మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి. అందుకే తమిళ హీరోలు కూడా మనకి పరిచయం అయ్యే ఉంటారు.
తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా సూర్యకి అయితే దాదాపు తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. సూర్య సినిమా విడుదల అయితే ఒక తెలుగు హీరో సినిమాకి ఎలాంటి సందడి ఉంటుందో సూర్య సినిమా విడుదలైన థియేటర్లలో కూడా అలాంటి సందడి ఉంటుంది.
సూర్య నటించిన సినిమాలు అన్నీ దాదాపుగా తెలుగు వారికి సుపరిచితమే. సూర్య నుంచి వచ్చే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ తక్కువే అయినా.. తెలుగునాట సూర్య అభిమానులకు కొదవే లేదు. ఇటీవల సూర్య నటించిన “విక్రమ్” సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. “విక్రమ్” సినిమా క్లైమాక్స్ లో చూస్తే సూర్య పాత్రని రోలెక్స్ అనే ఒక పాత్రగా పరిచయం చేస్తారు. అయితే.. ఈ పాత్ర గురించి హీరో సూర్య ఎప్పుడో హింట్ ఇచ్చేసారు. అది మనకి అర్ధం కావడానికే ఇన్ని ఏళ్ళు పట్టిందన్నమాట.. మీకు ఇంకా అర్ధం కాలేదు కదా..? అయితే సూర్య సినిమా బ్యాక్ గ్రౌండ్ కి వెళ్లాల్సిందే.
సూర్య నటించిన “24 ” గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూర్య వాచ్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగానే ఉంటుంది. కాలాన్ని ముందుకి లేదా వెనక్కి జరపగల ఓ వాచ్ ని సూర్య తండ్రి కనుక్కుంటాడు. అయితే.. చిన్నప్పుడే తండ్రికి దూరం అయిన సూర్య యాదృచ్చికంగా వాచ్ మెకానిక్ అవుతాడు. వాచ్ లు రిపేర్ చేయడం అతనికి సరదాగా ఉంటుంది. ఈ సినిమాలో ఓ చోట “ఎక్సలెన్స్ ఇన్ వాచ్ డిజైన్ బై రోలెక్స్” అని బోర్డు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సన్నివేశం గురించిన మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రోలెక్స్” పాత్ర గురించి సూర్య అప్పుడే హింట్ ఇచ్చాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







































అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మాత్రం దూరం అయింది. తర్వాత ఆమె జంతువులపై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ క్రాఫ్ట్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవాలపై తమ వంతు ప్రేమ చూపిస్తోంది. 1986లో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమల టీ.రాజేందర్ డైరెక్షన్ లో మీథిలి ఎన్నై కాథలి అనే మూవీలో తొలిసారిగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఓవర్ నైట్ లోనే అశేషమైన పేరు సంపాదించుకొని వరుసగా 50 పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది అమల. అయితే అమల నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీతో వివాహం జరిగింది. ఆయన ఎప్పుడైతే అమలపై మనసు పారేసుకున్నారో ఆ క్షణమే లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు.
ఈ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అమల పూర్తిగా హైదరాబాదుకు మకాం మార్చింది. అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీ.. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ.. వీరిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నేవీ అధికారి గా చేస్తున్న సమయంలోనే డిప్యూటేషన్ మీద ఖరగ్పూర్ ఐఐటీ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి కూడా హాస్పిటల్లో జాబ్ చేసేది. నాగార్జునతో వివాహానంతరం అమల తల్లిదండ్రులు చాలాకాలం చెన్నై మరియు వైజాగ్ లాంటి ప్రదేశాల్లో జీవనాన్ని సాగించారు.