విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో 75వ సినిమా మైలురాయిని చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు నిర్మాతగా,డిస్ట్రిబ్యూటర్ గా సురేష్ ప్రొడక్షన్స్ ముందుండి నడిపిస్తున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో చేస్తున్న సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. థ్రిల్లర్ జానర్ లో తిరగకన ఈ మూవీ పైన ఇప్పటికే మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 27 తారీఖున హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయనున్నారు.

ఈ మూవీకి వెంకటేష్ నటించిన 75 సినిమాలకు సంబంధించిన దర్శకులను నిర్మాతలను చీఫ్ గెస్ట్లుగా పిలవనున్నారట. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, నాని తదితరులు ఈ ఫంక్షన్ కి హాజరుకానున్నట్లు సమాచారం. ఇక వెంకీతో పని చేసిన ఎందరో దర్శకులు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. కె రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, ముప్పలనేని శివ, భీమినేని శ్రీనివాసరావు, సురేష్ కృష్ణ, జయంత్ సి పరాంజీ ఇలా ఎందరో హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.

అయితే ఈ ఫంక్షన్‌కు ఇతరుల ఎవ్వరికి పర్మిషన్ లేదట కేవలం సినీ ప్రముఖుల సమక్షంలో మాత్రమే జరగనుంది అని తెలుస్తుంది. అయితే ఫంక్షన్ అయిపోయాక ఈటీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారట. కలియుగ పాండవులు సినిమాతో మొదలైన వెంకటేష్ సినీ ప్రస్థానం 75 సినిమాలుకు చేరుకుని దిగ్విజయంగా కొనసాగుతుంది. ఫ్యామిలీ హీరోగా, కామెడీ హీరోగా, మాస్ హీరోగా ఇలా చేయని పాత్ర వేయని వేషం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా, అందరికీ ఆప్తుడిగా వెంకటేష్ పేరు తెచ్చుకున్నారు









ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ అలరిస్తున్నాయి. ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అనే డైలాగ్ రాగానే ప్రభాస్ యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. థియేటర్లు బిజీఎం, విజిల్స్‌తో దద్దరిల్లుతున్నాయి. ఆ కాటేరమ్మ కథ గురించి చాలామందికి తెలియదు. కైలాసంలో శంకరుడు నిద్రిస్తున్న సమయంలో పార్వతి దేవి ప్రతి రోజూ రాత్రి సమయంలో వెళ్లి, సూర్యోదయం కాకముందే కైలాసానికి వెళుతుంది.
ఈ విషయం పై శంకరుడు పార్వతిదేవిని నిలదీస్తాడు. అయితే ఆమె తనకు తెలియకుండానే అలా జరిగిపోతుందని బాధపడుతుంది. ఓ రాత్రి కైలాసం అడవుల నుండి వెళ్తున్న పార్వతిని శంకరుడు అనుసరిస్తాడు. ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి, పాతిపెట్టిన శవాలను తవ్వి, తీసి తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఉగ్ర రూపంలోని పార్వతిదేవిని ఆపడానికి శివుడు అడవి దారిలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. పార్వతి ఆ గొయ్యిలో పడిపోయి, తను చేసినదానికి పశ్చాత్తాపం పడుతుంది. ఇక మీదట ఇలాంటివాటికి దూరంగా ఉంటానని, ఉగ్రరూపాన్ని వదిలి పార్వతిదేవిగా శివుడికి వెంట వెళ్తుంది. అలా పార్వతి దేవి విడచిన శక్తి అవతారమే కాటేరమ్మగా చెబుతారు.
ద్రవిడ సంస్కృతి నుండి అవతరించిన శ్రీ కాటేరీ దేవత హిందూ దేవతగా మారింది. దుష్ట సంహారం చేస్తూ, తనను విశ్వాసించిన వాళ్లకు తోడుగా ఉండే దేవత కాటేరమ్మ. సౌత్ ఇండియాలో, ప్రధానంగా కర్ణాటకలో కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, అక్కడి ఆలయాల్లో కొలువై, నిత్యం పూజలు అందుకుంటోంది. కాటేరమ్మను పార్వతిమాత ఇంకో రూపంగా భావిస్తారు. కలియుగంలో జబ్బులను నయం చేయడానికి వెలిసిన దేవతగా పూజలు అందుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో గ్రామానికి కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా ఎన్నో తరాల నుండి కొలుస్తున్నారు.











