విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఖుషి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే పాటలతో అంచనాలను పెంచిన మేకర్స్ ఈ ట్రైలర్ తో ఆకట్టుకున్నారు. అయితే ట్రైలర్ చూసిన నెటిజెన్లు ఇందులో అర్జున్ రెడ్డి మూవీ రిఫరెన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
దాదాపు రెండు నిముషాల 45 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ లో విజయ్ దేవరకొండ, సమంత అందంగా కనిపించారు. ఆద్యంతం ఖుషి ట్రైలర్ ఆకట్టుకుంది. సమంత ముస్లింగా, బ్రాహ్మణ యువతిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. విప్లవ్, ఆరాధ్యలు వారి పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని, ఆ తరువాత ఎదుర్కొనే సమస్యలను చూపించారు. అలాగే విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘భర్త ఎలా ఉండాలో చూపిస్తా’, ‘నేను స్త్రీ పక్షపాతిని’, ‘నా పిల్ల’ అనే డైలాగ్స్ బాగున్నాయి.
అయితే ట్రైలర్ లో విజయ్ దేవరకొండ అక్కడక్కడ అర్జున్ రెడ్డి మూవీలోని తన మార్క్ పెర్ఫార్మెన్స్ ను చూపించాడు. ఇక ట్రైలర్ లో చివర్లో విజయ్ దేవరకొండ ఒక మహిళతో ‘ఎందుకు బయపడుతున్నావమ్మా, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు కానీ, నేను స్త్రీ పక్షపాతిని’ అనే డైలాగ్ చెప్పే సీన్ లో ఉన్న నటి అర్జున్ రెడ్డి మూవీలో కూడా ఉంటుంది. అలాగే ‘నా పిల్ల’ అనే డైలాగ్ కూడా అర్జున్ రెడ్డిలో చెప్పిన డైలాగ్. ఈ ట్రైలర్ ను చూసిన నెటిజెన్లు ఈ రెండు విషయాల పై కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: చూడడానికి అచ్చం “రష్మిక మందన్న” లాగానే ఉంది కదా..? ఈమె ఎవరో తెలుసా..?










మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ భోళా శంకర్. ఈ చిత్రంలో తమన్నా. కీర్తి సురేష్, సుశాంత్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆగస్ట్ 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించారు. జైలర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ఇక మూవీలోని ‘కావాలయ్యా సాంగ్’ తమిళ వెర్షన్ కు 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది.
“బ్రో సినిమా ఎలా ఉంది?” అని కోరాలో అడుగగా, దానికి
ఇవన్నీ తెలుగులో పూర్తిగా మార్చారు. కానీ సినిమాలో అవసరమైన ఇంటర్ loods లేవనే చెప్పాలి. సినిమా సంభాషణలు మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చి పెద్ద తప్పు చేశారు. ఆయన దృష్టి అంతా అంతర్లీనంగా భావం ఉండే డైలాగ్స్ మీద. సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకుండా మరో అజ్ఞాతవాసి రచన చేశారా? అనిపించింది. ఎంతో హాస్యాన్ని పండించవచ్చు. యమలోకం భూలోకం కాన్సెప్ట్ మీద తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో వినోదాన్ని పంచే ఈ సినిమాలో చాలా అవకాశం ఉంది. దర్శకత్వం సముద్రఖనికి ఇవ్వడం మరో పెద్ద తప్పు.
తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటుంది. ఇది హాస్యం పండించగల సీనియర్ తెలుగు దర్శకుడికి గాని లేదా వేరే కొత్త డైరెక్టర్ కి ఇచ్చినా మరింత హాస్యాన్ని పండించేవారు. పాటలు కూడా ఆశాజనకంగా లేవు. సినిమా హాల్లో స్పందన కరువైంది. శ్యాంబాబు పృధ్వి ఎపిసోడ్ అసలు పెద్దగా ఏమీ లేనేలేదు. అయినా సినిమా మొదట్లో వేసిన విజ్ఞాపన disclimer ప్రకారం ఈ సినిమాలో ఏ జంతువుల్ని హింసించడం జరగలేదు అని ముందే రాశారు. మొత్తానికి బ్రో సినిమా ఫ్లాప్ అని అనలేము హిట్ అని అనలేము.
బహుశా ఈ చిత్రానికి పని చేసిన సినీ కళాకారులు మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ లాంటి పెద్ద పెద్ద పేర్లు చూసి మనలో అంతర్లీనంగా ఉన్న ఒక బాధేమో ? స్థూలముగా అంతగా ఆకట్టుకోలేని సినిమా. పదేపదే సినిమాల్లో గతంలో పవన్ కళ్యాణ్ చార్ట్ బస్టర్ పాటలు వినిపించడం తీవ్ర అనారోగ్యనికి లోనయ్యా. ఏదైనా ఒక పాట రెండు సెకండ్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతే అభిమానులకి కిక్ ఉంటుంది.
పూర్తి స్థాయిలో పెడితే ఇలాగే ఉంటుందని ఇదొక పెద్ద విఫల ప్రయోగం. చెప్పాలంటే నాకు సినిమా అరగలేదు వేడి చేసింది. అజీర్ణంగా ఉంది. అందుకని ధనియాలు జీలకర్ర నిమ్మకాయ రసం తాగా. సినిమా కాన్సెప్ట్ మూల కథ మంచిదండోయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు క్షమాపణలతో, ఒకసారి వీక్షణకు ఉపయుక్తం” అంటూ రాసుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించగా, సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు జరుగగా, కమెడియన్ హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆది మెగా కుటుంబాన్ని విమర్శించేవారికి తనదైన ప్రాస, పంచ్‌లతో సమాధానం చెప్పాడు. సహజంగా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రం హీరోలే అభిమనులుగా ఉంటారని అన్నారు. ఆది తన పంచ్ లతో మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాడు.
హైపర్ ఆది ఈ ఈవెంట్ లో పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ల గురించి కూడా మాట్లాడాడు. రామ్ చరణ్ గురించి చెబుతూ ‘ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవలేదు. కానీ చిరంజీవిగారి కొడకు చిరంజీవి అయ్యాడు అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అయితే ఇవే కామెంట్స్ మూడేళ్ళ క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ అనియన్ స్లైస్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
హైపర్ ఆది భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేసిన తరువాత సదరు ట్విట్టర్ యూజర్ ‘ఈ ట్వీట్ మనం మూడున్నరేళ్ల క్రిందటే వేసాం’ అంటూ ఆ ట్వీట్ ని షేర్ చేయడంతో నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
1. సూపర్ స్టార్ రజినీకాంత్:
2. ధర్మేంద్ర:
3. మనీషా కోయిరాల:
4. సంజయ్ దత్:
5. ఫర్ధీన్ ఖాన్:
6. పూజా భట్:
ఆగస్ట్ 10న రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ కండిషన్ కూడా అలాగే కనిపిస్తోంది. ఫస్ట్ డే 391 షోలు మాత్రమే పడుతున్నట్లు సమాచారం. వాటిలో 85 షోలు మాత్రమే హౌస్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఇలా ఉంటే, ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న ‘బిజినెస్ మెన్’ మూవీకి ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి.
మహేష్ బాబు బర్త్ డే కి రీరిలీజ్ కానున్న నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ‘బిజినెస్ మెన్’ మూవీకి హైదరాబాద్ లో 172 షోలు బుక్ అయినట్లు తెలుస్తోంది. వాటిలో 110 షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయని, ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటేసిందని తెలుస్తోంది.
మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో రి రిలీజై సెన్సేషన్ సృష్టించగా, ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న బిజినెస్ మేన్ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటిందని తెలుస్తోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


















