ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం…
కథ:
సత్య (సుదర్శన్) కు ఐదు లక్షల రూపాయలు అవరసం అవుతాయి. దొంగతనం చేసి అయినా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళతాడు, అక్కడ సత్యకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. మాట్లాడే ఒక ఇనుప పెట్టలో బంగారం ఉంటుంది, ఆ బంగారం తీసుకోవాలనే క్రమంలో … ఇనుము పెట్ట సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ , మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పులు.. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు ? అతను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతనికి కావాల్సిన ఐదు లక్షలు దొరికాయా ? నిజంగానే ఇనపెట్టే మాట్లాడిందా ? వంటి విషయాలు తెలియాలంటే కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నటీనటులు యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. నిర్మాతలు ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సినిమా రిచ్ గా మంచి టెక్నీకల్ వ్యాల్యూస్ తో ఉంది. దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి తాను తీసిన మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తీశాడు. తాను రాసుకున్న కథను తెరమీద చక్కగా చూపించాడు.

సంగీతం అందించిన సిద్ధార్థ్ సదాశివుని, పవన్ పాటలతో పాటు నేపధ్య సంగీతం బాగా అందించారు, సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటర్ కార్తిక్ కట్స్ వర్క్ నీట్ గా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ సతీష్ రాజబోయిన కెమెరా వర్క్ సూపర్బ్, విజువల్స్ బాగున్నాయి.

కేశవ , చాందిని ఎపిసోడ్ సినిమాకు బాగా వర్క్ ఔట్ అయ్యింది. మొదటి కథ “పెయిన్” లో అమ్మ క్యారెక్టర్ చిన్నది అయినా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ సినిమాకు మెయిన్ ప్లస్. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇలాంటి కథ, కథనాలతో థియేటర్ లో వచ్చిన మొదటి సినిమాగా కరెన్సీ నగర్ గా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. కథ చూస్తుంటే మన చిన్నప్పుడు చదివిన బేతాళ కథలు గుర్తుకు వస్తుంది కానీ కథలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. తెరమీద చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కరెన్సీ నగర్.
రేటింగ్: 3/5




1. చట్టానికి కళ్ళు లేవు :
2. మంచిమనసులు:
3. ఖైదీ నెంబర్ 786:
4. దేవాంతకుడు:
5. నేనే రాజు నేనే మంత్రి:
6. ధర్మతేజ:
7. దొంగపెళ్ళి:
8. చినరాయుడు:
9. నా మొగుడు నాకే సొంతం:
10. గమ్యం:
11. ఠాగూర్:
12. మా అన్నయ్య:
కెప్టెన్ విజయ్‌కాంత్‌కు తమిళనాడు ప్రజలందరూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ప్రభుత్వ లాంఛనాలతో కెప్టెన్ అంత్యక్రియలు జరుగుతయాని తెలుస్తోంది. కెప్టెన్‌గా ప్రెసిద్ధి పొందిన విజయ్‌కాంత్ 1981లో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, 150కి పైగా సినిమాలలో నటించారు. ఎన్ని హిట్లు అందుకున్న ఆయన ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2006 లో రాజకీయల్లో అడుగుపెట్టి, పార్టీ స్థాపించి, రాజకీయ నాయకులకు సింహా స్వప్నంగా నిలిచాడు.
2016లో ఉలుందూరుపేట అసెంబ్లీ బియవజికవర్గం నుంచి పోటీ చేసే సమయంలో విజయకాంత్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 7.6 కోట్లుగా అంచనా వేయబడింది. వీటిలో నగదు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బాండ్లు, షేర్లు, మోటారు వాహనాలు, ఆభరణాలు మరియు క్లెయిమ్‌లు వంటి ఇతర ఆస్తులు ఉన్నాయి.
విజయ్‌కాంత్ భార్య మరియు ఆయన పై ఆధారపడిన వారి ఆస్తులు సైతం కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ. 14.79 కోట్లు. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య మరియు నివాస భవనాలు మొదలైన స్థిరాస్తుల విలువ రూ. రూ. 19.37 కోట్లు కాగా, భార్య పేరున ఉన్న ఆస్తుల విలువ రూ. 17.42 కోట్లు. అఫిడవిట్ ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లు అని తెలుస్తోంది. ఆయనకు ఉన్న అప్పుల విలువ రూ. 14.72 కోట్లు. ప్రస్తుతం విజయ్‌కాంత్ ఆస్తుల విలువ 50 – 60 కోట్లు వరకు ఉన్నట్లు సమాచారం.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
తొలి చిత్రంతోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి, అందరినీ తన వైపుకు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్, ఆర్ఎక్స్ 100 మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. గ్లామర్ మరియు నటనతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా విజయాలు అందుకోలేదు. తనకు హిట్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం మూవీలో నటించి, హిట్ అందుకున్నారు. నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ చిత్రంలో నటించిన నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయ్యారు. వారిలో మీసాల లక్ష్మణ్ ఒకరు. ఈ చిత్రంలో కాశిరాజు అసిస్టెంట్ పులి ‘గుడ్డోడు’ పాత్రలో లక్ష్మణ్ నటించారు. లక్ష్మణ్ రంగస్థల మరియు సినీ నటుడు. లక్ష్మణ్ 1984 ఆగస్టు 12న జన్మించాడు. 2007లో హైదరాబాద్ కు వచ్చి డి.యస్. దీక్షితులు వద్ద నటనలో శిక్షణ పొంది, ‘అమ్మా నాకు బ్రతకాలని ఉంది’ అనే నాటకం నాటకరంగంలోకి అడుగుపెట్టాడు.
అలా అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన లక్ష్మణ్ ‘కో అంటే కోటి’ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చాడు. పలు సినిమాలలో నటించిన లక్ష్మణ్ హితుడు, మనమంతా, వంగవీటి, ఘాజీ, ఆర్ఎక్స్ 100 చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. మంగళవారం మూవీతో పాపులర్ అయ్యారు. లక్ష్మణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, జైలర్ మూవీలోని పాపులర్ డైలాగ్ వార్త వర్మ నటుడికి లక్ష్మణ్ డబ్బింగ్ చెప్పారు.











