సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చిన్న విషయం కాదు. చాలా సంవత్సరాల కష్టం తర్వాత వారికి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది నటులు అంతకుముందు పేరు లేని పాత్రలు చేశారు. అసలు వాళ్లు ఆ సినిమాలో ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అలాంటి పాత్రలు వాళ్ళు పోషించారు. కొంతమంది నటులు అంతకుముందు యాంకర్లుగా చేశారు. కొంతమంది నటులు అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. ఇలా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించిన అవకాశాలు వస్తాయి. కానీ కొంతమంది నటులు అయితే అడ్వర్టైజ్మెంట్స్ లోనే సైడ్ పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో వాళ్ళని చూడాలి అంటే మనం వెతుక్కోవాలి. ఎందుకంటే వాళ్లు ఆ అడ్వర్టైజ్మెంట్ లో లీడ్ హీరో, లేదా లీడ్ హీరోయిన్ కాదు.

ఇలా పైన ఉన్న వ్యక్తి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లో సైడ్ పాత్రలో నటించారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. హీరో అవ్వకముందు ముందు యాంకరింగ్ తో పాటు, సైడ్ పాత్రల్లో కూడా సినిమాల్లో నటించారు. శివకార్తికేయన్. తెలుగువారికి బాగా సుపరిచితులు. శివకార్తికేయన్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. రెమో సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత నుండి శివకార్తికేయన్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు శివ కార్తికేయన్ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రొడ్యూసర్ కూడా అయ్యారు.
కానీ ఇంత గుర్తింపు రావడానికి ముందు చాలా కష్టపడ్డారు. ఒక డాన్స్ షో కి యాంకర్ గా చేశారు. ఇప్పుడు పైన ఉన్న ఫోటో శివకార్తికేయన్ వివెల్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ లో త్రిష కూడా నటించారు. కానీ త్రిష అప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయారు. కానీ శివకార్తికేయన్ మాత్రం అప్పటికి ఎవరికీ తెలియదు. ఈ యాడ్ లో శివ కార్తికేయన్ ఒక సైడ్ పాత్రలో నటించారు. అది కూడా ఒక కామెడీ పాత్రలో నటించారు. ఆ తర్వాత నుండి కష్టపడుతూ ఇప్పుడు హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.
watch video :










డాన్సర్ విఘ్నేష్ రాజేంద్రన్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. అతను తెలుగులో అనేక పాటలలో సైడ్ డాన్సర్ గా చేశాడు. అలా విఘ్నేష్ టాలీవుడ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని , విజయ్ దేవరకొండ వంటి వారితో పని చేశాడు.
అయితే అతను తమిళ ఇండస్ట్రీకి చెందిన డాన్సర్. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకి డాన్సర్ గా చేస్తాడు. విఘ్నేష్ రాజేంద్రన్ కోలీవుడ్ కొరియోగ్రాఫర్ దినేష్ టీమ్ మెంబర్. దినేష్ మాస్టర్ దళపతి విజయ్, అజిత్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో ఆయన టీమ్ మెంబర్ గా ఉన్న విఘ్నేష్ ఆ హీరోల సాంగ్స్ లో గ్రూప్ డాన్సర్ గా పనిచేశాడు.
విఘ్నేష్ కొరియోగ్రాఫర్ నేర్పించే డ్యాన్స్ స్టెప్పులను తేలికగా నేర్చుకుంటాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో విఘ్నేష్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతని ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపు 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా అతనికో ఫ్యాన్ పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ కి 1536 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం అతను డాన్సర్ గా కొనసాగుతూనే, యాక్టర్ గా కూడా మారినట్టు తెలుస్తోంది.
