రామ్ గోపాల్ వర్మ గురించి పెద్ద గా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఆ సినిమా వస్తోందంటే.. సినిమా కి క్లాప్ కొట్టిన రోజునుంచి.. థియేటర్ లో రిలీజ్ అయ్యే దాకా ఎడతెగని ఉత్కంఠ ఉండేది. ఆర్జీవీ సినిమాలకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది.
ఈ మధ్య ఆర్జీవీ లో వచ్చిన మార్పుని నెటిజన్లు గమనిస్తూనే ఉన్నారు. ఆయన సినిమా అంటే అదో రకమైన ఫీలింగ్ కలుగుతోంది. అయితే.. కేవలం.. జనం లో ఆయన పట్ల కలుగుతున్న భావన ను బట్టి ఆయన పతనం అయ్యారు అని అనొచ్చా..?
కానీ చాలా మంది కామెంట్స్ లో ఈ పాయింట్ ను లేవనెత్తకుండా ఉండరు. ఎలా ఉండే ఆర్జీవీ.. ఎలా అయిపోయారు..? అంటూ అనుకుంటుంటారు. ఇవేమి ఆయన పట్టించుకోరు. కానీ ఆయన అభిమానులకు మాత్రం కొంత బాధ కలిగిస్తూనే ఉంటాయి. అలా.. ఓ అభిమాని.. ఇచ్చిన సమాధానమే ఇది. “ఆర్జీవీ పతనానికి కారణం ఏంటి..? అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకి.. ఈ కోరా యూజర్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. అదేంటో అతని మాటల్లోనే చూడండి.
“ఆర్జీవీ సినిమాల కోసం పుట్టారని ఎవరు చెప్పారు..?” అంటూ ఆ యూజర్ సూటిగానే ప్రశ్నించాడు. త్రివిక్రమ్ సినిమాలో ఓ డైలాగును అందుకు ఉదాహరణ గా చెప్పుకొచ్చాడు. ఒక చెట్టు కి బాగా పండిన మామిడి పండు ఊరిస్తూ ఉంటుంది. కానీ.. ఆ చెట్టు కింద ఓ వ్యక్తి కింద దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. ఆ దారిన పోయే దానయ్య ఆ వ్యక్తిని చూసి “ఇంత తెలివి తక్కువ వాడు ఏంటో ఇతను.. పైన అంత మంచి పండు ని చూడకుండా కింద చెత్తలో ఏదో వెతుక్కుంటున్నాడు..” అని అనుకుంటాడట. కానీ.. అసలు ఆ వ్యక్తి ఆ మామిడి పండును కొట్టడం కోసం రాయిని వెతుకుతూ తన పని తాను చేసుకుపోతుంటాడు. ఇప్పుడు తెలివి తక్కువ వారు ఎవరు..? రాయిని వెతుక్కుంటున్న వాడా..? లేక ఆ దారిన పోయే దానయ్యా..?
ఆర్జీవీ కూడా అంతే.. దారిన పోయే దానయ్యల మాటలు పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుపోతుంటాడు. ఆర్జీవీ సినిమాలు ఇప్పుడు జనానికి నచ్చకపోవచ్చు.. కానీ తెలుగు ఇండస్ట్రీ లో ఆర్జీవీ చేసినన్ని రిస్క్ లు ఎవరు చేయలేదు. కొత్త కొత్త కెమెరాలు వాడటం తో పాటు.. జింబాల్ లాంటి ఎన్నో అధునాతన టెక్నాలజీ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. మొబైల్ ఫోన్ తో కూడా ఫుల్ క్వాలిటీ తో సినిమా తీయచ్చని నిరూపించాడు.
ఇండస్ట్రీ లో ఉండే ఇగోలను పట్టించుకోకుండా.. ఓ ఫ్యాక్టరీ ని పెట్టి మనిషికి పేరు కంటే టాలెంట్ అవసరం అని నిరూపించాడు. సినిమా డిస్ట్రిబ్యూషన్స్ కోసం శాటిలైట్స్ వంటి వాటికోసం కూడా ఆర్జీవీ కృషి చేసారు. కెమెరా ను రకరకాల యాంగిల్స్ లో పెట్టి ఆర్జీవీ చేసినన్ని ప్రయోగాలు ఇండస్ట్రీ లో ఎవ్వరు చేయలేదు. రాముయిజం ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాలను సూటిగా, సుత్తిలేకుండా లెక్కలేనన్ని విషయాలను విసిరేసాడు. చివరగా చెప్పాలంటే.. ఆయన కింగ్ కాదు.. కింగ్ మేకర్.”
ఆర్జీవీ నిజానికి ఎవరికీ అంత గా అర్ధం కాడు. కానీ ఈ కోరా యూజర్ చెప్పిన ఆన్సర్ చూస్తే.. ఆర్జీవీ ని ఇలా కూడా అర్ధం చేసుకోవచ్చా అనిపిస్తుంది.