టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పుడు పూజ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఏడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి.
తాజాగా ఆమె బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్, రణవీర్‌సింగ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి మరోసారి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం సరైన సక్సెస్ దక్కలేదు. నిజానికి పూజా తమిళ చిత్రంతోనే సినీ ఎంట్రీ ఇచ్చింది. 10 ఏళ్ల క్రితం ముగముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డేను అక్కడ ఎవరు పట్టించుకోలేదు. చాలా రోజుల తరువాత మళ్లీ బీస్ట్ చిత్రంలో విజయ్‌తో నటించినా అదృష్టం కలిసి రాలేదు. 
ఇంతకు ముందు నటి ఇలియానా పరిస్థితి కూడా ఇదే. కేడీ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర అపజయంతో ఆ తరువాత ఆమెను పక్కన పెట్టేశారు. టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న తరువాత విజయ్ సరసన నన్భన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యింది. అయితే ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందడంతో ఇలియానా అక్కడ కనిపించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాజాగా సూర్య సరసన నటించే మరో లక్కీచాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రమైనా సక్సెస్ అయ్యి పూజా పాపకు అవకాశాలు అందిస్తుందో లేదో చూడాలి.






ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసే చంద్రశేఖర్ యేలేటి. ఆ మధ్య వచ్చిన చెక్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో వచ్చే సినిమాతో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
కంత్రి, షాడో, బిల్లా వంటి ఫ్లాప్ లతో ఉన్న మెహర్ రమేష్ తెలుగులో ఇప్పటి వరకు హిట్ సినిమా తీయలేదు. ప్రస్తుతం చిరంజీవితో తీస్తున్న భోళా శంకర్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెహర్ రమేష్.
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కొరటాల శివకు ఆచార్యతో గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దీంతో ఎన్టీఆర్ 30తో కొరటాల మరో హిట్ తో సత్తా చాటాల్సి ఉంది.













































