ప్రస్తుతం ఎస్ ఎస్ తమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో వరసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు తమన్. ఇలా టాప్ సినిమాలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నారు ఈ టాప్ సంగీత దర్శకుడు.
ఈ నేపధ్యంలో తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రెబల్ సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని చెప్పారు. మొదటి రెబల్ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం అందించాలి. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుండి తమన్ తప్పుకున్నారు. ఈ సినిమా నుండి తానే వాకౌట్ చేసాను అని చెప్పారు తమన్. ఏదో ఐడియా వచ్చిందని, తానే మ్యూజిక్ కంపోజ్ చేస్తాను అని లారెన్స్ చెప్పారు అని, దాంతో ఈ సినిమా నుండి బయటికి వచ్చేశాను అని తమన్ చెప్పారు. ప్రస్తుతం తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన అఖండ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.