూడా వివరణ ఇచ్చింది.

indian evidence act 4

ఇండియన్ ఎవిడెన్స్ ఆక్ట్ లో సెక్షన్ 107, 108 లు ఈ విషయాన్నీ స్పష్టం గా పేర్కొన్నాయి. అయితే.. ఒక మనిషి ఏడేళ్లు గా కనిపించడం లేదు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి..? ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం ఈ విషయాన్నీ ప్రూవ్ చేయగలిగితే.. ఆ వ్యక్తి విడాకులు రాకున్నా వివాహం చేసుకోవచ్చు. ఐతే.. ఇది ఎలా ప్రూవ్ చేయాలంటే.. ఎవరైనా ఒకరు మిస్ అయినపుడు వెంటనే పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయాలి.

indian evidence act 5

ఈ కేసు ఏడేళ్ల పాటు నడిచి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పటికీ సదరు మిస్ అయినా వ్యక్తి కనిపించని పక్షం లో మాత్రమే ఈ కేసు ఎఫ్ ఐ ఆర్ ను ఎవిడెన్స్ గా చూపించవచ్చు. అయితే.. ఇది అందరి విషయం లో పాజిబుల్ కాదు కాబట్టి ఈ విషయాన్నీ చాలా మంది పట్టించుకోవడం లేదు. అయితే.. కొందరు సగం సగం విషయాలు తెలుసుకుని విడాకులు రాకపోయినా వివాహాలు చేసుకోవచ్చు అనుకుని రెండవ వివాహం చేసుకుంటున్నారు. దీనివలన కొత్త చిక్కులను తెచ్చుకున్నట్లే అవుతుంది.

Watch Video:


End of Article

You may also like