యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అటు ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మొన్నటివరకు ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలిచిన ఈ సినిమాకి ‘దేవర’ అనే పేరును ఖరారు చేసినట్లుగా కొద్ది రోజుల నుండి వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘దేవర’ టైటిల్ వెనుక ఉన్న కథ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫిషియల్ గా ‘దేవర’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. టైటిల్ చాలా బాగుందని, తారక్ కి సెట్ అవుతుందని ఆనందపడుతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుందంట. ఆ పాత్ర తండ్రి పేరే దేవర ( ఎన్టీఆర్) అని తెలుస్తోంది.
ఇక సినిమా కథ మొత్తం దేవర పాత్ర చుట్టూ తిరుగుతుందని, మూవీలో ఎక్కువ భాగం దేవరనే ఉంటాడంట. అయితే ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ తండ్రి దేవర పక్కన హీరోయిన్ గా నటిస్తుందా? లేదా యంగ్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలీదు. జాహ్నవి కపూర్ ఒకవేళ యంగ్ ఎన్టీఆర్ కి జంటగా చేస్తే, సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ టైం ఉంటే మూవీకి మైనస్ ఏమైనా అవుతుందా అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ రోల్ ఈ మూవీలో డబల్ అయితే జాన్వీ కపూర్ ఏ పాత్రకి హీరోయిన్ గా చేస్తుందనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృత పడుతున్నారు.
ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర పాత్రను అద్భుతంగా షూట్ చేస్తున్నాడట. సముద్రం ఒడ్డున జీవించేవారికి అండగా ఉండి, ధైర్యాన్ని ఇచ్చే పాత్ర దేవర అని టాక్. పోస్టర్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫోజు ఇంటర్వెల్ బ్యాంగ్ అని అంటున్నారు. ఇక ఈ మూవీలో మొదట్లో యంగ్ ఎన్టీఆర్ కనిస్తారని, ఆ తర్వాత తండ్రి ‘దేవర’ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడట. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలలో విలన్స్ సముద్రం తీరాన ఉన్న పేదవారిని హింసిస్తుంటారట.
ఆ సమయంలో దేవర పాత్ర ఎంట్రీ ఇచ్చి, అందరిని తరిమి తరిమి చంపుతాడంట. అలా చంపే క్రమంలో దేవర పై రక్తం పడుతుందని, రక్తంతో అలాగే నిలబడి ఉన్న స్టిల్ తోనే విరామం వస్తుందని నెటిజనులు ఎవరికి నచ్చిన కథను వాళ్ళు చెప్తున్నారు. ఈ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.













తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే చిత్రం 2024 మార్చి నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ విషయం పై మేకర్స్ నుండి అధికారి ప్రకటన వచ్చింది. తారక్ పాన్ ఇండియా చిత్రాలలో పాన్ ఇండియా దర్శకుల చిత్రాలలో నటిస్తున్నారు.
తారక్ బాలీవుడ్ వార్2 చిత్రంలో నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజున బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబో నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియెన్స్ తో పాటుగా యూత్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకెళ్తున్నారు. 

















































జెమినీ మ్యూజిక్ ‘ఆదిత్య టీవీ’ గా మొదలు అయినప్పటి నుండి ఆ ఛానెల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే ‘వెన్నెల’ షోకి జయతి సుమారు 10 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది. కాలర్స్‌తో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె మాటల కోసమే వెన్నెల ప్రోగ్రామ్ చూసేవారంటే ఆ రోజుల్లోనే ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పనవసరం లేదు.
ఆ తరువాత తొలిసారి హీరోయిన్గా ‘లచ్చి’ అనే చిత్రంలో నటించింది. దీనికి నిర్మాత కూడా జయతినే. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత జయతి రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆడియెన్స్ ని పలకరించింది. ఈ పాటలో జయతి తన హావ భావాలతో, మూమెంట్స్‌లో ఆకట్టుకుంది.
జయతి విజన్స్ సమర్పణలో వచ్చిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాస్లర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ను శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో జయతి కనిపించారు. ఆమె ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆమె ఇన్నేళ్లకు కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.