తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలలో ఉన్నత స్థితిలో ఉంది. అన్ని ఇండస్ట్రీల దృష్టి ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది. ఒకప్పుడు తక్కువగా చూసిన టాలీవుడ్ ఇప్పుడు అంతర్జాతీయంగాను సత్తా చాటింది. గత ఏడాది జక్కన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి తెలుగు సినిమాల పై మాలీవుడ్ సినిమాలలో సెటైర్ వేస్తున్నారు. అలాంటి ఒక సీన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగింది. ఆ తరువాత వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ తో అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ వంటి డైరెక్టర్ ప్రశంసలు కురిపించాడు అంటే తెలుగు సినిమా ఖ్యాతి గురించి అర్ధం చేసుకోవచ్చు. జక్కన్న నెక్స్ట్ సినిమా కోసం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఒక మలయాళ సినిమాలో టాలీవుడ్ పై సెటైర్ వేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘త్రిశంకు’ అనే మలయాళ మూవీలో హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు. అపుడు హీరోయిన్ వల్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడు ఏమో అంటుంది. అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి తెలుగు సినిమాలలో లాగా లేచిపో అని చెప్తుంది. నిజానికి అన్ని తెలుగు సినిమాలూ అలా ఉండవు. కానీ ఈ సినిమాలో ఆ పదం వాడేసారు. ఈ వీడియో చూసిన కొంత మంది తెలుగువాళ్ళు మా సినిమాలు అన్నీ అలా ఉండవు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Mollywood's direct satire on Tollywood 😂🫢 pic.twitter.com/N5KJI9VdU8
— Agnyathavaasi (@ThisisHarsha_) June 26, 2023

