తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితమైన పేరు సౌందర్య.. కేవలం పేరుకే కాదు అందం, అభినయం, అణకువ అన్నిట్లో నిజంగా సౌందర్యకు సాటి ఎవరూ లేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సునామీలా దూసుకు వచ్చిన ఈ తార అతి చిన్న వయసులోనే ఆకాశంలో చెరిగిపోని తారగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా ఫ్లైట్ ఆక్సిడెంట్ లో సౌందర్య మరణించడం జరిగింది.
అయితే ఆమె ఫ్లైట్ ఎక్కడానికి ముందు తన వదినని కోరిన రెండు కోరికలు ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఫ్లైట్ కోసం బయలుదేరుతున్న సౌందర్య తనకు కుంకుమ మరియు కాటన్ చీర తీసుకురావాల్సిందిగా ఆమె వదినను కోరడం జరిగింది. బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సౌందర్యకు కాటన్ చీరల అవసరం కలిగిందట.

అదే విషయాన్ని ఆమె వదినకు తెలియపరచి తను వచ్చే లోపు తెచ్చి పెట్టమని చెప్పిందట. సౌందర్య చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె వదిన…బట్టలు తెచ్చి పెట్టమని వెళ్లిన సౌందర్య ఇక తిరిగి రాలేదు అని చెప్పి బాధపడ్డారు. ఏప్రిల్ 17 2004న సౌందర్య ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. చనిపోయే నాటికి సౌందరర్య వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.

బాలకృష్ణ నిర్మిస్తున్న నర్తనశాలలో ద్రౌపది పాత్రలో నటిస్తున్న సౌందర్య షూటింగ్ పూర్తికాకముందే మరణించింది. ఆమె మరణించడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోవడమే కాకుండా అది రిలీజ్ కూడా కాలేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా అగ్ర నటిగా పలు భాషలలో నటించి నేర్పించింది సౌందర్య. కొలంగల్ అనే తమిళ్ టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై కూడా తన ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న సౌందర్య ఆమె హఠాత్ మరణం కారణంగా నెరవేరలేదు.
ALSO READ : ఈ చిన్న తప్పే సింగర్ “సాయి చంద్” మృతికి కారణమా..? ఇలా చేయకపోయి ఉంటే..?

1. సామజవరగమన:
2. అన్నీమంచి శకునములే:
3. అల వైకుంఠపురములో:
4. ఇంటిగుట్టు:
రాకేష్ మాస్టర్ పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలు పాల్గొన్నారు. ఈ సంతాప సభకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ డైరక్టర్ వైవీఎస్ చౌదరి హాజరు అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మూవీలో 4 సూపర్ హిట్ సాంగ్స్‌కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన శిష్యులు రాకేష్ మాస్టర్ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రాకేష్ మాస్టర్ పేరుతో జాతీయ పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు.
లేటెస్ట్ ఢీ షో ఎపిసోడ్ ప్రోమోలో రాకేష్ మాస్టర్ ఓల్డ్ వీడియో ప్లే చేశారు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కాళ్లు మొక్కిన వీడియో చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, “మాస్టర్ గారితో 7, 8 ఏళ్ల జర్నీ. చాలామంది తెలిసీ, తెలియక మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పై నుంచి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ఉంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది.
ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. స్త్రీలు ఎవరైనా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమస్యతో బాధపడుతుంటే ఫ్యామిలీ వారికి అండగా ఉండాలని సూచించింది. ఆ సమయం తనకు చాలా భారంగా ఉండేదని, అప్పుడే ట్రైనర్ ఆధ్వర్యంలో ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడం ప్రారంభించాను.
అలాగే ఇష్టమైన వారితో, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించే దాన్ని. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో నా భర్త గౌతమ్ ఎంతో మద్దతుగా నిలిచారని కాజల్ అగర్వాల్ తెలిపింది. తనను అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటకు రాగలిగానని చెప్పింది.
అయితే అదే కంపెనీలో పని చేస్తున్న షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్‌లో పని చేసే ఛాన్స్ వస్తుంది. దాంతో ఆమె దగ్గర కొద్ది రోజుల్లోనే మంచి మార్కులు తెచ్చుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం అయ్యింది? దీనిలో పల్లవి (అనన్య) క్యారెక్టర్ ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే..
రివ్యూ:
ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుండి టీలు చేసే వర్క్ ఇస్తారు. కార్పొరేట్ ప్రపంచంలో ఒక పల్లెటూరి కుర్రాడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? పనిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆఖరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనే విషయాన్ని 5 ఎపిసోడ్లలో చూపించారు.
హర్షిత్ రెడ్డి అరుణ్ కుమార్ ఇంటర్న్ పాత్రలో ఒదిగిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, ఆఫీస్ లో చెప్పిన పనులన్ని చేస్తూ మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. డామినేషన్, స్వార్ధం కలిగిన టీమ్ లీడర్ షాలినీ క్యారెక్టర్ లో తేజస్వి పర్వాలేదనిపించింది. పల్లవిగా అనన్య ఒకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి నవ్వించేందుకు ట్రై చేశారు. మిగతా వాళ్ళు తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
రేటింగ్:
ఈ చిత్రంతో విశ్వక్ సేన్ హీరోగా గుర్తింపును పొందాడు. ఈ మూవీ తరువాత విశ్వక్ ‘మాస్ కా దాస్’ గా మారారు. ఈ చిత్ర డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రెండిటిలోనూ రాణిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ సమయంలో మొదటి రోజు 70 లక్షలు మాత్రమే కలెక్షన్ రాబట్టింది. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం రీ రీలీజ్ మాత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రీ రీలీజ్ కోసం యూత్ చాలా ఆసక్తితో ఎదురుచూశారు.
ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భారీ వసూళ్లను సొంతం చేసుకుందని సమాచారం. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ మొదటి రోజే కోటి డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి, రికార్డ్ సృష్టించింది. దాంతో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా పెద్ద చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు పోకిరి, ఒక్కడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఖుషి, జల్సా , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆరెంజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ దేశముదురు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సింహాద్రి లాంటి చిత్రాల పక్కన చోటు సంపాదించుకుంది.


