Bigg Boss Malayalam Season 3 Live Updates, Bigg Boss premiered on 14 February 2021 with Live Polls and voting updates. Follow Malayalam Bigg Boss Season 3 Now
భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్లో చూపించారు.
ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఇందులో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కనిపిస్తారు. ట్రైలర్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూపించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 మొదటి షాట్ లో ఒక బ్రిటిష్ కోట, అందులో కొంత మంది సైనికులు శిక్షణ తీసుకోవడం, అలాగే కొంత మంది భారతీయులు పనులు చేయడం మనం చూడొచ్చు.
#2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్, పులి మధ్య ఒక సీన్ వస్తుంది. ఈ సీన్ కి సంబంధించి కొన్ని షాట్స్ అంతకు ముందు విడుదలైన కొన్ని వీడియోస్ లో చూపించారు.
#3 తర్వాత రామ్ చరణ్ కి సంబంధించిన ఒక సీన్ చూపిస్తారు.
అందులో రామ్ చరణ్ ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అప్పటికే రామ్ చరణ్ కి గాయాలు అయి ఉంటాయి.
అలాగే ట్రైలర్ మధ్యలో వచ్చే ఈ సీన్, కూడా మొదట్లో చూపించిన రామ్ చరణ్ షాట్ కి కొనసాగింపు అయి ఉండొచ్చు.
#4 ఇందులో ఒక అమ్మాయిని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళమ్మ మల్లీ అని అమ్మాయి పేరుని గట్టిగా అరుస్తుంది.
తర్వాత కనిపించే ఈ షాట్ కూడా ముందు కనిపించిన సీన్ కి కొనసాగింపు. వాళ్ల కూతుర్ని తీసుకెళ్లకుండా తల్లి పోలీస్ జీప్ ని అడ్డుకోవడం, దాంతో అక్కడ ఉన్న పోలీసులు ఆమెపై దాడి చేయడం మనం ఈ షాట్ లో చూడొచ్చు.
#5 తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక బ్రిడ్జి దగ్గర ట్రైన్ ఆక్సిడెంట్ నుండి ఒక పిల్లాడిని కాపాడడానికి ప్రయత్నించడం మనం చూడొచ్చు.
అందులో మొదట రామ్ చరణ్ చేతిలో ఉన్న జెండా, తర్వాతి షాట్ లో జూనియర్ ఎన్టీఆర్ చేతిలో కనిపిస్తుంది.
తర్వాత ఆ ట్రైన్ బ్లాస్ట్ అవ్వడం, వీళ్ళిద్దరూ నీటిలో మునగడం మనం ఇందులో గమనించవచ్చు.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పిల్లాడిని కాపాడి, తనమీద వేసుకుని రావడం, వారిద్దరికీ రామ్ చరణ్ సహాయం అందించడం మనం చూడొచ్చు.
సీతారామరాజు వారిని కాపాడాడు అని కొమరం భీమ్ తర్వాత, “నాకు నీ స్నేహం ముఖ్యం” అని ఇలా ఈ మాట అంటాడేమో.
#6 ఇందులో శ్రియ పక్కన ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఆలియా భట్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన అమ్మాయి అని సమాచారం.
అలాగే ట్రైలర్లో ప్రముఖ నటుడు సముద్రఖని కూడా కనిపిస్తారు. సముద్రఖని బహుశా అజయ్ దేవగన్ సమయానికి చెందినవారు. రామ్ చరణ్ బాబాయ్ అని పిలిచేది కూడా సముద్రఖనిని అయి ఉండొచ్చు.
#7 ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ని మనం గమనిస్తే నాటు నాటు పాటలో గెటప్ లాగానే ఉంది. కాబట్టి ఇది పాట తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ బ్రిటిష్ వాళ్లకి ఎదురు తిరగడం, దాంతో అక్కడే పనిచేస్తున్న సీతారామరాజు తప్పక కొమరం భీమ్ ని అరెస్ట్ చేయడం మనం చూడొచ్చు.
#8 ఇందులో ఒకరిని ఉరి తీయడానికి ఏర్పాటు చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళు దానిని అడ్డుకుంటున్నారు.
ఈ సీన్ పరిశీలించి చూస్తే, ఇందులో కొమురం భీమ్, సీతారామరాజుని కొడుతున్నాడు. కొమరం భీమ్ షర్ట్ మీద 567 అనే ఒక నంబర్ కనిపిస్తోంది. కొమరం భీమ్ ని ఉరి తీయాలి అనుకున్నప్పుడు, ఇలా అక్కడ ఉన్న పోలీసులపై దాడి చేసి తప్పించుకుంటాడు ఏమో.
#9 అలాగే ఒక పోలీస్ ఆలియాభట్ ని కొట్టడం మనం చూడొచ్చు.
తర్వాత ఆలియాభట్ ని జూనియర్ ఎన్టీఆర్ కాపాడి, వారు ఉండే ప్రదేశానికి తీసుకు వస్తారు ఏమో. ఎందుకంటే ఈ సీన్ లో ఆలియా భట్ పక్కన ఉండే అమ్మాయి మనకు మొదట్లో చూపించిన అమ్మాయి.
#10 ఇది బహుశా అల్లూరి సీతారామరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మొదట్లో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే, ఇందులో చరణ్ మెడలో ఉన్న మాల మనకి షాట్ లో కనిపిస్తోంది. అంతకుముందు పోలీసుగా సీతారామరాజు ఉన్నప్పుడు తన మెడలో ఆ మాల లేదు.
తర్వాత కొమరం భీమ్ వచ్చి అజ్ఞాతంలో ఉన్న అల్లూరి సీతారామరాజుకి సహాయం చేసి బయటికి తీసుకురావడం మనం చూడొచ్చు.
అంతే కాకుండా, తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న కొంతమంది బ్రిటీష్ వాళ్ళని కొట్టడం మనం చూడొచ్చు. చుట్టుపక్కల పరిసరాలన్నీ చూస్తూ ఉంటే అది ఒక జైలు లాగా అనిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ మీద రక్తపు మరకలు కూడా ఉంటాయి.
అంటే బ్రిటిష్ వాళ్ళే సీతారామరాజు ని బంధించారా? లేదా అజ్ఞాతంలో నుండి బయటకు వచ్చిన సీతారామరాజు, కొమరం భీమ్ తో కలిసిన తర్వాత ఈ సీన్ వస్తుందా? ఇది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
ఇవన్నీ మాత్రమే కాకుండా కొన్ని చోట్ల రామ్ చరణ్ పోలీస్ గెటప్ లో ఉన్నా కూడా గడ్డంతో కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల గెటప్ వేరే ఉంది.
ఏదేమైనా ట్రైలర్లో చాలా విషయాలు చెప్పినా కూడా, వాటి వల్ల సినిమాలో ఉన్న విషయాలపై ప్రశ్నలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. ఇదంతా చూస్తూ ఉంటే బహుశా ఇప్పటి వరకు మన ఎవరికీ తెలియని ఒక కథ గురించి రాజమౌళి చెప్పబోతున్నారు అని అర్థం అయిపోతోంది.