సెలబ్రిటీల పెళ్లి యోగం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. మరి ఇక ఆ ఆసక్తికరమైన విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. వైవాహిక జీవితంలో నయనతార అనుష్క, రష్మిక మందన్నా విజయం సాధించలేరు అని… వీళ్ళు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని.. సక్సెస్ అవ్వలేరు అని ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పారు.
అలానే ఫెయిల్యూర్ జాబితాలో ప్రభాస్ కూడా ఉన్నారని వేణు స్వామి చెప్పారు. ఒకవేళ ఈ హీరోయిన్లకి వివాహం అయినా సరే ఫెయిల్యూర్ జాబితాలో వీళ్ళు ఉంటారని వేణు స్వామి చెప్పడం జరిగింది.
ఈ సెలబ్రిటీల జాతకాల లో గురువు నీచం లో ఉన్నట్లు తెలిపారు. సమంత జాతకంలో చూసుకున్నట్లయితే గురువు నీచం లో వున్నాడని వేణు స్వామి అన్నారు. అయితే ఎప్పుడైతే కుజుడు కానీ గురువు కానీ నీచంలో వున్నారు అంటే అప్పుడు వాళ్ళు పార్ట్నర్ నుంచి ప్రేమ ఉండదని ఆయన చెప్పారు.
6 లేదా 12 స్థానాల లో కుజుడు, శని, గురువు ఉంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళు సంతోషకరమైన జీవితాన్ని పొందలేరు అని అన్నారు. సమంత కి చూస్తే శని దృష్టి కుజుడు మీద ఉందని అన్నారు. నయనతార విషయానికి వస్తే ఈమె కి పెళ్లి కలిసి రాదని ఒకవేళ పెళ్లి అయినా ఆటంకాలు తప్పవని చెప్పారు.
అలానే 2024 కి సమంతా, నయనతార, రష్మిక, పూజా హెగ్డే కెరియర్ ముగిసిపోతుంది అని 2024 వరకే వీళ్ళ కి అవకాశాలు వస్తాయని ఆ తర్వాత ఈ బ్యాచ్ అంతా కూడా వెళ్లిపోవాల్సిందే.. కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పారు వేణు స్వామి.