జైభీమ్ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. లాయర్ చంద్రు రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అంటూ చాలానే వారలు వచ్చాయి. లాయర్ గా సూర్య పోస్టర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై మరింత ఎక్కువగా అంచనాలు పెరిగాయి.
సినిమాకి ఎంతో ముఖ్యమైన చంద్రు పాత్ర పోషించిన సూర్యకి కూడా మళ్లీ ఒక మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. అడ్వకేట్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయారు సూర్య. అలాగే మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, రావు రమేష్, మరొక హీరోయిన్ రజిషా విజయన్ కూడా బాగా నటించారు. అక్కడ అక్కడ కొంచెం డల్ గా అనిపించినా కూడా, స్టోరీ చాలా బలంగా ఉండడంతో అలాంటి పొరపాట్లు ఏవి పెద్దగా కనిపించవు. చివరికి ఏమవుతుంది అనే ఉత్కంఠతో సినిమా సాగుతుంది.
సూర్యతో పాటు ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉంది. చిన్నతల్లి పాత్ర. లిజోమోల్ జోస్ ఈ పాత్రలో నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పడం బెటర్. ఆమె భర్త గా నటించిన రాజన్న అనుకోని పరిస్థితుల కారణంగా జైలుకి వెళ్ళాల్సి రావడంతో ఏమి చెయ్యాలో తెలియక అడ్వొకేట్ చంద్రు సాయం కోరుతుంది. ఈ పాత్ర లో నటించిన లిజోమోల్ కు చాలా మంచి పేరు వస్తోంది.
నిజానికి ఈ అమ్మాయి ఎవరో కాదు సిద్ధార్థ్ హీరోగా వచ్చిన “ఒరేయ్ బామ్మర్ది” సినిమాలో హీరోయిన్. ఈ సినిమా కూడా ఓటిటిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. లిజోమోల్ నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం జైభీమ్ సినిమాతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. లిజోమోల్ సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గానే ఉన్నారు. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో 41.9k ఫాలోవర్స్ ఉన్నారు. మంచి పాత్రలను ఎంచుకుంటూ, టాలెంట్ ఉన్న నటిగా ఆమె కొనసాగుతున్నారు. ఆమె మరిన్ని అవకాశాలతో ముందుకు వెళ్లాలని కోరుకుందాం.