సినిమాలు డేట్ ని ఒకసారి ఫిక్స్ చేసి వాటిని మళ్లీ పోస్ట్ పోన్ చేసారంటే అభిమానులకి అది ఎంతో నిరాశని కలిగిస్తుంది. నిజానికి ఇదేం కొత్త కాదు చాలా సినిమాలు విడుదల తేదీ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్లీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వివిధ కారణాల వల్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కరోనా మహమ్మారి సమయంలో కూడా చాలా సినిమాలను పోస్ట్ పోన్ చేసారు. అయితే ఈ మధ్య కూడా కొన్ని సినిమాలను సినిమా మేకర్లు వాయిదా వేస్తూ వచ్చారు.
దీనితో అభిమానులకు నిరాశ కలుగుతోంది. సినిమా వస్తుంది కదా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య వరుసగా వాయిదా పడిన సినిమాల గురించి చూద్దాం.
#1. అడవి మేజర్ సినిమా:
అడవి శేష్ హీరోగా రాబోతున్న మేజర్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. జూలై 22న రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 11 కి వాయిదా వేశారు. ఫైనల్ గా ఈ సినిమాని మే 27 కి ఫిక్స్ చేశారు. కానీ మళ్లీ జూన్ 3 కి దీనిని పోస్ట్ పోన్ చేయడం జరిగింది.
#2. వెంకటేష్ వరుణ్ తేజ ఎఫ్3 :
ఎఫ్ 2 సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఎఫ్3 సినిమా పైన కూడా ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి నుంచి ఫిబ్రవరి 25 కి మొదట ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. తర్వాత ఏప్రిల్ 29 కి పోస్ట్ పోన్ చేశారు. ఆఖరికి మే 27న విడుదల కానుంది.
#3. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ:
గత ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఆఖరికి ఈ సినిమాని జూన్ 17 కు మార్చారు.
#4. విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం:
అశోకవనంలో అర్జున కళ్యాణం కూడా మూడు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. ఫైనల్ గా మే 6న ఈ సినిమా విడుదల కానుంది.
#5. నాని అంటే సుందరానికి:
ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఫైనల్ గా జూన్ 10న ఈ సినిమా రానుంది.