బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 56 ఏళ్ళ వయసున్న సల్మాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఆయన ఇప్పటి వరకు చాలా మందిని ప్రేమించినట్లు వార్తలు వచ్చాయి. వారిలో చాలా మందితో ఆయన బంధం పెళ్లి వరకు వెళ్ళింది కానీ.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.
నిజానికి సెలెబ్రెటీల రిలేషన్షిప్స్ గురించి ఏదో ఒక న్యూస్ నిత్యం ఉంటూనే ఉంటుంది. బాలీవుడ్ లో అయితే ఇది మరీ ఎక్కువ. అయితే ఇప్పుడు సల్మాన్ ఎవరెవరితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..
#1 షహీన్ జాఫ్రీ
సల్మాన్ మొదటిగా సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలు షహీన్ ని ప్రేమించారు. సల్మాన్ చదువుకొనే రోజుల్లో ఆమెను ఇష్టపడ్డారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆమె హీరోయిన్ కియారా అద్వానీ కి అత్త.

#2 సంగీత బిజ్లానీ
సల్మాన్ హీరోయిన్ సంగీత బిజ్లానీ ని కూడా ప్రేమించారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొని, తేదీని కూడా ప్రకటించారు. 1994 ,మే 27 న జరగలిసిన ఆ పెళ్లి జరుగలేదు.

#3 సోమి అలీ
ఈ పాకిస్థాన్ నటి సల్మాన్ తో డేటింగ్ చేసింది. కానీ తర్వాత విడిపోయారు. ఆమె సల్మాన్ పై పలు సార్లు వేధింపుల ఆరోపణలు చేసింది.

#4 ఐశ్వర్య రాయ్
సల్మాన్ తో డేటింగ్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచినా నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. సల్మాన్ స్వభావం వల్ల తాము విడిపోయామని ఐష్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది. అతడు తనపై దాడి చేసాడని కూడా ఐష్ వెల్లడించింది.

#5 స్నేహ ఉల్లాల్
ఐశ్వర్య రాయ్ పోలికలు ఉండే స్నేహ ఉల్లాల్ తో కూడా సల్మాన్ డేటింగ్ లో ఉన్నారు. కానీ కొంత కాలానికి వారు విడిపోయారు.

#6 కత్రినా కైఫ్
నాలుగేళ్ళ పాటు సల్మాన్ – కత్రినా డేటింగ్ లో ఉన్నారు. తర్వాత కత్రినా రణబీర్ కోసం సల్మాన్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.

#7 క్లాడియా
కత్రినా తర్వాత జర్మన్ నటి క్లాడియా తో డేటింగ్ చేసాడు సల్మాన్ ఖాన్. ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.

#8 లులియా
రోమానియా కు చెందిన లులియా తో కూడా కొంత కాలం సల్మాన్ డేటింగ్ లో ఉన్నాడు.

#9 మెహెక్ చాహల్
ఈ యూరోపియన్ నటి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో లో పాల్గొంది. కానీ వీరిద్దరూ త్వరగా విడిపోయారు.

#10 డైసీ షా
పలు హిందీ, కన్నడ చిత్రాల్లో నటించిన ఈమె పలుసార్లు సల్మాన్ తో కలిసి కనిపించినట్లు వార్తలు వచ్చాయి.

#11 హేజెల్
బ్రిటన్ కు చెందిన ఈ నటి సల్మాన్ ఖాన్ తో కొంతకాలం డేటింగ్ ఫ్లో ఉంది. తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ ని పెళ్లి చేసుకుంది.

#12 సోనాక్షి సిన్హా
శత్రుఘ్న సిన్హా కుమార్తె అయినా సోనాక్షి దబాంగ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ పలు వార్తలు వచ్చాయి.

#13 పూజ హెగ్డే
అయితే తాజాగా సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే రిలేషన్ లో ఉన్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒక చిత్రం లో నటించారు.


