యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇటీవల రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ చిత్రంకు ప్రభాస్ 150 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్.
నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ పై ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద నిర్మాతలు కూడా వెనకాడడం లేదు. కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలింస్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమాని నిర్మిస్తోంది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ K’ మూవీని రూపొందిస్తోంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, వాటి తో సంబంధం లేకుండా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారని టాక్. ప్రభాస్ తను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటలీలో లగ్జరీ విల్లాను ఇదివరకే కొనుగోలు చేశారట.
ప్రభాస్ సినిమాల షూటింగ్ కి గ్యాప్ వచ్చిన సమయంలో ఇటలీలోని విల్లాలో తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి సమయం గడుపుతున్నారట. ఇక ప్రభాస్ షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పుడు ఆ విల్లా ఖాళీగా ఉంటుంది. అందువల్ల దానిలో కొంత భాగాన్ని అద్దెకిస్తున్నారట. ఇటలీకి వచ్చే ట్రావెలర్స్, స్థానికంగా ఉండే వారికి విల్లాను అద్దెకు ఇస్తూ, నెలకు నలబై లక్షల వరకు సంపాదిస్తున్నాడు అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ తరువాత మరో పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవడానికి రెడీ అవుతోంది. ఇదే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు.
Also Read: ఆ రోజు జరిగిన గొడవలో అమ్మాయిదే తప్పు.. హీరో నాగ శౌర్య











నాగ శౌర్య మాట్లాడుతూ ‘‘ఆ రోజు పనిమీద వెళ్తుండగా, కూకట్‌పల్లిలో రోడ్డు పైన ఓ అమ్మాయిని కొడుతున్న అబ్బాయి కనిపించాడు. దాంతో వెంటనే వారి వద్దకు వెళ్లి, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు వెంటనే సారీ చెప్పమని అన్నాను. దానికి ఆ అమ్మాయి నా బాయ్‌ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు. మీకెందుకు అని అడిగింది. అమ్మాయి అలా మాట్లాడితే ఏం చేస్తాం.
కానీ నేను మాత్రం ఒకటే చెబుతున్నా, వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిలు, మిమ్మల్ని కొట్టేవాడిని పెళ్లి చేసుకోవద్దు. అది మీకు మరియు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఇక ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో నేను అబ్బాయిని కొట్టలేదు. మిస్టేక్ అబ్బాయిది కాదు. అమ్మాయిదే అని అన్నారు. మరో రూమర్ కూడా వచ్చింది. పబ్లిసిటీ కోసం అదంతా నేనే చేసినట్టు కొందరు చెప్పారు. అయితే వాళ్లిద్దరూ ఎవరో నాకు తెలియదని వెల్లడించారు.
నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘రంగబలి’ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పవన్ బాసమ్శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటుడు షైన్ టామ్ చాకో విలన్ గా నటించాడు. ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సప్తగిరి నటించిన ఈ సినిమా జులై 7న రిలీజ్ కానుంది.


ప్రముఖ నిర్మాత ఎస్ ఏ శ్రీనివాస్ కుమారుడు సూరజ్ కుమార్. 24ఏళ్ల సూరజ్, ధ్రువన్ గా కన్నడ ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. తారక్, ఐరావత లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా సూరజ్ పనిచేశారు. అతను హీరోగా చేసిన తొలి ఇనిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అయ్యింది. కానీ శనివారం మైసూరు-గుండ్లుపేట్ హైవేపై బైక్‌పై సూరజ్ కుమార్ వెళ్తుండగా, ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయడం కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే సూరజ్ ను మైసూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు బాగా నుజ్జునుజ్జవడంతో సూరజ్ ను కాపాడటం కోసం డాక్టర్లు ఆయన కుడికాలును తొలగించారని తెలుస్తోంది. 24 సంవత్సరాల సూరజ్ కుమార్, లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్‌కు దగ్గరి బంధువు. ఆయన భార్యకు సూరజ్ మేనల్లుడు.
యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, మరియు ఆయన భార్య మణిపాల్ హాస్పిటల్ కు చేరుకుని సూరజ్‌ను పరామర్శించారు. సూరజ్ హెల్త్ కండిషన్ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ధృవన్ ప్రస్తుతం హీరోగా ‘రథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ధృవన్ పక్కన హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.














