ప్రేమిస్తే మూవీతో సౌత్ ఇండస్ట్రీలో భరత్ సంచలనం సృష్టించారు. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, భరత్ కు హీరోగా మంచి క్రేజ్ ఏర్పరచింది. కోలీవుడ్ హీరో భరత్ ఆ మూవీ హిట్ అవడంతో తెలుగులో కూడా ఫాలోయింగ్ వచ్చింది.
ప్రేమిస్తే తరువాత భరత్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి, పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. భరత్ హీరోగా నటించిన 50వ మూవీ లవ్. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భరత్ తమిళ, మలయాళం, హిందీ, తెలుగు భాషలలో హీరోగా, సైడ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 2020 లో మలయాళంలో విజయం సాధించిన లవ్ మూవీని అదే టైటిల్ తో భరత్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో వాణిభోజన్ హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది జూలై 28న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆర్పీ బాల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 8 నుండి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అజయ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి వద్దని దివ్య తండ్రి వద్దని ఎంతగా చెప్పినా వినకుండా అజయ్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లైన సంవత్సరంలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. అజయ్ చేస్తున్న బిజినెస్లో నష్టాలు రావడంతో, మద్యానికి బానిస అవుతాడు. అదే సమయంలో దివ్య గర్భవతి అని తెలుస్తుంది. చెకప్ కోసం దివ్య హాస్పటల్ కి వెళుతుంది.
అజయ్ ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. దివ్య కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో దివ్య అతని పై సీరియస్ అవుతుంది. అతనిలో మార్పు రాదని శాశ్వతంగా అతని నుండి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుంది. అజయ్ ఎంతగా కన్వీన్స్ చేసినా దివ్య అతని మాట వినదు. దాంతో కోపం వచ్చిన అజయ్ దివ్యను నెట్టేస్తాడు. ఆమెకు దెబ్బ బలంగా తగలడంతో అక్కడిక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అజయ్ లైఫ్ లో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.
Also Read: SALAAR REVIEW : “ప్రభాస్” ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్, సలోని బాత్రా, సురేష్ ఒబెరాయ్, తృప్తీ డిమ్రీ, శక్తి కపూర్ వంటివారు కీలక పాత్రలలో నటించారు. యానిమల్ విజయంతో సందీప్ వంగా పై ప్రశంసలు కురిసాయి. ఇక ఈ మూవీ పై వచ్చిన విమర్శలన్ని బ్లాక్ బస్టర్ గా నిలవడంతో వెనక్కి వెళ్లాయి. అయితే విమర్శలు వచ్చిన కొన్ని అంశాల గురించి తాజాగా సందీప్ వంగా స్పందించాడు.
ఈ మూవీలో చూపించిన రణబీర్ కపూర్, రష్మికల కులాంతర వివాహం కావాలని పెట్టింది కాదని వంగా చెప్పారు. రణబీర్, రష్మికలు ఫ్యామిలీ మెంబర్స్ ముందే లిప్ లాక్ గురించి అడుగాగ, “రాక్ మ్యూజిక్ లో ఒక నిర్లక్ష్యం ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో రాక్ ప్లే అవుతుండడంతో తమ ఆవేశాన్ని బయటపెడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో కాస్త నిర్లక్ష్యం కూడా ఉంది” అన్నారు.
ఇక బాబీ డియోల్ ను ముస్లింగా చూపించడం పైన సందీప్ వంగా స్పందించారు. ”ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి ఎక్కువ మంది మారడం చూస్తున్నాం. కానీ హిందూ మతంలోకి ఎవరూ మారడం చూడలేదు. అందువల్ల దీన్ని వాడాలని భావించాను. ఇస్లాంలో ఒకరి కన్నా ఎక్కువమంది భార్యలు ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఒకరి కన్నా ఎక్కువ దాయాది క్యారెక్టర్లకు ఛాన్స్ ఉంది. డ్రామా కూడా పెద్దగా ఉంటుంది. ఆ కారణం వల్లే తప్ప ముస్లింను చెడుగా చూపించాలని భావించలేదు” అంటూ సందీప్ వంగా చెప్పుకొచ్చారు.















