యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
టాలీవుడ్ లో ప్రాణం పెట్టి నటించే హీరోలలో ఎన్టీఆర్ మొదటి వరసలో ఉంటారు. మే 20 తారక్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన గురించిన వార్తలు, ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను హీరోగా సక్సెస్ అవకపోతే ఏం చేసేవారో చెప్పారు. తారక్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే చిత్రం 2024 మార్చి నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ విషయం పై మేకర్స్ నుండి అధికారి ప్రకటన వచ్చింది. తారక్ పాన్ ఇండియా చిత్రాలలో పాన్ ఇండియా దర్శకుల చిత్రాలలో నటిస్తున్నారు.
తారక్ బాలీవుడ్ వార్2 చిత్రంలో నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజున బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబో నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియెన్స్ తో పాటుగా యూత్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకెళ్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలలో హీరోగా విజయం సాధించలేకపోతే ఏదోక చిన్న పని అయిన లేదా లైట్ బాయ్ గా నైనా పనిచేస్తూ ఇండస్ట్రీలోనే ఉండేవాడినని వెల్లడించారు. ఈ మాటలు విని ఆడియెన్స్, ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: “చిరంజీవి – త్రిష” లాగానే… తెరపై అస్సలు “సూట్ అవ్వని” 15 హీరో-హీరోయిన్ల కాంబినేషన్స్..!



















































జెమినీ మ్యూజిక్ ‘ఆదిత్య టీవీ’ గా మొదలు అయినప్పటి నుండి ఆ ఛానెల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే ‘వెన్నెల’ షోకి జయతి సుమారు 10 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది. కాలర్స్‌తో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె మాటల కోసమే వెన్నెల ప్రోగ్రామ్ చూసేవారంటే ఆ రోజుల్లోనే ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పనవసరం లేదు.
ఆ తరువాత తొలిసారి హీరోయిన్గా ‘లచ్చి’ అనే చిత్రంలో నటించింది. దీనికి నిర్మాత కూడా జయతినే. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత జయతి రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆడియెన్స్ ని పలకరించింది. ఈ పాటలో జయతి తన హావ భావాలతో, మూమెంట్స్‌లో ఆకట్టుకుంది.
జయతి విజన్స్ సమర్పణలో వచ్చిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాస్లర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ను శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో జయతి కనిపించారు. ఆమె ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆమె ఇన్నేళ్లకు కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

