- చిత్రం : కన్మణి రాంబో కటీజా
- నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత తదితరులు
- నిర్మాత : విగ్నేష్ శివన్, నయనతార, ఎస్.ఎస్.లలిత్ కుమార్
- దర్శకత్వం : విగ్నేష్ శివన్
- సంగీతం : అనిరుధ్ రవిచందర్
- విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2022
స్టోరీ :
రాంబో (విజయ్ సేతుపతి) కి ఎప్పుడు అదృష్టం ఉండదు. పుట్టకతోనే దురదృష్టవంతుడిగా రాంబో పేరు తెచ్చుకుంటాడు. అలానే చిన్నప్పుడే రాంబో తన తల్లికి దూరంగా వెళ్ళిపోతాడు. ముప్పై ఏళ్ళు వచ్చినప్పటికీ రాంబో కి లవ్, మ్యారేజ్ ఏమి వుండవు.
ఈ సమయంలో రాంబో (విజయ్ సేతుపతి) కి కన్మణి (నయనతార) మరియు కటీజా (సమంత) పరిచయం అవుతారు. అయితే రాంబో కన్మణి, కటీజా ఇద్దరితోనూ ప్రేమ లో పడతాడు. సమానంగా ఇరువురినీ ప్రేమిస్తాడు. ఈ లవ్ స్టోరీ పెళ్లి వరకు చేరుతుంది. చివరికి ఈ రాంబో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? ఇద్దరినీ పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉండిపోతాడా..? అనేదే స్టోరీ.
రివ్యూ :
టీజర్, ట్రైలర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను సినిమాతో క్రియేట్ చేయలేకపోయారు. పైగా ఎక్కువగా స్టార్ క్యాస్ట్ మీద ఆధార పడ్డాడు. కామెడీ, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. కానీ సినిమా ఏమి కొత్తగా లేదు. రొటీన్ స్టోరీ లాగే వుంది. కామెడీ సినిమా లో ఎమోషన్స్ అనేవి చాలా రేర్ గా సెట్ అవుతాయి. అయితే ఈ సినిమా లో మాత్రం వర్క్ అవుట్ కాలేదు.
పైగా స్టోరీ చాలా రొటీన్ గా వుంది. ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే ప్రేక్షకులకు స్టార్ క్యాస్ట్ తప్ప సినిమా లో కొత్తదనం అయితే ఏమి లేదు. నయనతార మరియు సమంతల ఫ్యాన్ బేస్ కాస్త పెద్దది కావడం తో కమర్షియల్ గా సేఫ్ అవుతుంది మూవీ. అయితే ఆడియన్స్ ని మాత్రం మూవీ అప్ సెట్ చేస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- అనిరుధ్ సంగీతం
- స్టార్ క్యాస్ట్
- కామెడీ
మైనస్ పాయింట్స్ :
- కామెడీ సినిమాలో ఎమోషన్స్
- రొటీన్ స్టోరీ
- సినిమాటోగ్రఫీ & ఆర్ట్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
కన్మణి రాంబో కటీజాను ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే. స్టోరీ రొటీన్ గా ఉండడం వలన బోర్ కొడుతుంది. కానీ నయనతార సమంతల ఫ్యాన్ బేస్ తో కమర్షియల్ గా సేఫ్ అవుతుంది మూవీ.