మామూలుగా మనం నీటిని అంటే లిక్విడ్ పదార్థాలను లీటర్ల లో సాలిడ్ పదార్థాలను కేజీల లో కొలుస్తాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా నూనె ప్యాకెట్ మీద బరువు కేజీల లో ఉంటుంది. అదేంటి నూనె లిక్విడ్ కదా? కేజీల లో ఎలా కొలుస్తాం? అని అనుకుంటున్నారా. అలా ఉండడానికి కారణం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
మీరు ఎప్పుడైనా నూనె ప్యాకెట్ మీద గమనిస్తే నూనె మెజర్మెంట్ లీటర్ల లో ఉండడంతో పాటు పక్కన కేజీల లో బరువు, ఇంకా టెంపరేచర్ కూడా రాసి ఉంటుంది. నూనె ధర టెంపరేచర్, వాల్యూమ్, డెన్సిటీ పై ఆధారపడుతుంది. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే డెన్సిటీ తక్కువగా ఉంటుంది.
డెన్సిటీ ఎక్కువగా ఉంటే వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. డెన్సిటీ అంటే మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉండటం. దీనికి ఒక ఉదాహరణ ఐస్ క్యూబ్. సాధారణంగా ఐస్ క్యూబ్ సాలిడ్. ఎందుకంటే దాంట్లో మాలిక్యూల్స్ అన్నిదగ్గరగా ఉంటాయి. ఒక ఐస్ క్యూబ్ తీసుకోండి. ఒక బౌల్ లో వేసి వేడి తగిలే లాగా పెట్టండి.
కొంచెం సేపటికి ఐస్ క్యూబ్ కరిగిపోతుంది. ముందు ఐస్ క్యూబ్ రూపంలో ఉన్నప్పుడు బౌల్ లో కొంచెం ప్లేస్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. నీళ్ల లాగ మారిన తర్వాత ముందు కంటే, అంటే ఐస్ క్యూబ్ రూపంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది.
అంటే ఐస్ కరిగిపోయినప్పుడు వాల్యూమ్ పెరిగింది. వేడివల్ల అంటే టెంపరేచర్ పెరగడం వల్ల మాలిక్యూల్స్ సపరేట్ అయ్యాయి. కాబట్టి డెన్సిటీ తగ్గింది. దీన్నిబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, డెన్సిటీ తగ్గుతుంది.
సాధారణంగా మనకి యావరేజ్ టెంపరేచర్ 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీలు నార్మల్ టెంపరేచర్ కాబట్టి సాలిడ్ పదార్థాలు సాలిడ్ స్టేట్ లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా నెయ్యిని గమనించండి. సమ్మర్ లో తప్ప మిగిలిన అన్ని కాలాల్లో నెయ్యి దాదాపు సాలిడ్ గానే ఉంటుంది.
ఎప్పుడైనా నెయ్యి వేసుకోవాలి అనుకుంటే వేడి చేస్తాం. సాలిడ్ గా ఉన్నప్పుడు నెయ్యి గిన్నె సగం వరకు నిండి ఉంటే, వేడి చేసిన తర్వాత గిన్నెలో నెయ్యి ఉన్న లెవెల్ పెరుగుతుంది. దీన్నిబట్టి టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది అనే విషయం మళ్లీ ప్రూవ్ అయ్యింది.
వర్షాకాలంలో ప్రతి రోజు వర్షం పడాలి అని రూల్ లేదు. అంటే సీజన్ మొత్తం ఒక టెంపరేచర్ ఉంటుంది అని చెప్పలేం. టెంపరేచర్ మారినప్పుడు వాల్యూమ్ కూడా మారుతుంది. ఇప్పుడు వర్షాకాలంలో ఒక రెండు రోజులు తీసుకుందాం. ఒకరోజు బాగా వర్షం పడింది. టెంపరేచర్ పెరగలేదు. ఆ రోజు 30 డిగ్రీల టెంపరేచర్ ఉంది అనుకుందాం.
మీరు అదే రోజు నూనె కొనుక్కుంటే నూనె ప్యాకెట్ పై ఇచ్చిన టెంపరేచర్ అంటే 30 డిగ్రీ సెల్సియస్ కాబట్టి నూనె ప్యాకెట్ లో ఉన్న వాల్యూమ్ కూడా మారదు. నెక్స్ట్ డే బాగా ఎండ వచ్చింది అనుకుందాం. టెంపరేచర్ కూడా పెరిగింది అనుకుందాం. అప్పుడు నూనె ప్యాకెట్ లో ఉన్న వాల్యూమ్ కూడా పెరుగుతుంది.
కాబట్టి నూనె ప్యాకెట్ మీద ఇచ్చిన 30 డిగ్రీలు, బయట ఉన్న టెంపరేచర్ మ్యాచ్ అవ్వవు. దాంతో నూనె అమౌంట్ కూడా మారుతుంది. ఒక పదార్థం సాలిడ్ అయినా లిక్విడ్ అయినా మారనిది ఆ పదార్థం యొక్క మాస్.
పైన చెప్పినట్టు ఒక ఐస్ క్యూబ్ ఒక గిన్నెలో పెట్టి దాని బరువు కొలవండి, ఐస్ క్యూబ్ నీటి రూపంలో మారాక మళ్లీ ఒకసారి బరువు కొలవండి. ఐస్ క్యూబ్ బరువు, తర్వాత నీటి బరువు సేమ్ వుంటాయి. అందుకే టెంపరేచర్ మారినా కూడా, వాల్యూమ్ మారినా కూడా బరువు మారదు. అందుకే నూనె కొలవడానికి మెయిన్ మెజరింగ్ ఫాక్టర్ గా బరువుని తీసుకుంటారు.
ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు. నూనె, నీళ్లు రెండు లిక్విడ్ ఏ కదా? మరి టెంపరేచర్ తో పాటు నీటి వాల్యూమ్ కూడా మారుతుందా? అని. నీళ్ల డెన్సిటీ నూనె డెన్సిటీ కంటే తక్కువ ఉంటుంది.
ఇప్పుడు నీళ్లని తీసుకుంటే ఒక కేజీ నీళ్లు, ఒక లీటర్ నీళ్ళు సేమ్ ఉంటాయి. కానీ నూనెలో ఒక లీటర్ నూనె 0.9 కేజీలు ఉంటుంది. అంటే ఒక కేజీ నూనె 1.1 లీటర్ల తో సమానం అన్నమాట. అందుకే నూనె ప్యాకెట్ మీద 1 లీటర్ (910 గ్రామ్స్) అని ఉంటుంది.
ఇది ఒక్క నూనె కి మాత్రమే కాదు, పెట్రోల్ కి, డీజిల్ కి కూడా వర్తిస్తుంది. అందుకే భారతదేశ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పెట్రోల్ బంక్ లో కూడా డెన్సిటీ డిస్ప్లే ఉంటుంది. డీజిల్ డెన్సిటీ 820-840 కేజీ పర్ మీటర్ క్యూబ్, పెట్రోల్ డెన్సిటీ 730-760 కేజీ పర్ మీటర్ క్యూబ్ ఉంటుంది.
డెన్సిటీ = మాస్/వాల్యూమ్ ఫార్ములాతో కాలిక్యులేట్ చేసి పైన చెప్పిన డెన్సిటీ లో ఉంటేనే మీకు పెట్రోల్, ఇంకా డీజిల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కరెక్ట్ గా అందుతున్నట్లు లెక్క. కాబట్టి ఈసారి నుండి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేటప్పుడు డెన్సిటీ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి.