మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో హీరోయిన్ మరియు డ్యూయెట్స్ లేకుండా ఒక సినిమా చెయ్యడం ఇదే తొలిసారి..పూర్తి గా పొలిటికల్ నేపథ్యం లో సాగే ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించింది. అలాగే సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక రోల్ లో నటించాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా.
ఆచార్య తర్వాత వస్తున్నా మెగాస్టార్ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసారు. ఎట్టకేలకుఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను అయితే మెప్పించింది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించాడు.
పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినా ఈ సినిమాలో అందరూ ఇప్పుడు నటుడు సత్యదేవ్ గురించి మాట్లాడు కుంటున్నారు.ఎందుకంటే ఈయన మెగాస్టార్ కు అపోజిట్ గా నటించాడు. యువ హీరో గా వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న సత్యదేవ్ ఈ చిత్రం లో నెగటివ్ పాత్ర పోషించి మెగాస్టార్ కి ఢీ అంటే ఢీ అనే విధంగా సినిమా మొత్తం కనిపిస్తాడు.
అయితే తొలుత ఈ పాత్ర కోసం తమిళ సీనియర్ హీరో అరవింద స్వామి తో చేయించాలని చూసారు..ఇది వరకే ఆయన తెలుగు లో రామ్ చరణ్ తో ఆయన ‘ధ్రువ’ అనే సినిమా చేసాడు..ఇందులో ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే. చిరంజీవి గారి సినిమాలో అవకాశం వస్తే ఆయన వదులుకునే వ్యక్తి కాదు..కానీ అదే సమయం లో ఆయన వేరే సినిమా చేస్తుండడం వల్ల డేట్స్ సర్దుబాటు చెయ్యలేకపోయాడు..
ఇక ఆ తర్వాత ప్రముఖ హీరో గోపీచంద్ ని సంప్రదించారట. అయితే హీరో గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ఉండడం తో, విలన్ గా చేస్తే ఆ స్టార్ స్టేటస్ దెబ్బతింటుందని చెయ్యడానికి ఒప్పుకోలేదట.
ఇక చివరికి సత్యదేవ్ ని సంప్రదించగానే ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమాని చేసాడు..దానిని ఫలితం ఎలా ఉందొ ఇప్పుడు మన అందరం చూస్తున్నాం.మెగాస్టార్ అంతటి నటుడి ఎదురుగా విలన్ గా నటించాలి అంటే మాములు విషయం కాదు.అది కూడా ఆయనకు ధీటుగా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. మరి సత్యదేవ్ అలాంటి నటనతోనే మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు.దీంతో ఇప్పుడు ఈయన నటన గురించి అంతా మాట్లాడు కుంటున్నారు.అతడి నటనను ప్రశంసిస్తున్నారు.ఇలా గాడ్ ఫాదర్ సినిమాకు సత్యదేవ్ కూడా ఒక పిల్లర్ గా నిలిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.