మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఆయన కెరీర్ మొత్తంలోనూ ఇంద్ర సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా మెగాస్టార్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ నటించిన ఈ సినిమాకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే ఇంద్ర సినిమా శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ దగ్గర ఉండేవి. జెమినీ టీవీలో ఇంద్ర సినిమాని ప్రసారం చేసేవారు. ఇంద్ర సినిమా ప్రసారమయ్యే ప్రతిసారి జెమినీ టీవీకి మంచి టిఆర్పి రేటింగులు నమోదు అయ్యేవి. అయితే తొమ్మిది సంవత్సరాల నుండి ఇంద్ర సినిమా టీవీలో టెలికాస్ట్ అవ్వడం మానేసింది.

దీనిపైన చిరంజీవి అభిమానులు చాలాసార్లు తమ బాధను వ్యక్తపరిచారు. చిరంజీవి సూపర్ హిట్ సినిమాని టీవీలో చూడలేకపోతున్నాము అంటూ బాధపడ్డారు. అయితే ఇప్పుడు చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంద్ర సినిమా మళ్ళీ టీవీలో టెలికాస్ట్ చేసారు. ఇంద్ర సినిమా ప్రసార హక్కులను జీటీవీ కొనుగోలు చేసింది. 17 వ తేదీ ఆదివారం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగులో ఇంద్ర సినిమా ప్రసారం చేసారు. తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమా ప్రసారం కావడంతో మంచి టిఆర్పి రేటింగులు నమోదు అవుతాయని చిరంజీవి అభిమానులతో పాటు ఛానల్ యాజమాన్యం కూడా అంచనా వేస్తుంది








పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే కొందరు కేజీఎఫ్ స్థాయిలో సెన్సేషనల్ టాక్ తెచ్చుకోలేక పోయిందని విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుతం సలార్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్ తొలిసారిగా జంటగా నటించారు.
జర్నలిస్ట్ ఆద్య క్యారెక్టర్ లో శృతి హాసన్ నటించింది. ఈ మూవీలో కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా ఇతర పాత్రలలో జగపతి బాబు, ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, బాబీ సింహా నటించారు. ఈ మూవీలో బాబీ సింహా శౌర్యాంగ గిరిజనుడు అయిన భారవగా నటించారు.
ఖాన్సార్లోని దొరలలో ఒకరైన రాజ మన్నార్ అల్లుడు, రాధా రామకు భర్తగా నటించారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో బాబీ సింహా చేతిలో ఐఫోన్ ఎక్స్ మోడల్ ఉంటుంది. అయితే ఈ సీన్ 2010 లో జరుగుతుంది. అప్పటికి ఇంకా ఐఫోన్ ఎక్స్ మోడల్ రాలేదు. కొత్త మోడల్ ఐఫోన్ ఎలా ఉపయోగిస్తారు. ఇలాంటి మిస్టేక్స్ చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.



