రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచేలా చేసింది. అయితే ఈ సినిమా అక్టోబర్ 20వ తారీకు విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది.

ఈ సినిమా విడుదల అయ్యే ఒక్కరోజు ముందు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. వీరిద్దరూ పోటీ పడడం ఇది మొదటి సారి ఏమీ కాదు. అయితే అలా పోటీ పడిన ప్రతి సారి కేవలం ఒక్క హీరో మాత్రమే గెలిచారు. ఇప్పుడు ఈ లాజిక్ వైరల్ అవుతోంది. అదేంటంటే, 2008 లో బాలకృష్ణ ఒక్కమగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పుడే రవితేజ, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమా కూడా రిలీజ్ అయ్యింది.

ఒక్కమగాడు సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా, కృష్ణ సినిమా హిట్ అయ్యి ఎంతో కలెక్షన్లు సంపాదించుకుంది. ఆ తర్వాత 2009 లో బాలకృష్ణ మిత్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తే, రవితేజ కిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కిక్ సినిమా హిట్ అయ్యింది. ఆ తర్వాత 2011 లో బాలకృష్ణ హీరోగా నటించిన పరమవీరచక్ర సినిమాతో పాటు, రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమా రిలీజ్ అయ్యింది.

రవితేజ మిరపకాయ్ సినిమాతో మరొక హిట్ కొట్టారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ తలపడబోతున్నారు. అయితే ఈ సారి వీరిద్దరితో పాటు మరొక హీరో కూడా పోటీలో వస్తున్నారు. తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన లియో సినిమా కూడా అదే టైంలో రిలీజ్ అవుతుంది అని సమాచారం. ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. తెలుగులో విజయ్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఈసారి దసరాకి గట్టి కాంపిటీషన్ ఉంటుంది అని అర్థం అవుతోంది.

అయితే, గత సంవత్సరాల రిలీజ్ ఫలితాలు చూసుకుంటే, “ఈ సారి కూడా అదే జరుగుతుందా? టైగర్ నాగేశ్వర రావు సినిమా హిట్ అవుతుందా?” అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం, “రెండు సినిమాలు హిట్ అవ్వాలి అని, అలాగే వీటితో పాటు వచ్చే లియో సినిమా కూడా హిట్ అవ్వాలి అని కోరుకుందాం” అని అంటున్నారు. మరి సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి అంటే విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
ALSO READ : వాళ్ల సంగతి సరే..! మరి వీళ్ళు ఏం చేస్తున్నారు..?











మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఈ సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీకి వచ్చిన టాక్, కలెక్షన్స్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. చిరంజీవి మూవీకి ఇలాంటి కండిషన్ ఏమిటని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్ అని ప్రకటించినపుడే ఆడియెన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ మూవీ పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే టీజర్, ట్రైలర్ మరియు మూవీ ప్రమోషన్స్‌లో చిరంజీవి, డైరెక్టర్, నిర్మాత చెప్పిన మాటలకు ఈ మూవీ పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. మహతి స్వరసాగర్ ఇంతకు ముందు చేసిన పాటలు హిట్ అయ్యాయి. దాంతో భోళా శంకర్ మూవీకి మంచి పాటలు ఇస్తాడనుకున్నారు.
ఈ మూవీలోనీ ఏ పాట కూడా చార్ట్ బస్టర్ అవలేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ కాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే మహతి స్వర సాగర్ తాజాగా ఈ విషయం పై స్పందించాడని తెలుస్తోంది. ఈ మూవీకి తాను ఇచ్చిన పాటలు, కంపోజిషన్ పట్ల అసంతృప్తితో ఉన్నానని, మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా ఇవ్వలేకపోయానని అన్నట్టుగా సమాచారం. ఈ వార్త తెలిసిన నెటిజెన్లు, అంతా అయ్యాక అనుకుంటే ఏం వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
జాఫర్ సాదిక్ తమిళనాడులో ఈరోడ్‌లో 1995 జూలై 4 న జన్మించాడు. ప్రస్తుతం కోలీవుడ్ మరియు టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నజాఫర్ నటుడు మాత్రమే కాదు. అతను కొరియోగ్రాఫర్ మరియు డాన్సర్. కోలీవుడ్ లో పాపులర్ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఉంగలిల్ యార్ ప్రభుదేవా’ రెండవ సీజన్లో 2వ స్థానం పొందిన తర్వాత జాఫర్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత అతను సొంతంగా ‘లిఫ్టోదర్స్’ అనే పేరుతో డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించాడు.
జాఫర్ అనేక ఈవెంట్లలో స్టేజ్ షోస్ ఇచ్చాడు. అలా అతను 500కి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో ఫిబ్రవరి 13న జరిగిన TedxGCT ఈవెంట్లో జాఫర్ సాదిక్ చేసిన డ్యాన్స్ తో మరింత పాపులారిటీ వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ వేలమంది ఫాలోవర్స్ ను సంపాదించాడు. ప్రస్తుతం అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 506 K. జాఫర్ సాదిక్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సినిమా సిరీస్ ‘పావ కాదైగల్’లో నారికుట్టిగా నటించాడు.
ఆ తరువాత కోలీవుడ్ లో లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీలో మొదటిసారిగా నటించాడు. గ్యాంగ్ లో మెంబర్ గా నటించినప్పటికీ అతని పాత్రకి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తరువాత అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా జైలర్, విజయ్ దళపతి లియో, షారుక్ ఖాన్ జవాన్ సినిమాలలో నటిస్తున్నాడు.
మల్లికా షెరావత్ 1976 లో అక్టోబరు 24న హర్యానాలోని చిన్న గ్రామం మోథ్ లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ముఖేష్ కుమార్ లాంబా. వారిది సంప్రదాయ కుటుంబం. ఆమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలో రీమా పేరుతో ఇతర నటీమణులతో ఉండడంతో తన పేరును మల్లికా గా మార్చుకుంది. షెరావత్ మల్లికా తల్లి పుట్టింటి ఇంటి పేరు. తల్లి ఇచ్చిన మద్దతు వల్ల ఆ పేరును ఉపయోగిస్తున్నానని ఒక సందర్భంలో ఆమె చెప్పింది.
మల్లికా షెరావత్ మధుర రోడ్ లో ఉండే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్ లో డిగ్రీ చేసింది. మల్లిక సినిమాల్లో నటించడం తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె ఇంట్లో నుండి పారిపోయి వచ్చి, హిందీలో ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
మలయాళ హీరో కున్‌చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్‌చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్‌చకో బొబన్) ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్‌చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.
జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ నటించారు. జైలర్ సక్సెస్ లో స్పెషల్ క్యామియోలు కీలకమైన పాత్రను పోషించాయి. డైరెక్టర్ ఈ మూవీ కోసం ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి శివ రాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, బాలీవుడ్ నుండి జాకీష్రాఫ్ వంటివారిని తీసుకున్నారు. వారి పాత్రలు కూడా బాగున్నాయి. వీరిలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆడియెన్స్ లో బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి సునీల్ తీసుకున్నారు. అది కూడా కామెడీ హీరో క్యారెక్టర్.
కోలీవుడ్ ఆడియెన్స్ కి ఈ క్యారెక్టర్ నచ్చినప్పటికి, తెలుగు ఆడియెన్స్ కొందరు మాత్రం సునీల్ పాత్రని ట్రోల్ చేసినట్టుగా ఉందని అంటున్నారు. మిగతా ఇండస్ట్రీల నుండి అగ్ర హీరోలను తీసుకుని, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో చూపించారని. తెలుగు నుండి సునీల్ వంటి నటుడిని తీసుకుని, కమెడియన్ గా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మూవీ హిట్ అయ్యిందని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
తెలుగులో అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూసినవారెంతో మంది ఉన్నారు. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదని చాలా మంది ఫ్యాన్స్ బాధ పడుతుండేవారు. అయితే త్వరలో తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మారింది. కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో లేదు.
ఆ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న తరువాత జియో సినిమా భారతీయ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా స్ట్రీమ్ అవనుంది. ఈ న్యూస్ విన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు ప్రాంతీయ భాషలలో స్ట్రీమ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బాహుబలి 2 సినిమాలోని సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ చేశారని బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినపుడు విమర్శలు వచ్చాయి. బాహుబలి పై నుండి వస్తున్న అగ్ని బాణాలకు ఆకాశం వైపు చూస్తూ చేతులు తెరుస్తాడు. ఇలాంటి సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉంటుంది. అలాగే అమరేంద్ర బాహుబలి ఖడ్గం లాంటి ఆయుధం కూడా ఆ సిరీస్ లో కనిపిస్తుంది.
సూపర్ స్టార్ రజినికాంత్ మూవీ విజయం సాధించి చాలా ఏళ్లు అవుతోంది. అందువల్ల మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని జైలర్ మూవీ, ట్రైలర్ తో రిలీజ్ కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించారు. తమన్నా, సునీల్, వినాయకన్ కీలకపాత్రలలో నటించారు.
అయితే ఈ మూవీలో రజినీకాంత్ కోడలి పాత్రలో కనిపించిన నటి కూడా హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆమె అసలు పేరు అదితి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మిర్నా మేనన్గా మారింది. టాలీవుడ్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’, అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం’లో కూడా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
మిర్నా మేనన్ కేరళలో ఇడుక్కిలో జన్మించింది. ఇండస్ట్రీకి రాకముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసింది. ఆ తరువాత ఆమె ఫొటోలని చూసి ఒక దర్శకుడు తన మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 2016లో ‘పట్టదారి’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ‘కలవని మప్పిలై’ అనే సినిమాలో నటించింది. కోలీవుడ్ లో రెండు చిత్రాలు చేసిన తరువాత మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘బిగ్ బ్రదర్’ మూవీలో నటించింది. అలా ఆమెకు గుర్తింపు వచ్చింది.
కానీ ఇటీవల కాలంలో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ లోని సన్నివేశాలు లాజిక్స్ కి దూరంగా తీస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను చూసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. ఇలా పలు సీరియల్స్ లోని సీన్లు వాస్తవానికి దూరంగా ఉండడంతో నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
తాజాగా ప్రసారం అయిన ఒక హిందీ సీరియల్ లో టెలిఫోన్ వైర్ దాని ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించే సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో అయితే ఇలాంటివాటిని అంతగా ప్రేక్షకులు పట్టించుకొనే వారు కాదు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో ఇలాంటి సన్నివేశాల పై విపరితమైన ట్రోల్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఒక హిందీ సీరియల్ కు చెందిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు సీరియల్ లో ఒక వ్యక్తి కాల్ మాట్లాడుతూ నడుస్తూ, జారీ కిందపడతాడు. అయితే ఈ క్రమంలో అతని చెయ్యి టెలిఫోన్ ను తాకుతుంది. దాంతో రిసీవర్ ఎగిరి పైన తిరుగుతున్న ఫ్యాన్ పై నుండి కిందికి వచ్చి అతని మెడకు చుట్టుకుంటుంది. ఆ వైర్ అలా వస్తూనే, అతని మెడకి మరింతగా చుట్టుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆ గదిలోకి వచ్చిన వారు అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ సీన్ చూసిన నెటిజెన్లు ‘ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.