“శింబు” హీరో… నేషనల్ అవార్డ్ డైరెక్టర్..! తెలుగులో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..?

“శింబు” హీరో… నేషనల్ అవార్డ్ డైరెక్టర్..! తెలుగులో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..?

by kavitha

Ads

తమిళ ఇండస్ట్రీలో హిట్ ప్లాప్ లకు అతీతంగా స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్న హీరో శింబు. నేషనల్ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ సుశీంద్రన్ శింబు హీరోగా తెరకెక్కించిన త‌మిళ సినిమా ఈశ్వ‌ర‌న్. ఈ చిత్రం తెలుగులో ఈశ్వ‌రుడు అనే టైటిల్ తో అనువాదం అయ్యింది.

Video Advertisement

ఈశ్వ‌రుడు సినిమా ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోయిన్లు నిధి అగ‌ర్వాల్‌, నందితా శ్వేత నటించారు. రీసెంట్ గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హీరో శింబు నటించిన ఈశ్వ‌రుడు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..Eeswarudu-Movie-1పెద‌రాయుడు (భాగ్య‌రాజా) ఆయన భార్య పాపాయి, తమ న‌లుగురు పిల్ల‌ల‌తో కలిసి జీవితాన్ని సంతోషంగా గ‌డుపుతుంటాడు. ఆ ఊరిలో పెద‌రాయుడు చెప్పిందే వేదం. ఫ్యామిలీ జోతిష్యుడు చెప్పినట్టుగానే జాత‌కం ప్ర‌కారం పెద‌రాయుడు భార్య చ‌నిపోతుంది. దాంతో పెద‌రాయుడే తన పిల్ల‌ల‌ బాధ్యత తీసుకుంటాడు. పిల్లలు పెరిగి, సిటీలో స్థిరపడతారు. ఆస్తి కోసం కొడుకులు, కూతురు గొడవలు పడి, ఆ ఊరికి రావ‌డం మానేస్తారు.
ఆ ఊరిలో పెద‌రాయుడి బాగోగులు ఈశ్వ‌ర్ (శింబు) చూసుకుంటూ ఉంటాడు. ఇక పెద‌రాయుడు కోరిక ప్రకారం అత‌డి పిల్లలను ఈశ్వ‌ర్ ఊరికి వచ్చేలా చేస్తాడు. వారి మ‌ధ్య ఉన్న గోడవలను తీర్చడానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అయితే ర‌త్న‌స్వామి పెద‌రాయుడు ఫ్యామిలీ పై ప‌గ‌ప‌ట్టి, కుటుంబం మొత్తాని హత్యమార్చాలని చూస్తుంటాడు. అలాంటి టైం లోనే జోతిష్యుడు పెద‌రాయుడు కుటుంబంలో ఒకరు మరణిస్తారని హెచ్చ‌రిస్తాడు. ఇక జోతిష్యుడు చెప్పిన‌ట్లుగా జ‌రిగిందా? ఈశ్వ‌ర్ పెద‌రాయుడు ఫ్యామిలీని ఎందుకు కాపాడుతాడు? ఈశ్వ‌ర్ కి పెద‌రాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? ఈశ్వ‌ర్ ప్రేమించిన వాసుకి (నందితా శ్వేత‌) కి దూర‌మ‌వడానికి కారణం ఏమిటి? ఈశ్వ‌ర్ లైఫ్ లోకి వచ్చిన పూజ (నిధి అగ‌ర్వాల్‌)ఎవ‌రు అన్నదే మిగతా కథ. ఈశ్వ‌రుడు సినిమా రొటీన్ గా వచ్చే ఫ్యామిలీ క‌థ. రెగ్యుల‌ర్ కుటుంబ కథకు ఓ రివేంజ్ డ్రామా, బావమ‌ర‌ద‌ళ్ల లవ్ స్టోరిని కలిపి ద‌ర్శ‌కుడు సుసీంద్ర‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. మొదటి నుంచే సినిమా ఆర్టిపీషియ‌ల్‌గా సాగుతుంది. ల‌వ్ ట్రాక్ కూడా క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన భావన కలుగుతుంది. శింబు ఈశ్వ‌ర్‌గా మాస్ పాత్రలో కొత్త‌గా క‌నిపించాడు. గ్రామీణ నేపథ్యంలో శింబు ఎక్కువగా చిత్రాలు చేయ‌కపోవడంతో ఈశ్వ‌ర్‌ పాత్రలో ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీలింగ్ కలుగుతుంది. కానీ డైరెక్టర్ రొటీన్ టేకింగ్‌ వ‌ల్ల శింబు పడ్డ క‌ష్టం వృథా అయ్యింది.

Also Read: బిడ్డ పుట్టాక “ఉపాసన” అంత తొందరగా డిశ్చార్జ్ ఎలా అయ్యారు..? అందుకు ఆమె పాటించిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..?

 


End of Article

You may also like