సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త సినీ, రాజకీయ ప్రముఖులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వారి అల్లూరి సీతా రామ రాజు అయిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల వల్ల తుదిశ్వాస విడిచారు. ఎందరికో సాధ్యం కానీ ఎన్నో రికార్డులను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
దాదాపు 340కి పైగా చిత్రాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. పైగా ఓ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా నిలిచారు కృష్ణ. ఇదిలా ఉండగా కృష్ణ కి అప్పట్లో ఏకంగా 2500 అభిమానులు సంఘాలు ఉండేవి.

అయితే దానిలో ఒక దానికి మెగా స్టార్ చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గతం లో చిరంజీవి కూడా ఈ విషయాన్ని చెప్పారు. చిరు కృష్ణ గారి సూర్తి తోనే సినిమాల్లోకి వచ్చారట. పైగా కృష్ణ ఫ్యాన్స్ క్లబ్స్ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడు, కర్ణాటకలోనూ ఉండేవట. నిజంగా ఎంత గొప్ప విషయంలో కదా..? తోడు దొంగలు అనే సినిమా కూడా చేసారు కృష్ణ.

1981లో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకి ముందు ‘పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్’ పేరు మీద ఓ కర పత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి పేరు ఆ ఫ్యాన్స్ యూనిట్ కి ఉండడం విశేషం. ఆ కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. ఇందులో హానరబుల్ ప్రెసిడెంట్ అని చిరంజీవి పేరు ఉంది. అయితే ఇది ఒక్కసారి గమనిస్తే సినీ నటుడు చిరంజీవి అని ఉంది. అంటే చిరంజీవి అప్పటికీ సినిమాల్లో ఉన్నారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చిరంజీవి కృష్ణ అభిమానుల సంఘానికి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఇది చూసిన వాళ్ళు అందరూ కూడా చిరంజీవి కృష్ణ అంటే ఇంత అభిమానం అని అనుకోలేదు అని అంటున్నారు. ఇది కృష్ణ హీరోగా నటించిన తోడుదొంగలు అనే సినిమాకి ముందు విడుదల చేశారు. అలాగే సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చిరంజీవి కుటుంబానికి, కృష్ణ గారి కుటుంబానికి చాలా మంచి స్నేహం ఉంది.















హీరో నాని హిట్ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడారు. నాని ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హిట్ 2 జర్నీలో మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘వాల్ పోస్టర్ సినిమా మొదలు పెట్టి, కొత్త ఐడియాలతో న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకున్నాను. రొటీన్ సినిమాలు చేయకూడదనే ఈ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ని ప్రారంభించాను. డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేస్తే ఎవరు చూడరు. అసలు ఇది వర్కవుట్ అవుతుందా? అని చాలా మంది నన్ను భయపెట్టారు.
అయితే తెలుగు ఆడియెన్స్ డిఫరెంట్ మూవీస్ చూస్తారనే ధైర్యం, నమ్మకం ఉంది. ఇప్పడది ఇంకోసారి హిట్ 2 తో రుజువైంది’ అన్నారు. హీరో నాని సమర్పకుడిగా, ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా మరి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను మొదలు పెట్టారు. ఈ బ్యానర్లో తీసిన మొదటి సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మారారు. ఆ తరువాత శైలేష్ కొలనుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ హిట్ యూనివర్స్ మొదలుపెట్టారు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్, రాజమౌళి సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జక్కన్న మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో సాగుతుందని టాక్. రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ మూవీ ఉంటుందని చెప్పారు.
తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న నటుడు. మహేష్ నటించిన యాక్షన్ సన్నివేశాలు చూసినప్పుడు చాలా ఇంటెన్సిటి కనిపిస్తుంది అని అన్నారు . ఆయన ఇంటెన్స్ వల్ల ఏ రచయితకైనా తన పని ఈజీ అవుతుంది. చాలా మంది రచయితలు మహేష్ గురించి అదే చెప్తారు అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. విశాల్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు. యుద్ధంతో రాసిన ప్రేమకథగా, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటుగా సిని ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇటీవల ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 9.6 టిఆర్పి వచ్చింది. ఈమధ్య కాలంలో విడుదలై, హిట్ అందుకున్న పలు మూవీస్ కంటే కూడా ఇది ఎక్కువ.
వెండితెర పై సూపర్ హిట్ అయిన సీతారామం ఇటు టెలివిజన్ ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇక్కడ కూడా సత్తా చూపించింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ 51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెట్టిన పెట్టుబడి తేవడమే కాకుండా 30 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా రూ.80 కోట్ల క్లబ్లో చేరింది.
ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్‌కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు, తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్‌లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.
వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.


