తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత లవర్ బాయ్ గా పాపులర్ అయిన హీరో తరుణ్. తరుణ్ హీరోగా నటించిన చిత్రం నువ్వే కావాలి లో అతని సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది రీచా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న రీచాకు తర్వాత ఆశించినంతగా అవకాశాలు రాలేదు. చిరుజల్లు, నా మనసిస్తారా లాంటి సినిమాలు చేసినా ఆమె కు నువ్వే కావాలి సినిమా రేంజ్ సక్సెస్ మాత్రం దక్కలేదు.
తన ఫస్ట్ సినిమా హిట్ పెయిర్ అయిన తరుణ్ తో తిరిగి చిరుజల్లు సినిమా కోసం జోడి కట్టింది రీచా. తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించిన జీవీజీ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దానికి తోడు చిన్న హీరోల పక్కన తప్ప పెద్ద హీరోల పక్కన నటించే అంత ఫిజిక్ రీచాకి లేదు అని అందరూ అభిప్రాయపడడంతో ఆమెకు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు దక్కలేదు.
ఆమె కెరీర్ లో ఆమె నటించిన అతిపెద్ద హీరో అంటే ఒక్క శ్రీకాంత్ మాత్రమే అని చెప్పొచ్చు. సినీఫీల్డ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలి అంటే ఆ హీరోయిన్ కి తప్పనిసరిగా కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం ,కానీ అవి ఏవి రీచాలో లేకపోవడం ఆమెకు పెద్ద మైనస్ పాయింట్ గా మిగిలింది. నాలుగు సినిమాలు వరుస ప్లాప్ అవడంతో ఆమె ఇండస్ట్రీలోనే కనుమరుగై పోయింది.
Richa Pallod,
సినీ ఇండస్ట్రీలోబ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత ఫ్లాప్ లు ఎదురైతే మాత్రం పట్టించుకునే నాధుడే ఉండడు అనేదానికి రీచా ఒక మంచి ఉదాహరణ. ఇది కేవలం రీచా విషయంలో మాత్రమే కాదు ఇలాగే ఒక్క సినిమాలో తలుక్కుమని తర్వాత అడ్రస్ కూడా లేకుండా పోయిన తారలు మన సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.