యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ సెన్సేషన్ సృష్టిస్తుంది. ఈ మూవీకి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది. ఇండియా వైడ్ కలెక్షన్స్ తో సలార్ మూవీ దూసుకుపోతుంది. ఎన్నాళ్ళ నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ దాహం ఈ మూవీతో తీరింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని మాస్ ఎలివేషన్స్ లో ఒక రేంజ్ లో చూపించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సలార్ మూవీకి పొగడ్తల వర్షం కూడా కురుస్తుంది.ప్రతి ఒక్కరూ సలాడ్ సినిమాకి ఆల్ ది బెస్ట్ సూపర్ హిట్ అయినందుకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్న చిరంజీవి ఏ చిన్న సినిమా విడుదలైన ఏ మంచి సినిమా విడుదలైనా సరే అభినందనలు తెలియజేస్తారు. ఇప్పుడు సలార్ మూవీ పైన చిరంజీవి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తన అభినందనలు తెలిపారు. హార్టీ కంగ్రాట్యులేషన్స్ టు మై డియర్ దేవా అంటూ ప్రభాస్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. అలాగే కుదుస్ టు డైరెక్టర్ ప్రశాంత నీల్ అంటూ అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు సినిమాలో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమాని పొగుడుతున్నారంటే సలార్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే కొందరు కేజీఎఫ్ స్థాయిలో సెన్సేషనల్ టాక్ తెచ్చుకోలేక పోయిందని విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుతం సలార్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్ తొలిసారిగా జంటగా నటించారు.
జర్నలిస్ట్ ఆద్య క్యారెక్టర్ లో శృతి హాసన్ నటించింది. ఈ మూవీలో కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా ఇతర పాత్రలలో జగపతి బాబు, ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, బాబీ సింహా నటించారు. ఈ మూవీలో బాబీ సింహా శౌర్యాంగ గిరిజనుడు అయిన భారవగా నటించారు.
ఖాన్సార్లోని దొరలలో ఒకరైన రాజ మన్నార్ అల్లుడు, రాధా రామకు భర్తగా నటించారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో బాబీ సింహా చేతిలో ఐఫోన్ ఎక్స్ మోడల్ ఉంటుంది. అయితే ఈ సీన్ 2010 లో జరుగుతుంది. అప్పటికి ఇంకా ఐఫోన్ ఎక్స్ మోడల్ రాలేదు. కొత్త మోడల్ ఐఫోన్ ఎలా ఉపయోగిస్తారు. ఇలాంటి మిస్టేక్స్ చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.













