ఇండియన్ బాక్సాఫీస్‌ను ప్రస్తుతం ఎలుతున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కేకిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోంది. వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
ఈ చిత్రం విజయం సాధించడంతో ఇందులో నటించిన నటీనటులు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. వీరి గురించే అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 17 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఎవరో ఇప్పుడు చూద్దాం..
సలార్ మూవీ హిట్ తో పాపులర్ అయిన నటినటులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రియా రెడ్డి. ఆమె సలార్ లో రాజమన్నార్ కుమార్తె, రాధా రామ మన్నార్ క్యారెక్టర్ లో అద్బుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీ ముందు కోలీవుడ్ లో మాత్రమే పాపులర్ అయిన శ్రియా రెడ్డి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పాన్ ఇండియా స్టేటస్ పొందారు.
తన నటనతో అందర్నీ ఆమె వైపుకు తిప్పుకున్నారు. దాంతో ఆమె గురించి తెలుసుకోవ డానికి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో ఆమె నటించిన తిమిరి తెలుగులో పొగరు సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ చిత్రం 2006 లో రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ విశాల్ ఈ మూవీలో హీరోగా నటించారు. రీమాసేన్ హీరోయిన్ గా నటించగా, ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఈ చిత్రలో ఈశ్వరిగా శ్రియా రెడ్డి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈశ్వరి పాత్రలో ఒదిగిపోయి, హీరోతో పోటీ పడి నటించారు. ఈ మూవీ ట్రెండింగ్ లోకి రావడానికి మరో కారణం జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్. పొగరు సినిమాలో వినాయకన్ నటించాడు. ఈశ్వరి పాత్రకు సహకరించే పాత్రలో మాయిగా వినాయకన్ నటించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వీరిద్దరు సలార్, జైలర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు.

ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహా, ప్రమోద్ పంజు ఇతర కిలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ చిత్రమలో నటించిన నటీనటులు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటివారిలో ప్రమోద్ పంజు ఒకరు.
సలార్ లో వరద రాజమన్నార్ తమ్ముడు బాచి మన్నార్ పాత్రలో నటించి, మెప్పించాడు. ప్రమోద్ పంజు కన్నడంలో పాపులర్ యాక్టర్. 1990లో జనవరి 10న జన్మించాడు. మాండ్య జిల్లాకు చెందినవాడు. ప్రమోద్ పంజు మద్దూరులోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేశాడు. సురానా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2015 లో శాండల్ వుడ్ లో అడుగుపెట్టాడు.
ప్రమోద్ నటించిన మొదటి సినిమా గీతా బ్యాంగిల్ స్టోర్‌లో 11 సెప్టెంబర్ 2015న విడుదలైంది. ఆ తర్వాత 2019లో కన్నడ చిత్రం ప్రీమియర్ పద్మినిలో నటించాడు. మట్టే ఉద్భవ, అతను బుల్లితెర పై చుక్కి, పునర్వివాహ వంటి సీరియల్స్ లో నటించి, పాపులర్ అయ్యాడు. ప్రమోద్ మహాదేవి సీరియల్లో శివుడిగా నటించాడు. ఈ ఏడాది సలార్ పార్ట్ 1 లో నటించి, మరింత పాపులర్ అయ్యారు.
విజయ్‌కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన 1952లో మదురైలో ఆగస్టు 25న జన్మించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశారు. తమిళ సినీ లెజెండ్ లలో ఒకరిగా నిలిచిపోయారు. తన సినీ జీవితంలో తమిళ భాషలో మాత్రమే నటించి, కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో కెప్టెన్ గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఇనిక్కుం ఇలామైతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్‌కాంత్, తన కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలో విజయ్‌కాంత్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో సెప్టెంబరు 14న డిఎండికె (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) అనే పార్టీని స్థాపించాడు. తెలుగులో ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య అని అర్ధం. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, విజయ్‌కాంత్ పోటీ చేసిన స్థానం మాత్రమే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో ఎఐఎడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని, 41 స్థానాలలో పోటీ చేశారు. విజయ్‌కాంత్ పోటీ చేసిన 41 స్థానాల్లో 29 గెలుచుకోని డిఎండికె పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డిఎంకె కన్నా ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది. విజయ్‌కాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ప్రతి పక్షనాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత 2016లో జరిగిన ఎలెక్షన్స్ లో అపజయం పొందాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కన్నుమూయడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సురేష్ కొండేటి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, వేడంగిపాలెంలో జన్మించాడు. సురేష్ కొండేటి న్యూస్ పేపర్ లో సినీ జర్నలిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టారు. అలా పలు న్యూస్ పేపర్లలో పని చేశాడు. 2002లో ‘సంతోషం’ సినీ వీక్లీ మ్యాగజైన్ ను స్థాపించాడు. 1992లో సురేష్ కొండేటి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. 1995లో రాంబంటు మూవీతో నటుడిగా మారారు. ఆ తరువాత కొండేటి ‘మహేశ్వరీ ఫిలిమ్స్’ అనే పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. ఎస్కె పిక్చర్ పేరుతో ప్రొడ్యూసర్ గా మారారు.
ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా, శంభో శంకర, డా. సలీమ్,లీసా, మహేష్, ప్రేమించాలి,)మెట్రో, జనతా హోటల్, లవ్ ఇన్ షాపింగ్ మాల్, క్రేజీ, ప్రేమలో పడితే, రేణిగుంట, రైడ్ చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడుగా రాణిస్తున్నారు. సురేష్ కొండేటి ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో 2004 నుండి ప్రతి ఏడాది తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. మొదట తెలుగు సినిమాలకు ఇచ్చేవారు. కొన్నేళ్ళ నుండి సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాలకు సైతం అవార్డులు ఇస్తున్నారు.
ఈ ఏడాది 22వ సంతోషం ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ను గోవాలో నిర్వహించారు. సురేష్ కొండేటి 4 ఇండస్ట్రీల నుండి వచ్చిన నటీనటులు, సినీ బృందాలకు వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా కన్నడ సినీ ప్రముఖుల నుంచి కొండేటి పై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. సురేష్ కొండేటి చేసిన పొరపాట్ల వల్ల టాలీవుడ్ కి చెడ్డ పేరు వచ్చిందని, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలి నుండి కొండేటిని తొలగించారు. అంతేకాకుండా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా సురేష్ కొండేటిని తొలగించారని తెలుస్తోంది.
బాబీ సింహా అసలు పేరు జయసింహ. 1983లో హైదరాబాద్‌లోని మౌలాలీలో నవంబర్ 6న బాబీ సింహా జన్మించారు. వారి కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, మోపిదేవికి చెందినవారు. 1995లో కొడైకెనాల్‌కు వెళ్లిపోయారు. నాలుగో తరగతి వరకు మౌలాలీలో, ఆ తరవాత టెన్త్ క్లాస్ వరకు కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రియదర్శిని విద్యాలయం తెలుగు మీడియం పాఠశాలలో పూర్తి చేసారు. ఆ తరువాత కోయంబత్తూర్‌లోని పయనీర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదువు పూర్తి చేశాడు.
2005లో, కోయంబత్తూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనగా, అక్కడికి ముఖ్య అతిధులు వచ్చిన సుందర్ సి, ఇ. రాందాస్ కోలీవుడ్ లో నటుడిగా ట్రై చేయమని సూచించారు. సింహా డిగ్రీని పూర్తి చేసి, యాక్టర్ గా అవకాశాల కోసం చెన్నైకి వెళ్ళాడు. తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మార్కెటింగ్, బీమా మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తుండేవాడు. బాబీ సింహా నటించిన తొలి సినిమా మాయ కన్నడి 2007 లో గుర్తింపు లేని పాత్రలో కనిపించాడు.
మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తరువాత పిజ్జా, నేరమ్, సూదు కవ్వమ్ వంటి తమిళ సినిమాలలో నటించారు. జిగర్తాండ మూవీతో మంచి గుర్తింపు లభించింది. అతని పాత్రకు విమర్శకుల ప్రశంసలను పొందింది. ఆ మూవీకి గాను బాబీ సింహాకు జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు వచ్చింది. ఈ పాత్రలో టాలీవుడ్ లో ‘గద్దలకొండ గణేష్’ మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించారు. జిగర్తాండ మూవీ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ, రాణిస్తున్నారు.
ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు మరియు నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కుమారుడు. పెదనాన్న వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయానికి కృష్ణంరాజు ఫేడ్ అవుట్ కావడంతో ఆయన క్రేజ్ ప్రభాస్ కు అంతగా పనిచేయలేకపోయింది. 2002 లో ఈశ్వర్ తో ప్రభాస్ హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. రెండవ మూవీ రాఘవేంద్ర ఫ్లాప్ గా నిలిచింది. 2004లో వచ్చిన వర్షం మూవీతో ఫస్ట్ హిట్ ను ప్రభాస్ అందుకున్నారు.
ఆ తరువాత అడివి రాముడు, చక్రం చిత్రాలు నిరాశ పరిచాయి. అదే సమయంలో అల్లు అర్జున్, రవితేజ విజయాలతో దూసుకుపోతున్నారు. దాంతో ప్రభాస్ వైపు చూసేవారు లేకుండాపోయారు. సరిగ్గా ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ మూవీతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో విజయాలతో దూసుకెళ్లాడు.
మిర్చి మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మాస్ బ్లాక్ బస్టర్ ను కొరటాల శివ అందించారు. ఆ తరువాత వచ్చిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్, తాజాగా సలార్ తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ రేర్, అన్ సీన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.











