మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు అని ఈ టైటిల్ టీజర్ చూస్తే అర్ధం అవుతోంది.
ఈ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇవాళ మొదలు అవ్వాల్సి ఉంది. సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఎన్నో కారణాల వల్ల మధ్యలో బ్రేక్ తీసుకొని షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు.

ఇవాళ కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది. కానీ ఆ షెడ్యూల్ ఆగిపోయింది. అందుకు కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషించే కొంత మంది నటులు ఈ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ నటుల డేట్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సినిమా షెడ్యూల్ ఆగిపోయింది అని అంటున్నారు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఆ షెడ్యూల్ మొదలవుతుంది.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది అని సినిమా బృందం ఇప్పటికే ప్రకటించింది.

ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కుటుంబ కథాచిత్రంగా నిలిచే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి అని అంటున్నారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటినటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఇంక మహేష్ బాబు విషయానికి వస్తే, మహేష్ బాబు ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి సినిమా పనిలో పాల్గొంటారు. అదే కాకుండా మహేష్ బాబు రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో ఉన్నారు. అంతే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాకి అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో మరొక సినిమా చేస్తారు అని అంటున్నారు.











పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం అసలు. ఈ చిత్రానికి సురేష్, ఉదయ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని డైరెక్ట్‌గా ఈటీవీ వారి విన్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. రవిబాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూనే ఈ మూవీని నిర్మించారు.
కామెడీ, క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబుకు మంచి పేరుంది. అనసూయ, అవును లాంటి చిత్రాలతో విజయం సాధించారు. చాలా గ్యాప్ తరువాత ‘అసలు’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సీన్ లో డాక్టర్ ఒక పేషంట్ బ్రెయిన్ లో స్టోర్ అయిన ఇమేజ్ లు అంటూ హీరోయిన్ పూర్ణకు చూపిస్తుంది. ఆ పేషంట్ కాన్షియస్ గా చివరిసారి చూసిన విజువల్స్ అని చెప్తుంది. వాటి ద్వారా ఆమె షాక్ లోకి ఎందుకు వెళ్లిందో తెలుస్తుందని చెప్తుంది. పూర్ణ వాటిని చూసి ఆ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడుతుంది. ఇక ఈ సీన్ చూసినవారు బ్రెయిన్ ఇలా కూడా పనిచేస్తుందా అంటూ ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారు.


జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, తన ప్రతిభతో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో అనేక హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన హీరోగా నటించిన ‘బృందావనం’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఎన్టీఆర్ అప్పటి దాకా మాస్ చిత్రాలను మాత్రమే చేస్తూ మాస్ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
మాస్ హీరోగా అయిన ఎన్టీఆర్ ను కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన చిత్రం బృందావనం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ మూవీ 2010లో అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో చేసిన ఒక మిస్టేక్ పై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక సన్నివేశంలో పడుకున్న ఎన్టీఆర్ ను నటి ప్రగతి నిద్రలేపుతుంది. అయితే ఆ సీన్ లో బెడ్ పక్కనే ఉన్న పెద్ద అద్దంలో కెమెరామెన్, పక్కనే ఉన్న మరో ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ సీన్ చూసినవారు డైరెక్టర్ గారు దీనిని ఎలా మిస్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్ విడుదల కోసం అభిమనులతో పాటుగా దేశవ్యాప్తంగా అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినపుడే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ పోస్టర్, టీజర్ రిలీజ్ అయ్యాక, తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దాంతో మేకర్స్ గ్రాఫిక్స్ విషయంలో మరింత వర్క్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో మూవీ పై అంచనాలు పెరిగాయి.
పోస్టర్ రీలజ్ తో మొదలయిన వివాదాలు ఇప్పటి వరకు కొనగుతూనే ఉన్నాయి. కొందరు రాముడికి మీసాలు పెట్టడం పై విమర్శిస్తే, కొందరు రావణుడు లుక్ పై విమర్శించారు. ఇటీవల ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక, రాముడికి ఆనవాలు కోసం హనుమాన్ కి సీతాదేవి చూడామణికి బదులుగా గాజులు ఇవ్వడం, రావణుడు సీతను ఎత్తుకెళ్ళే విధానం పై ఇలా చాలా విషయాలు వివాదస్పదంగా మారాయి. వీటన్నిటి మధ్య జూన్ 16న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే ఈమధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో రూపొందించిన ఫోటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏఐ రూపొందించిన ఆదిపురుష్ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసినవారు మూవీ కన్నా ఇవే బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు చూడండి.
2.
3.
5.
6.
7.
8.
9.
విరూపాక్ష సినిమా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యాక్సిడెంట్ వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. గోల్డెన్ బ్యూటీగా పాపులర్ అయిన సంయుక్తమీనన్ ఈ మూవీతో మరోసారి ప్రశంసలు అందుకుంది.
ఈ క్రమంలోనే దర్శకుడు కార్తిక్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించడానికి కారణం వివరించారు. తనకు చిన్నప్పటి నుండి హారర్ చిత్రాలు అంటే ఎక్కువ ఆసక్తి ఉండేదని చెప్పారు. 2016-17 సంవత్సరంలో వార్తా పత్రికలో వచ్చిన ఒక క్రైమ్ న్యూస్ చదివిన తరువాత ఈ మూవీని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఉత్తరాదిలో ఒక పల్లెటూరులో ఒక మహిళ ఆమె భర్త మరణించడంతో ఊరి చివరలో నివస్తుండేది. అదే టైంలో ఊర్లోని ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. దాంతో గ్రామంలోని వారంతా ఆ మహిళను సందేహించి, క్రూరంగా చంపేశారు.
ఈ న్యూస్ చదివిన అనంతరం విరూపాక్ష కథ రాయాలనిపించింది. తాను రాసిన స్టోరీలో పార్వతి పాత్ర చేసిన శ్యామల విలన్. ఆమె తల్లిదండ్రులు మరణించిన తరువాత ఆ ఊరు నుండి వెళ్ళిపోయి, తిరిగి అదే ఊరుకి కోడలిగా వచ్చి ఆ గ్రామం పై పగ తీర్చుకుంటుంది. అయితే సుకుమార్ సర్, కథను మార్చి హీరోయిన్ సంయుక్త మీనన్ ను విలన్ చేశారు. దానికి తగ్గట్టు మార్పులు చేయాడం కోసం 7 నెలలు పట్టింది అని చెప్పారు.