పెదరాయుడు (భాగ్యరాజా) ఆయన భార్య పాపాయి, తమ నలుగురు పిల్లలతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటాడు. ఆ ఊరిలో పెదరాయుడు చెప్పిందే వేదం. ఫ్యామిలీ జోతిష్యుడు చెప్పినట్టుగానే జాతకం ప్రకారం పెదరాయుడు భార్య చనిపోతుంది. దాంతో పెదరాయుడే తన పిల్లల బాధ్యత తీసుకుంటాడు. పిల్లలు పెరిగి, సిటీలో స్థిరపడతారు. ఆస్తి కోసం కొడుకులు, కూతురు గొడవలు పడి, ఆ ఊరికి రావడం మానేస్తారు.
ఆ ఊరిలో పెదరాయుడి బాగోగులు ఈశ్వర్ (శింబు) చూసుకుంటూ ఉంటాడు. ఇక పెదరాయుడు కోరిక ప్రకారం అతడి పిల్లలను ఈశ్వర్ ఊరికి వచ్చేలా చేస్తాడు. వారి మధ్య ఉన్న గోడవలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే రత్నస్వామి పెదరాయుడు ఫ్యామిలీ పై పగపట్టి, కుటుంబం మొత్తాని హత్యమార్చాలని చూస్తుంటాడు. అలాంటి టైం లోనే జోతిష్యుడు పెదరాయుడు కుటుంబంలో ఒకరు మరణిస్తారని హెచ్చరిస్తాడు.
ఇక జోతిష్యుడు చెప్పినట్లుగా జరిగిందా? ఈశ్వర్ పెదరాయుడు ఫ్యామిలీని ఎందుకు కాపాడుతాడు? ఈశ్వర్ కి పెదరాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? ఈశ్వర్ ప్రేమించిన వాసుకి (నందితా శ్వేత) కి దూరమవడానికి కారణం ఏమిటి? ఈశ్వర్ లైఫ్ లోకి వచ్చిన పూజ (నిధి అగర్వాల్)ఎవరు అన్నదే మిగతా కథ.
ఈశ్వరుడు సినిమా రొటీన్ గా వచ్చే ఫ్యామిలీ కథ. రెగ్యులర్ కుటుంబ కథకు ఓ రివేంజ్ డ్రామా, బావమరదళ్ల లవ్ స్టోరిని కలిపి దర్శకుడు సుసీంద్రన్ ఈ మూవీని తెరకెక్కించాడు. మొదటి నుంచే సినిమా ఆర్టిపీషియల్గా సాగుతుంది. లవ్ ట్రాక్ కూడా కథలో బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది. శింబు ఈశ్వర్‌గా మాస్ పాత్రలో కొత్తగా కనిపించాడు. గ్రామీణ నేపథ్యంలో శింబు ఎక్కువగా చిత్రాలు చేయకపోవడంతో ఈశ్వర్ పాత్రలో ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ డైరెక్టర్ రొటీన్ టేకింగ్ వల్ల శింబు పడ్డ కష్టం వృథా అయ్యింది.
ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రామాయణం ఆధారంగా వచ్చాయి. కానీ ఆదిపురుష్ సినిమా పై వచ్చినన్ని విమర్శలు, వివాదాలు ఏ సినిమా పై రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో నుండే విమర్శల పాలవుతూ వస్తోంది. ఈమూవీలోని పాత్రల వేషధారణ, హనుమంతుడి డైలాగ్స్, ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు విమర్శించారు. కొన్ని సీన్స్ ను రామాయణానికి విరుద్ధంగా తీశారనే విమర్శలు కూడా వచ్చాయి.
దాంతో ఈ మూవీని నిలిపివేయాలని పలువురు కోర్టులో పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలని అలహాబాద్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు కాగా, దానిపై ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు సెన్సార్ బోర్డుని తప్పు బట్టింది. మూవీని సెన్సార్‌కు పంపించిన టైంలో ఇలాంటి సంభాషణలు ఎందుకు సమర్థించారని సెన్సార్ బోర్డుని ప్రశ్నించింది.
ఇటువంటి సంభాషణలతో భవిష్యతు తరాలకు ఎటువంటి సందేశాలను ఇవ్వాలనుకుంటున్నారని మండిపడింది. ఆదిపురుష్ దర్శకుడు, నిర్మాత విచారణకు కోర్టులో హాజరుకాకపోవడం పై అలహాబాద్ హైకోర్టు అసహనం తెలిపింది. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు రావడంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ని తొలగించింది.