అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 .
బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ దేశమే ఉలిక్కిపడే క్రైమ్ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకీ అతడు నేరస్థుడిని ఎలా పట్టుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రమే ‘హిట్: ది సెకెండ్ కేస్’. ఈ చిత్రం మంచి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది.

అయితే ఈ చిత్రం లో ఒక సైకో కిల్లర్.. ఒక అమ్మాయి ని దారుణంగా హింసించి చంపుతాడు. మర్డర్ కి గురైంది ఒక అమ్మాయి మాత్రమే కాదు ఆ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కలిసి ఉందని రివీల్ అవుతుంది. దీన్ని పోలీస్ ఆఫీసర్ ఎలా చేధించాడు అన్నదే కథ. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయి చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

” నాని గారు నిర్మిస్తున్న అన్ని హిట్ సినిమాల్లో అమ్మాయిలే చనిపోతున్నారు కదా.. నాని గారు మీరు తీసే నెక్స్ట్ హిట్ 3 సినిమాలో ఒక అమ్మాయి కిల్లర్ గా ఉండాలి.. అబ్బాయిలను చంపాలి. మీకు చేతకాకపోతే చెప్పండి నేనే ఆ రోల్ చేస్తా..” అంటూ ఒక అమ్మాయి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ గా స్పందిస్తున్నారు.

నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ త్రిపిరినేని నిర్మించిన చిత్రం హిట్ 2. ఈ క్రైమ్ థిల్లర్ మూవీ కి హిట్ మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను నే దర్శకుడు. హిట్ సినిమాకి సీక్వెల్ గా రావడం, ట్రైలర్స్, పాటలు కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది.
watch video:
Nijamga chesina chesela undi… 🥴🥴 #Hit2TheSecondCase #Hit2 #Hit2Review #Nani #AdiviSesh https://t.co/PT3HKDzcxi
— Hemanth Kumar Pedhiredla (@BelieverHemanth) December 3, 2022






రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.
మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.





ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.