ఫీల్ గుడ్ మలయాళ మూవీ ‘హోమ్’ కి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇంద్రన్స్, మంజు పిళ్లై, శ్రీనాథ్ భాసి, దీపా థామస్, నస్లెన్ కె. గఫూర్, జానీ ఆంటోని, కైనకరి థంకరాజ్ వంటివారు ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో ఆగస్టు 19న విడుదలైంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, 60 ఏళ్ల ఒలివర్ ట్విస్ట్ (ఇంద్రాన్స్)ఇద్దరు కొడుకులకు తండ్రి. పెద్ద కొడుకు ఆంటోనీ (శ్రీనాథ్ బాసి), చిన్న కొడుకు చార్లెస్( నస్లెన్ కె. గఫూర్). ఆంటోనీ దర్శకుడు. అతను తీసిన మొదటి మూవీ పెద్ద విజయం సాదిస్తుంది. కానీ కానీ రెండవ మూవీకి స్టోరీ రాయలేక, ఏకాగ్రత కుదరక ఇబ్బందులు పడతాడు. మవతి మూవీ కథ రాసిన తన ఇంట్లోనే రాయాలని భావించి, ఇంటికి వస్తాడు. పెద్ద కొడుకు ఇంటికి రావడంతో ఒలివర్ చాలా సంతోషపడతాడు. తన మిత్రులతో ఆంటోనీ గురించి గొప్పగా చెప్పుకుని ఆనందపడతాడు.
అయితే ఆంటోనీ మాత్రం తన తండ్రి ఒలివర్ తో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడడు. ఎల్లప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాడు.తండ్రి ఏం మాట్లాడినా ఫోన్ చూసుకుంటూ ఆంటోనీ ‘ఊ ఊ’ అని అంటుంటాడు. అయితే తన కొడకులు ఇద్దరు ఎందుకు ఆ స్మార్ట్ ఫోన్‌కి బానిసలా మారి, తమ చుట్టూ ఉన్నవాళ్ళను పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. ఒలివర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి గురించి తెలుసుకుంటుంటాడు. ఆ తరువాత తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ.
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని, పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో 2002లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే 2004లో వచ్చిన వర్షం సినిమాతో ప్రభాస్‌కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
2005లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీతో మాస్ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. ఇక ఆ తర్వాత చేసిన చిత్రాలు దాదాపు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. బహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్, వైస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న పాత మరియు రేర్ ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2007 లో ప్రభాస్, నయనతార జంటగా నటించిన ‘యోగి’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా వి.వి వినాయక్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని పొందలేకపోయింది. ఇక ఈ చిత్రాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిళ నిర్మించారు. యోగి మూవీకి షర్మిళ బడ్జెట్ పెట్టి, నిర్మాతగా వ్యవహరించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్, నయనతార ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మతో దిగిన ఫొటో దిగారు. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.




యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆదికేశవ. ఈ మూవీలో మలయాళ యాక్టర్ జోజు జార్జ్, రాధిక, తనికెళ్ళ భరణి, సుధాకర్, రచ్చ రవి వంటివారు కీలక పాత్రలలో నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ కాపీ సన్నివేశాలని గమనించారు. ఆ విషయాన్ని వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు మూవీలోని ఫ్లాష్ బ్యాక్ యాక్సిడెంట్ సీన్ ను ఆదికేశవ మూవీలో ఉపయోగించారు. దీంతో రెండు సినిమాలలో సీన్స్ నెట్టింట్లో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజెన్లు తమ దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే దూకుడు సీన్ ను గల్లీ రౌడీ అనే మూవీలో కూడా ఉపయోగించారని మరో నెటిజెన్ కామెంట్ చేశారు.
ప్రభాస్ సలార్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. వీరిలో ‘కాటేరమ్మ కొడుకును పంపింది’ అంటూ డైలాగ్ చెప్పిన అమ్మాయి కూడా చాలా పాపులర్ అయింది. ఆ అమ్మాయి పేరు ఫర్జానా సయ్యద్. దాంతో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది. ఫర్జానా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఫర్జానా ముస్లిం అమ్మాయి. అయితే సురభి క్యారెక్టర్ ను ఎలా చేశావని అడగగా, ఆమె మాట్లాడుతూ తన తండ్రి ముస్లిం, అని, తల్లి హిందూ అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంట్లో పండగలన్ని చేసుకుంటామని చెప్పింది. నటన ముఖ్యమని, దానికి మతంతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ, మోడల్‌గా ఇప్పటికే పలు యాడ్స్ లో నటించానని, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించానని తెలిపింది. ఆ క్రమంలోనే ‘సలార్’ లో ఛాన్స్ వచ్చిందని ఫర్జానా చెప్పింది.
సురభి క్యారెక్టర్ కోసం ఎంతో మంది ఆడిషన్స్‌కు వచ్చారని, అయితే తను ఎంపిక అవ్వడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు సలార్ మూవీలోని ‘ఫర్జానా’ లుక్ కు, నిజ జీవితంలోని లుక్ కు చాలా ఛేంజ్ ఉందని అంటున్నారు. రియల్ లైఫ్ లో ఆమె చాలా అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కథానాయకుడు కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్‌ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.



