దర్శకుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మూవీని నుండి తప్పుకున్నాడని, ఆ తరువాత పూజ హెగ్డే తప్పుకుందని వార్తలు వినిపించాయి. గుంటూరు కారం దర్శకుడు త్రివిక్రమ్ హఠాత్తుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీని ప్రకటించాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిలవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో నాలుగవ సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వార్త వల్ల మహేష్ ఫ్యాన్స్ లో నిరసన కనిపిస్తోంది. గుంటూరు కారం మూవీ షూటింగ్ సగం కూడా చేయలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు, స్క్రిప్ట్ లో మార్పులు, పూజా హెగ్డేని తప్పించడం, తమన్ గురించి ఇలా చాలా ఆటంకాలతో వాయిదా పడింది.
కొన్ని రోజుల నుండి ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ సర్లే షూటింగ్ మొదలయ్యింది. కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేస్తే చాలని ఫ్యాన్స్ మూవీ అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తీరా చూస్తే త్రివిక్రమ్ నుండి అల్లు అర్జున్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులు ఫీలవడానికి కారణం కొన్ని నెలలు ఆగి గుంటూరు కారం మూవీ చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ తో మూవీ గురించి ప్రకటిస్తే బాగుండేది.
హఠాత్తుగా ఇప్పుడే ప్రకటించడం వల్ల మీడియా అటెన్షన్ మొత్తం ఆ ప్రాజెక్టు మీదనే ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారట. ఆ మూవీ ఏ జానర్, సినిమాకి బడ్జెట్ ఎంత, కథ ఏంటి లాంటి ప్రశ్నలతో బన్నీ మూవీ గురించే చర్చలు జరుగుతాయని, అప్పుడు గుంటూరు కారం మూవీ పక్కకు వెళ్తుందని మహేష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
Also Read: “ప్రాజెక్ట్ K” లో ప్రభాస్ పాత్ర ఇదేనా..? అది ఏమిటంటే..?

ప్రభాస్, దీపికా పదుకొనె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా, హాలీవుడ్ మార్వెల్ సినిమాల వలె చెడు పై మంచి సాధించే గెలుపు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథలో పురాణాలను కూడా చేర్చాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణుమూర్తి ఆఖరి అవతారం అయిన కల్కి పాత్రలో నటిస్తున్నాడని, ఈ మూవీ పోస్టర్లో కనిపిస్తున్న చేయి ఆయనదే అని నెట్టింట్లో వార్తలు షికారు చేస్తున్నాయి.
ప్రభాస్ టెక్నాలజీ సహాయంతో మోడరన్ విలన్స్‌తో ఎలా పోరాడతాడనేది స్టోరీ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్‌తో నిర్మిస్తున్నారు. ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ఈ చిత్రంలో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 12న రిలీజ్ కానుంది.
పది సంవత్సరాల క్రితం ‘జులాయి’ మూవీతో ప్రారంభం అయిన త్రివిక్రమ్ – అల్లు అర్జున్ జర్నీ ‘అల వైకుంఠపురంలో’ వరకు వచ్చింది. వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో తెరకెక్కాయి. మళ్లీ వీరి కాంబో ఎప్పుడు వస్తుందా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
అల్లు అర్జున్ కు ఇది 22వ చిత్రం. త్రివిక్రమ్-బన్నీ కాంబోలో నాలుగవ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో బన్నీ అభిమానుల్లో సంతోషం రెట్టింపైంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఈ మూవీలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పుష్పకు సీక్వెల్ గా రానుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్-బన్నీ నాలుగో మూవీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియో పై నెట్టింట్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ గతంలో హిందీ ‘దబాంగ్’ మూవీని గబ్బర్ సింగ్ గా తీసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిపాడు. దాంతో ఇప్పుడు తేరి రీమేక్ గా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని గబ్బర్ సింగ్ మించి, హిట్ చేస్తాడని పవన్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఇదే తేరి మూవీని బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కలీస్ తెరకెక్కించబోతున్నాడు. దీనిని డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు.
వాస్తవానికి ‘తేరి’ స్టోరీ ఇప్పటిది కాదు. విజయ్ కాంత్ హీరోగా ఛత్రియన్ అనే చిత్రం 1990లోనే వచ్చింది. ఆ మూవీని తెలుగులో క్షత్రియుడు పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు మణిరత్నం కథను సమకూర్చగా, సుభాష్ దర్శకత్వం చేశారు. కథ విషయానికి వస్తే, హీరో భార్య విలన్ల చేతిలో చనిపోతుంది. దాంతో హీరో పోలీస్ జాబ్ వదిలి పిల్లలతో అజ్ఞాతంలోకి సాధారణ జీవితం గడుపుతుంటాడు.
విలన్ జైలు నుంచి బయటికి వచ్చి, హీరో మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకునేలా చేస్తాడు. హీరో విలన్ ను చంపడంతో కథ ముగుస్తుంది. తేరిలో సమంత పాత్రను రేవతి, యామీ జాక్సన్ పాత్రను భానుప్రియ చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పక్కన శ్రీలీల ఫిక్స్ కాగా, మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. హిందీలో హీరోయిన్స్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.


గుంటూరు కారం మూవీ మొదలు పెట్టినప్పటి నుండి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల ముందు ఈ మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అది రూమర్ అని తెలిసి పోయింది. ఆ తరువాత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజహెగ్డే డేట్స్ సర్దుబాటు కాక ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక సెకండ్ హీరోయిన్ అయిన శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో త్రివిక్రమ్ మీనాక్షి చౌదరిని డేట్స్ అడిగిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మీనాక్షి మొదటి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ, మీనాక్షి ఆల్ రెడీ మొదలుపెట్టేసినట్టు ఉంది 2, 3 సినిమాలు, బిజీ హీరోయిన్ అయిపోతుంది. తనకు కూడా డేట్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ అన్నాడు. సరదాకి అన్నా, ఇప్పుడు అదే నిజం అయ్యిందని, 2 ఏళ్ల క్రితమే త్రివిక్రమ్ మీనాక్షిని డేట్స్ అడిగాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.





1. సామజవరగమన:
2. అన్నీమంచి శకునములే:
3. అల వైకుంఠపురములో:
4. ఇంటిగుట్టు: