టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు తారక్. భారీ బడ్జెట్‌తో తీసే..
ఎన్టీఆర్ సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో.. ఆయన పర్సనల్ లైఫ్ అంతకు మించి లగ్జరీగా ఉంటుంది.. కార్ల కలెక్షన్, పర్సనల్ జెట్, రూ.కోట్లు విలువ చేసే వాచ్.. ఇలా ఆయన వద్ద ఉన్న.. కొన్ని ఖరీదైన వస్తువులు ఏవో చూద్దాం..

#1 బంగ్లా – 60 కోట్లు
జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ నివసిస్తున్న ఇంటి విలువ సుమారు 60 కోట్లు. సకల సౌకర్యాలతో విలాసవంతంగా ఆ ఇంటిని నిర్మించుకున్నారు తారక్.

#2 లంబోర్ఘిని ఉర్స్ గ్రాఫైట్ క్యాప్సూల్ – మూడున్నర కోట్లు
ఎన్టీఆర్ దగ్గరున్న కార్లలో అత్యంత విలువైనది లంబోర్ఘిని ఉర్స్ కార్. బులెట్ ప్రూఫ్ అయినా ఈ కార్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

#3 రిచర్డ్ మిల్లే ఎఫ్-1 లిమిటెడ్ ఎడిషన్
ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లలో ఒకటైన ‘రిచర్డ్ మిల్లే ఎఫ్-1 లిమిటెడ్ ఎడిషన్’ ఎన్టీఆర్ దగ్గర ఉంది. దీని ధర అక్షరాల రూ. 4కోట్లు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ వాచ్ పెట్టుకొని కనిపించారు.

#4 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
లగ్జరీ కారు అయిన ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ‘ జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజీలో ఉంటుంది. ఎస్యూవీ శ్రేణికి చెందిన ఈ వాహనం ధర రూ. 2.26 కోట్లు.

#5 బి ఎం డబ్ల్యు 720 ఎల్డి
ఎన్టీఆర్ వద్ద 1 .32 కోట్ల విలువైన బి ఎం డబ్ల్యు 720 ఎల్డి కార్ ఉంది.

#6 పోర్ష్ 718 కేమన్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ‘పోర్ష్ 718 కేమన్’ వాహనం తారక్ వద్ద ఉంది. దీని ఖరీదు రూ.1.22కోట్లు.

#7 మెర్సిడేస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ
జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజీలో ‘మెర్సిడేస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ’ వాహనం కూడా ఉంది. దీని ధర రూ.88.18లక్షలు.

#8 ప్రైవేట్ జెట్
ఎన్టీఆర్ దగ్గర ఉన్నవాటిలో అత్యంత ఖరీదైనది ప్రైవేట్ జెట్. ఈ జెట్‌ను రూ.80కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్. దీన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్క్ చేస్తున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు ఈ జెట్‌లో ఫ్యామిలీ టూర్స్‌కు కూడా వెళ్తుంటారు జూనియర్.

#9 హాయాబూసా
సుజుకీ.. తీసుకొచ్చిన సూపర్ మోటర్ సైకిల్ మోడల్ ‘హాయాబూసా’. 1340 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైక్ జూనియర్ ఎన్టీఆర్ వద్ద ఉంది. దీని ధర రూ.16లక్షలు.







సినిమాల ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుంది.పెళ్లి అయిన నెలకే సరోగసి ద్వారా తల్లి అయ్యి వార్తల్లో నిలిచింది. నయన్ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లు, విలాసవంతమైన కార్లు మరియు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి.
నయనతారకు ఉన్న 8 ఖరీదైన వస్తువుల జాబితా ఏంటో చూద్దాం..
2. విలువైన ఆస్తులు
3.కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’
4. ప్రైవేట్ జెట్
5. మెర్సిడెస్ GLS 350D
6.BMW 7-సిరీస్ ధర రూ. 1.76 కోట్లు
7.టయోటా ఇన్నోవా క్రిస్టా విలువ రూ. 30 లక్షలు
8. రూ. 74.50 లక్షల విలువైన BMW 5 సిరీస్
















మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.
1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read:
మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్‌తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి 110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి గేమ్ షోలు ఇండియాలో ఎక్కువగానే ప్రసారం అవుతున్నాయి. అనేక టీవి ఛానెల్స్ ఇలాంటి గేమ్ షోలను ప్రారంభించాయి. ఈ షోలలో పాల్గొని, గెలవడం ద్వారా డబ్బును గెలుచుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభించిన “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అదే షోని తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో 2014 నుంచి మాటీవీలో ప్రారంభం అయ్యింది. తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అయ్యింది.
తొలి 3 సీజన్లకి నాగార్జున హోస్ట్, 4వ సీజన్‌కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. 5 వ సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించారు. అయితే ఐదో సీజన్ జెమిని టీవిలో ప్రసారం అయ్యింది. ఈ షో పేరును “ఎవరు మీలో కోటీశ్వరులు” గా మార్చారు. ఈ షోలలో ఇప్పటివరకు చాలా మంది ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఈ షోలలో మనీని గెలుచుకున్న పోటీదారులకు మనీని నిజంగానే ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ మనీని ఎవరు ఇస్తారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. షోలో గెలిచినవారికి వారికి ఆ షో నిర్మాత డబ్బును ఇస్తారు.
సినిమాలకు ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తారో అలాగే షోను హోస్ట్ చేసిన వ్యక్తికి, అలాగే గెలిచిన కంటెస్టెంట్ కి కూడా నిర్మాతనే డబ్బును ఇస్తారు. ఈ షో మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా నిర్మాతలకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ షో రాత్రి పూట మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఏ భాషలో అయినా సరే ఈ షో రాత్రి పూట వస్తుంది. అందుకు కారణం ఏంటంటే ఆ సమయంలో టిఆర్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో టిఆర్పి ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.