ప్రస్తుత కాలం లో వరుసగా రెండు హిట్స్ కొట్టడం కూడా కొంత మంది హీరోలకు గగనంగా మారింది. ఇండస్ట్రీ లో కొనసాగాలి అంటే బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ ను కొనసాగించడం ముఖ్యమనే సంగతి తెలిసిందే.అయితే వరుసగా బ్లాక్ బస్టర్లు రావాలంటే కాలం కూడా కలిసిరావాలి.
అయితే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏకంగా ఆరు సినిమాలు హిట్ అవడం అంటే మామూలు విషయం కాదు. కథ ఎంపిక దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్నీ ప్రతీ సారి పర్ఫెక్ట్గా సెట్ అయితేనే ఇలాంటి ఫీట్స్ సాధ్యమవుతాయి. అలా ఈ జనరేషన్ లో డబల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోలు ముగ్గురున్నారు.. వారు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, నాని, అడివి శేష్. ఈ అరుదైన రికార్డ్ ఈ ముగ్గురు హీరోలకే సొంతమైంది.

నిన్ను చూడాలని చిత్రం తో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన ఎన్టీఆర్, స్టూడెంట్ నెంబర్ వన్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి `దమ్ము` నుంచి `రభస` వరకు వరుస ఫ్లాపుల్ని చూశారు. తర్వాత ‘టెంపర్’ తో కం బ్యాక్ ఇచ్చాడు తారక్. అప్పటి నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు తారక్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 30 వ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు.

ఎన్టీఆర్ తరువాత నేచురల్ స్టార్ నాని వరుసగా ఆరు విజయాల్ని దక్కించుకున్నారు. పైసా నుంచి జెండాపై కపిరాజు వరుకు వరుస ఫ్లాపుల్ని చూసిన నాని ఆ తరువాత `ఎవడే సుబ్రమణ్యం` నుంచి హిట్ బాట పట్టాడు. ఆ తరువాత కామెడీ మూవీ భలే భలే మొగాడివోయ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణగాడి వీర ప్రేమగాథ, సస్పెన్స్ థ్రిల్లర్ జెంటిల్మెన్ సినిమాలతోనూ వరుస విజయాలు అందుకున్నారు నాని. ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్ కావటంతో నటుడిగానూ నాని రేంజ్ మారిపోయింది. అలా నిన్ను కోరి వరకు ఆరు హిట్స్ అందుకున్నాడు నాని.

అలాగే లేటెస్ట్గా హిట్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అడివి శేష్ కూడా వరుస సూపర్ హిట్స్‌తో కమర్షియల్ స్పేస్‌లోనూ సత్తాచాటుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురుకావటంతో తన కోసం తానే ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే క్షణం. అప్పటి నుంచి వచ్చిన అమీ తుమీ, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 లతో హ్యాట్రిక్ హీరోల సరసన చేరిపోయారు శేష్.




















































































యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్‌తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్‌కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని, సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు. ఇదివరకే దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్ ని ఎవెంజర్స్ మాదిరిగా చేస్తామని స్పష్టం చేశాడు. అంటే ఎవెంజర్స్ మూవీస్ లో ఒకేదానిలో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఉంటారో, అలాగే హిట్ రాబోయే సిరీసుల్లో కూడా ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ మూవీ అనవచ్చు.
ఇక హిట్-3లో నాచురల్ స్టార్ నానినే హీరో అనే విషయం తెలిసిందే. హిట్-2 సినిమా క్లైమాక్స్ లో ఆ విషయాన్ని చూపించారు. హీరో నానిని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇంట్రడ్యూస్ చేసారు. దీని ప్రకారం హిట్-3లో నానినే హీరో. అయితే తాజాగా శైలేష్ కొలను పెట్టిన పోస్ట్ తో నానితో పాటు అడివి శేష్, విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది.
ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.