పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న సినిమా ‘సలార్’. బాహుబలితో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సలార్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ లో సలార్ మూవీకి, కేజీఎఫ్ కు కనెక్షన్ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సలార్ రాఖీ భాయ్ కలిస్తే ఇలా ఉంటుందంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న తాజా పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో విలన్స్ గా మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా సలార్ టీజర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించింది. సలార్ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్, 1.67 లైక్స్ వచ్చాయి.
ఈ టీజర్ లో ఉన్న క్లూస్ ను బట్టి ఈ మూవీకి కేజీఎఫ్ 2 మూవీకి కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఈ మూవీలో రాఖీ భాయ్ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ 2 మూవీ క్లైమాక్స్ లో రాఖీ భాయ్ ఉన్న నౌక సముద్రంలో మునిగిపోతుందని తెలిసిందే. అయితే ఆ సీన్ తరువాత సలార్, రాఖీ భాయ్ ని కలిస్తే వారిద్దరు కలిస్తే ఇలా ఉంటుందంటూ దువ్వాడ జగన్నాధం మూవీలోని ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Nice nice pic.twitter.com/y0rfyqkKjm
— VikramShelby (@MrVicky184) July 6, 2023

హైపర్ ఆది మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీషోలో ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోలో తనదైన పంచులతో నవ్వించాడు. హైపర్ ఆది ఈ ఎపిసోడ్ లో పెళ్లి చూపుల థీమ్ తీసుకున్నాడు. పెళ్లి చూపులకి ఆర్టిస్టులంతా కలిసి తన కుటుంబంలా వచ్చారని అనడంతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ‘ఊ అంటావా మావ’ సింగర్ ఇంద్రావతి చౌహన్ పాడిన ఫోక్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆది రెయిన్ డ్యాన్స్ చేశాడు. జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో కలిసి ‘వాన వల్లప్ప వల్లప్ప’ పాటకి స్టెప్పులు వేశాడు. అయితే ప్రోమో చివర్లో ఆది సౌమ్య రావు కోసం ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పి, గిఫ్ట్ ఇస్తాడు. సౌమ్య గిఫ్ట్ కవర్ తెరచిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. సౌమ్య రావ్ తన తల్లితో ఉన్న ఫోటోను ఆది ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. అప్పుడు ఆమె తల్లి ఫోటోలను ప్లే చేయడంతో వాటిని చూసిన సౌమ్య తన తల్లి గురించి చెప్తు బోరున ఏడ్చేసింది.
అమ్మకి విపరీతమైన తలనొప్పి వచ్చిందని, హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో డాక్టర్లు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. అమ్మ తనెవరో తెలియనంతగా గతాన్ని మర్చిపోయిందని చెప్పింది. మూడున్నర ఏళ్లు అమ్మని బెడ్ మీదనే చూసుకున్నానని, దేవుడు అమ్మకి అలాంటి స్థితి ఇస్తాడని అనుకోలేదని, తన తల్లి మళ్లీ తన కడుపున జన్మించాలని అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకోవడంతో ఇంద్రజ ఆమెను ఓదార్చారు.

రివ్యూ:
భీమ్ రావు క్యారెక్టర్ లో జగపతిబాబును తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించారు. భీమ్ రావు క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. మల్లేష్ గా ఆశిష్ గాంధీ మెప్పించారు. జ్వాలాబాయ్ పాత్రలో మమతా మోహన్‌దాస్ యాక్టింగ్ బాగుంది. ఆమె నటించిన సన్నివేశాలలో మమతా మోహన్‌దాస్ డామినేషనే కనిపిస్తుంది.
భీమ్ రావు పెద్ద భార్య మీరాబాయ్ క్యారెక్టర్ లో విమలా రామన్ ఆకట్టుకుంటుంది. టైటిల్ పాత్రలో నటించిన గనవి లక్ష్మణ్ ఈ మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది. కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ ని చూపించింది. కరుణం పాత్రలో ఆర్ ఎస్ నందా నవ్వులు పూయించాడు. మిగిలినవారు తమ పాత్రలు మేరకు నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే నాఫల్ రాజా అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు కథకి తగినట్టుగా ఉన్నాయి.





మెగాస్టార్ చిరంజీవి సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇంద్ర’. ఈ మూవీని అశ్వినీదత్ ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై నిర్మించారు. చిరంజీవి నటించిన మృగరాజు, డాడీ, శ్రీమంజునాథ లాంటి సినిమాలు ప్లాప్ అవడంతో ‘ఇంద్ర’ మూవీ పై అంతగా అంచనాలు ఏర్పడలేదు.
ఈ మూవీ 2002 జూలై 24న రిలీజ్ అయ్యింది. మొదటి షోతొనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు సృష్టించింది. 122 సెంటర్స్ లో 100 రోజులు, 32 సెంటర్స్ లో 175 రోజులు రన్ అయ్యి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో ఒక సీన్ లో చిరంజీవి తన మేనకోడలు సీమంతానికి పిలవడం కోసం ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చినపుడు ఆర్తి అగర్వాల్ కొన్ని డైలాగ్స్ చెబుతుంది.
అయితే డబ్బింగ్ చెప్పక ముందు ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ ఎలా డైలాగ్స్ చెప్పిందో తెలిపే ఒక వీడియోని ఎంటర్టైన్మెంట్ మాషప్ అనే ఇన్ స్టా పేజ్ లో షేర్ చేశారు. ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ తనకు తెలుగు డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోతుంది. ‘నవ్వు ఆపుకుని డైలాగ్స్ ఎలా చెప్పావ్ చిరు’ అని ఆ వీడియో కి క్యాప్షన్ ఇచ్చారు. దానిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియెన్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ మూవీని రూపొందించారు. ఈ మూవీ దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ మూవీలోని డైలాగ్స్ పై వినమర్శలు వచ్చాయి. ఆ తరువాత పాత్రల ఆహార్యం పైన ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాకి మొదటి 3 రోజులు మంచి వసూళ్లు వచ్చాయి. సోమవారం నుండి పడిపోయాయి. ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్, రచయిత పై హిందూ సంఘాలు కూడా విమర్శిస్తున్నారు. ప్రేక్షకుల నుండి ప్రముఖుల వరకు అందరు విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.
ఈ మూవీలోని లంక సెట్, సీన్స్ హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ వీడియో క్లిపింగ్ కు దెయ్యాల కోట అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ వాయిస్ ఓవర్ తో ఎడిట్ చేసి షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.


సాధారణంగా బోయపాటి చిత్రాలలో లాజిక్‌లు అస్సలు చూడకూడదని టాక్. దానికి కారణం ఆయన తీసే సినిమాలలో ఒకదానిలో హీరో దేవుడు అవడం, తల గాల్లోకి ఎగరడం, ఆ తలను గద్ద ఎత్తుకెళ్ళి పోవడం లాంటివి కనిపిస్తాయి. రీసెంట్ గా ‘స్కంద’ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో రామ్ మాస్ లుక్ లో కనిపించారు. ఆయన చెప్పిన డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ డైలాగ్ రామ్ ఫైట్ చేసే క్రమంలో చెప్తాడు. ఆ ఫైట్ ను కోనేరులో తీశారు. అంటే వాటర్ లో జరిగిన ఈ ఫైట్ లో బోయపాటి మార్క్ అయిన రక్తపాతం చాలా ఎక్కువగా జరిగింది. అయితే రక్తం అంటే ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం రక్తం ఆరెంజ్ కలర్ లో కనిపించింది.
దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బోయపాటి పై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అసలు ఆరెంజ్ కలర్ రక్తం ఎందుకు వచ్చింది. రక్తంతో వాటర్ కలసినా కూడా అవి ఆరెంజ్ కలర్ లోకి మారవు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.