సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయనని ప్రేమగా తలైవా అని కూడా పిలుస్తారు. రజనీకాంత్ సినిమా విడుదల అవుతోంది అంటే భారతదేశ అంతా కూడా ఎదురుచూస్తుంది. ఇప్పుడు అంటే పాన్ ఇండియన్ సినిమా అని ఒక పదం వచ్చింది కానీ అప్పట్లో రజినీకాంత్ సినిమా వచ్చింది అంటే హిందీలో కూడా విడుదల చేసేవారు. హిందీ ఏంటి, రజనీకాంత్ కి ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు చూడడానికి వారి వారి దేశాల నుండి తమిళనాడు కి వెళ్లేవారు. ఇప్పుడు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలని విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం రజినీకాంత్ జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.

ఇప్పుడు రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ భాగం ఇటీవల పూర్తి అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సినిమా కాదు. ఇది ఒక స్టాండ్ అలోన్ సినిమా. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర ఎలా ఉండబోతోంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలం నుండి రజినీకాంత్ తన వయసుకి తగ్గ పాత్రలు మాత్రమే చేస్తున్నారు. జైలర్ సినిమాలో ఒక తండ్రిగా, తాతగా నటించారు. అంతకుముందు వచ్చిన దర్బార్ సినిమాలో కూడా తండ్రి పాత్ర పోషించారు.
ఇప్పుడు ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర ఎలా ఉండబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు అనే వార్త వస్తోంది. ఈ విషయం మీద రెండు రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి ఏమో, “ఈ సినిమాలో రజనీకాంత్ పక్కన శృతి హాసన్ నటిస్తారు” అని కొంత మంది అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం, “అసలు రజినీకాంత్ పక్కన ఈ సినిమాలో హీరోయిన్ లేరు. శృతి హాసన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు” అని అంటున్నారు. ఈ రెండు వార్తల్లో ఏ వార్త ఎక్కువ నిజం అంటే రెండవ వార్త.
ఈ సినిమాలో రజనీకాంత్ పక్కన హీరోయిన్ లేరు అనే వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది. హీరోయిన్ లేకుండా ఒక స్టార్ హీరో సినిమా రావడం ఇటీవల కాలంలో జరుగుతోంది. విక్రమ్ సినిమాలో కూడా కమల్ హాసన్ పక్కన హీరోయిన్ లేరు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా రజనీకాంత్ పక్కన హీరోయిన్ ఉండరు అని అంటున్నారు. కానీ శృతి హాసన్ పాత్ర మాత్రం సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.

















ఇక ఈ సినిమా స్టోరి ఏమిటంటే కాశీపురం అనే ఊరిలో మామన్నన్ (వడివేలు) ఎమ్మెల్యేగా కొనసాగుతుంటాడు. మామన్నన్ కుమారుడు అయిన ఆదివీరన్ (ఉదయనిధి స్టాలిన్) అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. పేద విద్యార్థుల కోసం లీల (కీర్తి సురేష్) ఉచిత కోచింగ్ సెంటర్ ను నడుపుతూ ఉంటుంది. రూలింగ్ పార్టీ లీడర్ రత్నవేలు (ఫహద్ ఫాజిల్) వల్ల లీలకు సమస్యలు ఏర్పడతాయి. ఆ సమయంలో లీలకు అండగా ఆదివీరన్, మామన్నన్ లు ఉంటారు. వాళ్ళిద్దరు రత్నవేల్ ని ఎలా అడ్డుకున్నారు అనేది మిగతా కథ.
దర్శకుడు మారి సెల్వరాజ్ చిత్రాలన్ని దాదాపు పేద ధనిక అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతాయి. మామన్నన్ సినిమా కూడా అలాంటి స్టోరీతోనే వచ్చింది. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు. ప్రధమార్ధంలో క్యారెక్టర్ల పరిచయం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.
ఇక ద్వితీయార్ధం రొటీన్ ఫీల్ ను కలగచేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ద్వితీయార్ధం ఇంకొంచెం బెటర్ గా తీసి ఉంటే మూవీ ఫలితం మరో రేంజ్ లో ఉండేది. రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. ఫహద్ ఫాజిల్, వడివేలు నటన ఆకట్టుకుంటుంది. తెలుగులో నాయకుడు పేరుతో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. అందులో చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని పొగుడుతున్నారు.