ఆదిపురుష్ సినిమా మొదట్లో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశంలో జరిగిన ఫైట్ ను ఎలా షూట్ చేశారు? ఫైట్ షూటింగ్ ముందు ఎలా వర్కవుట్ చేశారో తెలిపే వీడియో రిలీజ్ అయ్యింది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ కు బదులుగా ఫైటర్స్ తో రిహార్సల్స్ ఫైట్ ను చిత్రీకరించారు. ఆ తరువాత అదే ఫైట్ ను ప్రభాస్ పై షూట్ చేశారు. ఆ ఫైట్ సీన్స్ కు గ్రాఫిక్స్ యాడ్ చేశారు.
ఇక ఈ వీడియో చూసిన వారు ఇంత కష్టపడి పోరాట సన్నివేశాలను చిత్రీకరించారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు డమ్మీ ఫైటర్స్‌తో చిత్రీకరించిన ఈ ఫైట్ సీన్‌ని, అనంతరం డమ్మీ ఫైటర్ ఫేస్ కు బదులుగా ప్రభాస్ ఫేసును అతికించే ఛాన్స్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో చూపించిన ఫైట్ సీన్స్ ఎంతో క్లిష్టంగా ఉన్నాయి. వీటిని ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్ మాత్రమే చేయగలడని, హీరో ప్రభాస్ అంత క్లిష్టమైన ఫైట్ ను ఫ్లెక్సిబుల్‌గా పోరాడగలరా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీలో హీరో ప్రభాస్ రాముడిగా, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవదత్ నగరే, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం చేయగా, ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు.
తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి బ్రో సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తుండగా, పవన్ కల్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. తేజ్ పక్కన హీరోయిన్లుగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా, దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ను రాశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
బ్రో సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ తో ప్రమోషన్లను ప్రారంభించాలని భావిస్తోంది. జూలై మూడవ వారంలో బ్రో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతూ కూడా బ్రో టీజర్ కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పే టైంలో టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బ్రో టీజర్ రిలీజ్ అవడంతో దీనిపై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
“రాకేష్ మాస్టర్ తో 8 ఏళ్ళు ప్రయాణించానని, ఆ సమయంలో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మాకు తెలియదు. తాను, సత్య మాస్టర్ ఇద్దరు విజయవాడలో డ్యాన్స్ నేర్చుకున్న అనంతరం రాకేష్ మాస్టర్ వద్దకు వచ్చాము. రాకేష్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. యూట్యూబ్‌లో చూస్తున్న రాకేష్ మాస్టర్ డ్యాన్స్ ఐదు పర్సంటే అని, ఈ విషయం చాలా మందికి తెలియదని అన్నారు. చిన్నప్పటి నుండి నాకు వ్యక్తిగతంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ డ్యాన్స్ చూసి అభిమానించడం మొదలుపెట్టాను.
గతంలో ఆయన చాలా బాగా డ్యాన్స్ చేసేవారు. రాకేష్ మాస్టర్ ను గురువు అని చెప్పుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ ఫెక్ట్ గా వచ్చే వరకు వదిలిపెట్టేవారు వారు కాదని చెప్పారు. మాస్టర్ ఎక్కడున్నా కూడా బాగుండాలని అనుకున్నాం. ఇలా అవుతుందని అసలు అనుకోలేదని అన్నారు. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది మేమే. రాకేష్ మాస్టర్ తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు. మాస్టర్ తోనే ఉండి, ఆయన ఇన్ స్టిట్యూట్ లో క్లాసులు చెప్పవాళ్ళం, అక్కడే బతికాము.
ఆ తర్వాత మాస్టర్ దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టినపుడు ఏం చేయాలో తెలియక అక్కడి నుండి బయటకు వచ్చి మాస్టర్లుగా అయ్యాము. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వారికి తోచిన థంబ్ నెయిల్స్ పెట్టి, ఏమేమో చెప్తున్నారు. అలా చేయడం వల్ల వేరేవారి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఏ విషయం అయినా నిజాలు మాత్రమే రాయండని అన్నారు. మా రాకేశ్ మాస్టర్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.
ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీతాదేవిగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం మొదటి నుండి విమర్శలకు గురి అవుతోంది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా హనుమంతుడితో మాస్ డైలాగుల చెప్పించడంతో పై ఈ చిత్రం పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఈ విషయం పై పలు చోట్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగగా, డైలాగ్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ పై కోర్టు మండిపడింది. చిత్ర యూనిట్ డైలాగ్స్ ను మర్చినప్పటికి, జరగాల్సిన నష్టం జరిగింది. ఈ డైలాగుల వల్ల మూవీ పై నెగెటివిటి పెరిగింది. ఈ విషయం పై ఆదిపురుష్ సినిమాలో నటించిన యాక్టర్ లావ్ పజ్నీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఈ మూవీలో కుంభకర్ణుడిగా నటించిన లావ్ పజ్నీ మాట్లాడుతూ దర్శకుడు ఏది చెప్తే ఒక నటుడు అది చేయాలి. వివాదాస్పద డైలాగ్స్ ను తొలగించినప్పటికీ, ఆ డైలాగ్స్ తనకు నచ్చలేదని, ఓ హిందువుగా ఆ డైలాగ్స్ ను విని తాను బాధపడ్డానని వెల్లడించాడు.

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18













జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఆయన దగ్గర చాలా ఏళ్ల నుండి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా మొయిన్ మాస్టర్ పనిచేస్తున్నారు. మొయిన్ పాపులర్ డాన్స్ షో అయిన ‘ఢీ’ లో పార్టీసిపెట్ చేశారు. ఆ షో ద్వారా పాపులర్ అయ్యారు.
ఆ తరువాత జానీ మాస్టర్ దగ్గర పని చేశారు. అలా ఎన్నో హిట్స్ సాంగ్స్ కి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా చేశారు. తనకు ఇంత పేరు రావడానికి కారణం అసిస్టెంట్ మొయిన్ మాస్టర్ అని ఒక సందర్భంలో జానీ మాస్టర్ అన్నారు. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో కొరియోగ్రఫర్ మారారు. ఆ తరువాత కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమాకి కొరియోగ్రఫి అందించారు.
మొయిన్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్‌లు అన్నిటికి జాని మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, మొయిన్ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా పని చేశారు. ఇటీవలే మొయిన్ మాస్టర్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో మొయిన్ మాస్టర్ ను 24.9 వేలమంది ఫాలో అవుతున్నారు.