ఈరోజు మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేయబోతున్నట్లు ఉపాసన వెల్లడించారు. నేడు మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పాల్గొననున్నారు. సన్నిహితులు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. బారసాల వేడుక సందర్భంగా రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ రామ్ చరణ్- ఉపాసన జంటకు ఒక ఖరీదైన బహుమతి పంపించారట.
ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖేష్ అంబానీ పంపిన ఆ బహుమతి ఏమిటంటే బంగారు ఊయల. దాని కోసం కోటి రూపాయలకు కన్నా ఎక్కువే ఖర్చు అయ్యిందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఎవరు అఫిషియల్ గా ప్రకటన చేయలేదు.
2001లో విడుదల అయిన గదర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా గదర్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఆఖరి షెడ్యూల్లో పాల్గొన్న అమీషా పటేల్ చిత్రబృందం పై ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది.
అమీషా పటేల్ ట్వీట్లో ‘సాంకేతిక నిపుణులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, ఇతర స్టాఫ్ కి వేతన బకాయిలు ఇవ్వలేదని, షూటింగ్ ఆఖరి రోజు చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళడానికి, ఫుడ్ బిల్లులకు డబ్బు చెల్లించలేదు. యాక్టర్స్ కు, స్టాఫ్ కి కార్లను అరెంజ్ చేయలేదు. షూటింగ్ దగ్గరే ఒంటరిగా వదిలి వేశారు.
అయితే జీ స్టూడియోస్ టీమ్ వెంటనే అన్ని బకాయిలను చెల్లించి, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ చేసిన తప్పులను సరి దిద్దారు. సమస్యను సాల్వ్ చేసిన నీరజ్ జోషి, షరీక్ పటేల్, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ యూనిట్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గదర్ 2 సినిమాలో అమీషా పటేల్ సన్నీ డియోల్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ మౌర్య తన భార్యను చాలా కష్టపడి చదివించి ఆమె కల అయిన ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేశాడు. తీరా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ జాబ్ వచ్చిన తరువాత ఆమె అతడిని మోసం చేసింది. పైగా అతడి పై వరకట్నం కేసు పెట్టి జైలుకు పంపించింది. ఈ విషయం పై ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి కూడా స్పందించారు. నెటిజెన్లు ఆమెను, రాహుల్ రవీంద్రన్ ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తూన్నారు. దీనిపై తాజాగా రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ లో ఇలా చెప్పుకొచ్చారు.
“మీరు అందరూ ఆమెతో పోరాడిన తరువాత నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఎత్తి చూపుతున్న మైండ్ సెట్ ప్రాబ్లెమ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఆమె మాట వినండి. ఆ పై ఆమెకు కొంచెం ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆమె మీ పై ప్రేమను కురిపిస్తుంది. ఆమె మీకు ఇష్టమైన అక్కగా మారుతుంది.
నాకు లభించిన అతి పెద్ద ఆశీర్వాదాలలో ఆమె కూడా ఒకటి. ఆమె పరిమితి లేకుండా ప్రేమిస్తుంది. మరియు మీకు భరోసా ఇస్తుంది. ఇతరుల వైపు నుండి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితంలో ఉన్న స్త్రీలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మరియు మీరు మీ కంటే ఎక్కువగా వారిని గౌరవించండి. అప్పుడు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియదు” అని చెప్పుకొచ్చారు.