నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతకాలం వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ‘ సింహా ‘ మూవీ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఘనత బోయపాటి కే దక్కుతుంది. ఒకరకంగా చెప్పాలి అంటే బాలయ్య లోని మాస్ సింహాన్ని నిద్ర లేపిన డైరెక్టర్ బోయపాటి.
సింహ తర్వాత తన మూవీస్ తిరిగి వరసగా ఫ్లాప్ అవుతున్న సందర్భంలో తిరిగి బోయపాటి కాంబోలో లెజెండ్ అనౌన్స్ చేశాడు బాలయ్య. లెజెండ్ నిజంగానే లెజెండ్రీ సెన్సేషన్ సృష్టించింది. వీళ్ళ ఇద్దరిదీ తిరుగులేని కాంబినేషన్ అనడానికి నిదర్శనంగా లెజెండ్ నిలబడింది.

తర్వాత కొంతకాలానికి తిరిగి వీళ్ళ కాంబినేషన్లో సెట్ అయిన మూవీ ‘అఖండ’. హ్యాట్రిక్ కొట్టడం కన్ఫామ్ అనుకున్న మూవీ కాస్త తిరుగులేని హిట్ గా నిలిచింది. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ 100 కోట్ల మార్కెట్ టచ్ చేసింది. కుర్ర హీరోలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికెల పడుతున్న ఈ టైంలో బాలకృష్ణ అఖండ బాక్సాఫీస్ ను బంతాట ఆడింది. అక్కడితో ఆగకుండా ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా తన సత్తా చూపింది. చివరకు గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ‘అఖండ’ స్క్రీనింగ్ అయ్యింది.

ప్రస్తుతం వీళ్ళిద్దరి లెజెండరీ కాంబినేషన్ లో ఇంకో సెన్సేషనల్ మూవీ కు ప్లానింగ్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఓ పుకారు షికారు చేస్తోంది. దానికి తోడు ఈ చిత్రం కోసం ఏకంగా నలుగురు ప్రఖ్యాత నిర్మాతలు పోటీ పడుతున్నారట. మరి కాంపిటీషన్ ఏ లెవెల్ లో ఉందో ఊహించండి. ఇంతకీ ఆ నలుగురు నిర్మాతలు ఎవరా అని అనుకుంటున్నారా.. ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, సూర్యదేవర నాగవంశీ, రామ్ ఆచంట మరియు సుధాకర్ చెరుకూరి ఈ రేస్ లో మందంజలో ఉన్నారు. మరి వీళ్లల్లో ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో , బాలయ్య వీళ్ళల్లో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు తెలియాలంటే వేచి చూడాలి.

మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్‌ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.
హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్‌గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.










కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.


ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.
జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.
















