నందమూరి తారకరామారావు తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేశారు. హీరోగా, ప్రొడ్యూసర్, దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ప్రతిభను చాటారు. ఆయన సినీ పరిశ్రమకి క్రమశిక్షణ నేర్పిన యాక్టర్ గా పేరు పొందారు. రాముడు, కృష్ణుడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలతో ఎన్టీ రామరావుగారు నటించారు.
కెరీర్ మొదట్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎక్కువ చిత్రాలలో నటించాడు. 3 షిఫ్టుల్లో కూడా పని చేసిన రోజులు ఎన్టీఆర్ సినీ జీవితంలో ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో రోజుకు 2 షిఫ్టులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీ రామరావుగారి ఆహారపు అలవాట్ల గురించి ఆశ్చర్య పోయేవారంట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి విన్నవారు షాక్ అయ్యేవారంట. ఎన్టీఆర్ ఉదయాన్నే అరచేతి మందం ఉండే ఇడ్లీలను 20కి పైగా అవలీలగా తినేవారంట. పొద్దున్నే 6 గంటలు అయ్యేసరికి మేకప్ వేసుకుని సిద్దంగా ఉండేవారు. ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లి పగలు 2 గంటల అనంతరం మరో షూటింగ్ కు వెళ్ళేవారంట.
ఎన్టీఆర్ షూటింగ్ గ్యాప్ లో నిత్యం నాలుగైదు ఆపిల్ జ్యూస్ లు తాగేవారట. సాయంత్రం పూట స్నాక్స్ గా బజ్జీలు కానీ, డ్రై ఫ్రూట్స్ ను కానీ తీసుకునేవారు. ఎన్టీఆర్ రోజుకు 30 – 40 బజ్జీలు తింటుంటే అందరూ ఆయనను ఆశ్చర్యంగా చూసేవారట. ప్రతిరోజూ ఎన్టీఆర్ 2 లీటర్ల బాదం పాలు ఖచ్చితంగా తాగేవారట. అదే ఎండాకాలంలో అయితే ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు వేరే విధంగా ఉండేవట.
ఎండాకాలంలో మధ్యాహ్నం పూట ఎన్టీఆర్ మామిడి పళ్ల జ్యూస్ తో తాగేవారంట. అది మాత్రమే కాకుండా ఆ మామిడి పళ్ల జ్యూస్ లో గ్లూకోజ్ పౌడర్ ను కలిపి తాగేవారు. వైద్యుల సూచనల మేరకు అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ ను ఎన్టీఆర్ తీసుకునేవారట. ఆ ముద్దను ఎన్టీఆర్ షాట్ గ్యాప్ లో తినేవారట. ఎన్టీఆర్ తన కెరీర్లో 300లకు పైగా సినిమాలలో నటించారు. ఆయన హీరోగా నటించే సమేమాలో అత్యధిక పారితోషికం తీసుకునేవారని తెలుస్తోంది.
Also Read: బిగ్బాస్ తెలుగు-7 లో ఎంట్రీ ఇవ్వబోతున్న డాన్స్ సెలబ్రిటీ కపుల్..! ఎవరంటే..?








పమ్మి సాయి అసలు పేరు శ్రీనివాస్ సాయిరామ్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతూరు భీమవరం అనే విషయం తెలిసిందే. పమ్మి సాయి ఊరు కూడా అదే కావడంతో అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిన్నతనం నుండి పరిచయం ఉంది. పమ్మి సాయికి ఆ పరిచయాన్నితోనే సరదాగా మహేష్ బాబు నటించిన ‘అతడు’ మూవీలో త్రివిక్రమ్ మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా సరదాగా మొదలైన పమ్మి సాయి కెరీర్ ప్రస్తుతం కొనసాగుతోంది.
మొదటి ఛాన్స్ ఇచ్చి వదిలిపెట్టకుండా త్రివిక్రమ్ వరుసగా తన చిత్రాలన్నిటిలోనూ పమ్మి సాయికి మంచి పాత్రలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ‘నువ్వే నువ్వే’ సినిమాలో తప్ప పమ్మీ సాయి త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన అన్నిచిత్రాలలో నటించాడు. అలాగే ఇతర డైరక్టర్ల సినిమాలలో కూడా మంచి ఆఫర్స్ లభించాయి. అలా పమ్మి సాయి ఛలో, చల్ మోహనరంగా, శతమానం భవతి, ఎవరు లాంటి సుమారు 60 పైగా సినిమాలలో మంచి కామెడీ పాత్రలు చేశారు.
త్రివిక్రమ్ మూవీ చివరగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని సాధించిన ‘అల వైకుంఠపురంలో పోషించిన పాత్రతో కూడా పమ్మి సాయికి మంచి పేరు తెచ్చింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినపుడు వచ్చే ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపించి నవ్వులు పూయించాడు.







