నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవల విడుదల అయ్యింది. గత కొంత కాలం నుండి నాని ఎన్నో రకాల పాత్రలని చేస్తున్నారు. దాంతో నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది.
ఈ సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.
అసలు నాని కాకుండా ఆ పాత్ర ఇంకెవరైనా చేసుంటే అనే ఆలోచన ఊహించుకోవడం కూడా కష్టమేమో. అంత బాగా చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో అయితే నాని నటన చాలా నాచురల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ లో చిన్న పొరపాటు చేశారంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరో 1999 లో ఉన్నప్పుడు స్కూల్ లో ఒక డ్రామా వేసినప్పుడు అక్కడే అలీ కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పి వచ్చి హీరోని చిరంజీవి పోషిస్తున్న ఒక సినిమాలో చిన్నప్పటి పాత్రలో నటించాలి అని అడుగుతారు.
అయితే ఆ సంవత్సరం గురించి మనకి క్లియర్ గా చూపిస్తారు. అదే సంవత్సరం హీరో అన్నయ్య సినిమా చూస్తూ ఉంటాడు. అది కూడా వాళ్ళు థియేటర్లో చూస్తారు. కానీ అన్నయ్య సినిమా వచ్చింది 2000 సంవత్సరంలో. కొంత మంది ఏమో, “ఇదేంటి? ఒక సంవత్సరం ముందుకు వెళ్లిపోయారు?” అంటూ ఉంటే, మరి కొంతమంది ఏమో, “బహుశా ఇది 1999 సంవత్సరం చివరిలో జరిగి ఉండొచ్చు. దాంతో కొన్ని నెలల తర్వాత అంటే 2000 సంవత్సరం వస్తుంది. 2000 సంవత్సరం మొదట్లోనే అన్నయ్య సినిమా విడుదల అయ్యింది కాబట్టి ఇందులో పెద్దగా పట్టించుకోవాల్సిన విషయమేమీ లేదు. ఎందుకంటే అక్కడ పొరపాటు జరగలేదు” అని అంటున్నారు.