చాలా మంది బైక్ పై కంటే కార్ లో వెళ్ళడానికి మోస్ట్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎండా, వాన వంటి బారిన పడకుండా హ్యాపీ గా కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. అయితే.. కార్ లో మనకు తెలియకుండానే మనకు ఉపయోగపడే విషయాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

car seat 2

సాధారణం గా చాలా కార్ లలో డ్రైవర్ సీట్ తో పాటు ఇతర సీట్లకు కూడా వెనకాల తల ఆనించుకోవడానికి దిండు లాంటి అరెంజ్మెంట్ ఉంటుంది కదా. దీనిని హెడ్ రెస్ట్ హోల్డర్ అని అంటారు. చాలా మంది ఇది కేవలం తలను ఆనించుకోవడానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ దీని ద్వారా కొన్ని సార్లు మనం మన ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.

నిజానికి ఈ హెడ్ రెస్ట్ హోల్డర్ ఓ మెటల్ రాడ్ ద్వారా సపోర్ట్ చేయబడి ఉంటుంది. దానివలన కూర్చునే వారు ఎవరైనా వారి హైట్ కి తగ్గట్లు దీనిని అడ్జెస్ట్ చేసుకోగలుగుతారు. తద్వారా కంఫర్ట్ ఫీల్ అవుతారు. అయితే.. ఆపదసమయాల్లో.. ఎప్పుడైనా మీరు కార్ లోనే ఇరుక్కుపోయినప్పుడు.. ఈ మెటల్ రాడ్ ని బయటకు లాగి తద్వారా కార్ విండో ని పగలగొట్టేసి బయటకు రావడానికి ప్రయత్నించవచ్చు. నిజం గా ఇది లైఫ్ సేవింగ్ కదా.